Brahmamudi March 8th అనామికను పక్కనపెట్టేసిన కల్యాణ్... భాస్కర్-కావ్యలను విడగొట్టిన రాజ్
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో కావ్య వచ్చి స్వప్నను ఎందుకు ఫోటోషూట్ చేశావని అడుగుతుంది. ఈ దుగ్గిరాల ఇంటిపరువు ఏమౌతుందని నిలదీస్తుంది. దీంతో తను క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి రూ.50 వేలు అడుగుతే మా అత్త లేవని చెప్పిందని స్వప్న కావ్యతో అంటుంది. పైగా పుట్టింటి నుంచి తెచ్చుకోమని ఉచిత సలహా ఇచ్చారు నా భర్త, నా అత్త. అందుకే వీళ్ల బతుకులు అందరికీ తెలియాలని అలా చేశానని స్వప్న ఫైర్ మీద చెప్తుంది.
కావ్యకు స్వప్న సలహాలు : మీ అత్త నీకు సపోర్ట్ ఇస్తుందనుకుంటున్నావా? ఆ ధాన్యలక్ష్మీతో ఆమెకు పడటం లేదు కాబట్టి నిన్ను నెత్తిన పెట్టుకున్నట్లు నటిస్తుందని స్వప్న కావ్యకు హితవు పలుకుతుంది. వాళ్లిద్దరూ ఏదో ఒకరోజు ఒకటి అవుతారు.. ఆ తర్వాత మళ్లీ నిన్ను వంటింటికే పరిమితం చేస్తారని చెప్తుంది. కాబట్టి నువ్వు నీలాగా ఉంటే ఎప్పటికీ బాగుపడవు నాలాగా మారి చూడు అన్నీ నీ కాళ్ల దగ్గరకు వస్తాయని కావ్యకు సలహాలు ఇచ్చి స్వప్న వెళ్లిపోతుంది.

ఇంటి సమస్యలపై చర్చ : మరోవైపు ఇందిరాదేవి తన భర్త సీతరామయ్యతో ఇంట్లోని విషయాలు గురించి చెప్తుంది. ధాన్యలక్ష్మి, అనామిక, స్వప్న విషయాలు చర్చించుకుంటారు. కోడలు వచ్చాక ధాన్యలక్ష్మీ మారిపోయిందని... ఆఖరికి సుభాష్ మీద కూడా ధాన్యలక్ష్మి అరిసిందని చెప్తుంది. ముందు మనం స్వప్న విషయం తేల్చాలని మాట్లాడుకుంటారు. ఇలాగే జరిగితే ఇల్లు ముక్కలు అవుతుందని కంగారు పడుతారు. వీటికి మెళ్లగా పరిష్కరం చూడాలని ఫిక్సవుతారు.
అనామికకు దూరంగా కల్యాణ్ : మరోవైపు కళ్యాణ్ గదిలోలో కవితలు రాస్తూ ఉండగా అప్పుడే అనామిక వస్తుంది. కళ్యాణ్ దిండు దుప్పటి తీసుకుని బయటకు వెళ్తుంటే అనామిక అడ్డుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అనామిక అడుగుతుంది. బయట పడుకుందామని అని కల్యాణ్ చెప్తాడు. ఈ గదిలో గాలి ఆడటం లేదా? అని అనామిక అంటుంది. జైల్లో ఉన్నవాడికి గాలి ఆడుతుంది. బయట తిరిగే వాడికి గాలి ఆడుతుంది. కానీ బయట తిరిగే వాడికి గాలిలో ఒకటి ఎక్కువ దొరుకుతుంది.. అదే స్వేచ్చ. అది లేనప్పుడు మనిషి ఉన్నా లేన్నట్లే అంటూ కవి భాషలో కల్యాణ్ చెప్తాడు.

ధాన్యలక్ష్మి కంట కల్యాణ్ : ఈ గదిని నువ్వు జైలలా ఫీలవుతున్నావా? అని అనామిక అంటుంది. ఈ గదినే కాదు ఈ ఇంటిని కూడా అలాగే ఫీల్ అవుతున్నానని కల్యాణ్ చెప్పి బయటకు వెళ్లిపోతాడు. హాల్ లో పడుకుంటాడు. దీంతో వెళ్లు నువ్వే కరెక్ట్ అని నా దారికి వస్తావు అని మనసులో అనుకుంటుంది అనామిక. హాల్‌లో పడుకున్న కల్యాణ్‌ను చూసిన ధాన్యలక్ష్మీ కంగారుగా లోపలికి వెళ్లి ప్రకాష్ ను తీసుకొచ్చి కళ్యాణ్‌ను లోపల పడుకోమని చెప్పండని చెప్తుంది. ప్రకాష్ వచ్చి కళ్యాణ్ ను నిద్ర లేపుతాడు.
కొడుక్కి ప్రకాశం పాఠాలు : ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా అని కల్యాణ్ అడుగుతాడు. నువ్వు అందరికీ కనిపించేలా ఇక్కడ పడుకుంటే నేను గదిలో ప్రశాంతంగా ఎలా పడుకుంటాననుకున్నావు అని ప్రకాశ్ అంటాడు. ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతాడు. తెలిసిందే కదా నాన్న అని కల్యాణ్ అంటాడు. దీంతో వారానికి మూడు రోజులు గొడవలు అవుతూనే ఉంటాయి.. కానీ బయటపెట్టుకుంటామా అంటూ.. ప్రకాష్ సర్దిచెప్పి కళ్యాణ్‌ను లోపలికి పంపిస్తాడు.
రాజ్ సంతోషం : ధాన్యలక్ష్మీ వచ్చి ఎవ్వరూ చూడకుండా లోపలికి పంపించారు. అనగానే ముందు కోడలికి భర్తతో ఎలా ఉండాలో అది నేర్పించు అని చెప్పి ప్రకాష్ వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు శ్వేతతో రాజ్ ఫోన్‌లో మట్లాడుతుంటాడు. ఆ కళావతి నన్ను వాళ్ల పుట్టింటికి తీసుకెళ్లి టార్చర్ పెట్టాలని చూసింది. అందుకే నేనే వాళ్లకు షాక్ ఇచ్చానని రాజ్ శ్వేతతో చెప్తాడు. ఆ బావగాణ్ని చూసుకునే కదా ఆ కళావతి తెగ రెచ్చిపోతుంది. అందుకే వాణ్ణి అక్కడే వదిలేసి వచ్చానని సంతోష పడిపోతుంటాడు రాజ్.
కావ్యకు రాజ్ సెటైర్స్ : ఒక్క విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా? ఇదంతా ఎందుకు చేస్తున్నావని శ్వేత నిలదీస్తుంది. ఎందుకేంటి? వాడిక్కడుంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉందని రాజ్ అంటాడు. కావ్యతో క్లోజ్‌గా ఉన్నాడని నీకు బాధగా ఉందా? అని శ్వేత అడగ్గానే రాజ్ అలాంటిదేం లేదని చెప్తాడు. ఇంతలో కావ్య రావడం చూసి ఫోన్ కట్ చేస్తాడు. మీ బావ రాలేదని ఫీల్ అవుతున్నావు కదా? అని రాజ్ అడిగితే ఏం లేదు అంటుంది కావ్య.
మళ్లీ భాస్కర్ ఎంట్రీ : అయితే నీ మనసు మార్చడానికి మంచి పాట పెట్టనా అని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అనే పాట పెట్టగానే కావ్య బయటకు వెళ్లిపోతుంది. తర్వాత కావ్య కిచెన్‌లో ఉంటే ఇందిరాదేవి వెళ్లి నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేసుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది. మళ్లీ మీ బావను పిలిపించు అని ఇందిరాదేవి చెప్పడంతో కావ్య సరేలే అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో భాస్కర్ మళ్లీ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. కావ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అది రాజ్ కిటికిలోంచి చూస్తుంటాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి.. కావ్యకు ప్రపోజ్ చేయమని చెప్తుంది.


Click it and Unblock the Notifications











