Brahmamudi March 9th స్వప్నకు ఆస్తి రాసిచ్చిన సీతారామయ్య.. భాస్కర్, కావ్యలకు షాకిచ్చిన రాజ్

నేటి బ్రహ్మముడి సీరియల్‌ లో స్వప్న మళ్లీ మోడలింగ్ కోసం రెడీ అవుతుంది. అది చూసిన రాహుల్... నిన్న అంత గొడవ అయింది అయినా కూడా ఇది మళ్లీ మోడలింగ్ కు వెళ్తుందని రుద్రాణితో చెప్తాడు. దీంతో అది గడప దాటనివ్వు నేను పెద్ద గొడవ చేస్తాను అని చెప్తుంది. ఇప్పుడు నువ్ వెళ్లి స్వప్నకు సపోర్ట్ చేస్తూ మాట్లాడు.. తర్వాత నేను పెద్ద గొడవ చేస్తాను అని రుద్రాణి చెప్తుంది. దాంతో రాహుల్ స్వప్న దగ్గరకు వెళ్లి నువ్వు చేసేది కరెక్ట్ అంటూ మాట్లాడుతాడు.

నాకు సపోర్ట్ చేసినట్లు చేసి నాకు వచ్చే ఆదాయం తీసుకోవాలని అనుకుంటున్నావా అని స్వప్న అంటుంది. మోడలింగ్ ద్వారా వచ్చే ఏ ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి వెళ్లిపోతుంది స్వప్న. హాల్లో అందరు ఉంటారు. స్వప్న మోడలింగ్‌ కు వెళ్లడం చూసి షాక్ అవుతారు. ఎక్కడికి అని రుద్రాణి అడగ్గా దాంతో బికినీ యాడ్ ఒకటి ఉంది. దాన్ని అగ్రిమెంట్ చేసుకుందామని వెళ్తున్నా అని స్వప్న అంటుంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Photo Credits: Disney+Hotstar

March 9th 2024 Episode number 353 in Brahmamudi Telugu Serial

ఏంటీ ఇప్పుడు నువ్ బికినీ వేసుకుంటావా అని రుద్రాణి షాక్ అయి అడుగుతుంది. అవును, మరి నువ్ వేసుకుంటావా.. అని సెటైర్ వేస్తుంది స్వప్న. ఇంతలో సీతారామయ్య వచ్చి.. నీ బిడ్డ కోసం గర్భిణీగా ఉన్నప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదని స్వప్నకు చెప్తాడు. ఇది మా స్థిరాస్తిలో ఒకటి. అబిడ్స్ షాపింగ్‌ మాల్‌కి నెలకు లక్షల్లో రెంట్ వస్తుంది. అది నీ బిడ్డకు భరోసాగా ఉంటుంది. దీన్ని నీ పేరు మీద రాశాను. అయితే.. ఈ ఆస్తిని నువ్ కానీ, ఇంకెవరైనా సరే అమ్మడానికి వీళ్లేదు. కేవలం దీనిపై వచ్చే ఆదాయం నీకు మాత్రమే చెందుతుంది అని సీతారామయ్య చెప్తాడు.

దాంతో కల్యాణ్, సుభాష్, ప్రకాశం, స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ, ధాన్యలక్ష్మీ, అనామిక రచ్చ చేస్తారు. అలా ఎలా స్వప్నకు రాసి ఇస్తారు మావయ్య. స్వప్నకు భర్త ఉన్నాడు. ఏదైనా సరే అతను పోషించుకోవాలని ధాన్యలక్ష్మి అంటుంది. అది నా భర్త స్వయంగా సంపాదించుకున్న ఆస్తి. అందులో నీకు వచ్చిన అభ్యంతరం ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది. ధాన్యలక్ష్మి, అనామికలు పెద్ద రచ్చ చేస్తారు. చివరకు ఇందిరాదేవి వార్నింగ్ తో సైలెంట్ అయిపోతారు.

March 9th 2024 Episode number 353 in Brahmamudi Telugu Serial

ఈ ఇంట్లో పుట్టిన వారికి బారసాల కానుకగా ఒక ఆస్తి కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. అది ఇప్పుడు కాస్తా ముందుగానే అందింది అనుకోండని సుభాష్ చెప్తాడు. నాన్న మాటలకే ఎదురు చెబుతున్నావ్ అంటూ ధాన్యలక్ష్మీని ప్రకాశం తీసుకెళ్తాడు. తాతయ్య మాట కాదనే హక్కు మా అమ్మకే లేదు. నీకు ఎక్కడిది. లోపలికి వెళ్లు అని అనామికను కల్యాణ్ అంటాడు. దాంతో అనామిక వెళ్లిపోతుంది. తనకు ఆస్తి ఇచ్చినందుకు సీతారామయ్యకు చాలా థ్యాంక్స్ అని చెబుతుంది స్వప్న.

మరోవైపు కోపంగా వెళ్లిన అనామికకు తన తల్లి కాల్ చేస్తుంది. ఏం జరుగుతుందని అడుగుతుంది. ఆ స్వప్న కావ్య ఉన్నంతవరకు నా పని అయ్యేలా లేదని చెప్తుంది అనామిక. మరి మీ అత్త ఏం చేస్తుందని అడిగితే.. ఆవిడ విలన్‌కి తక్కువ కమెడియన్‌కి ఎక్కువ అని అంటుంది. ఇక కల్యాణ్ తనతో బాగుండటం లేదని చెప్తుంది. భర్తను దారికి తెచ్చుకోడానికి ఎన్నో దారులు ఉన్నాయి. దూరం పెడితే పని జరగనప్పుడు ప్రేమగా ఆదరించాలని చెప్తుంది అనామిక తల్లి.

మరోవైపు భాస్కర్ లేడని హ్యాపీగా రాజ్ హాల్లోకి వస్తాడు. కావ్యను బ్లాక్ కాఫీ తెమ్మంటాడు. రాజ్‌కు షాక్ ఇద్దామని ఇందిరాదేవి అంటుంది. దాంతో వెళ్లి ప్రొటీన్ షేక్, కాఫీ తీసుకెళ్తుంది కావ్య. మీ బావ లేడని ప్రొటీన్ షేక్ నువ్ తాగుతున్నావా అని రాజ్ అంటాడు. ఇది మా బావ కోసం. గార్డెన్‌లో ఉన్నాడని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఎవరు రమ్మన్నారు అని రాజ్ అడిగితే.. నేనే రమ్మన్నానని ఇందిరాదేవి అంటుంది. నీకు ఏమైనా ఇబ్బందా చెప్పు పంపిస్తాను అని ఇందిరాదేవి అంటే.. అలా ఏం లేదు నానమ్మఅని చెబుతాడు రాజ్.

March 9th 2024 Episode number 353 in Brahmamudi Telugu Serial

తర్వాత భాస్కర్‌కు ప్రొటీన్ షేక్ ఇచ్చిన కావ్య తన బావతో కావాలనే ఓవరాక్షన్ చేస్తుంది. అదంతా రాజ్ చూస్తుంటాడు. భాస్కర్ కూడా రాజ్‌ను చూసి డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి వాళ్లతో కూర్చుని ఉంటుంది. అదంతా చూసిన రాజ్ జెలసీ ఫీల్ అవుతాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి రాజ్‌తో మాట్లాతుంటాడు. కళావతి మొహం ఎంత కళగా వెలిగిపోతుంది. నీ మొహం ఏంట్రీ పెలవెళ బోతుంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే కళావతిని ఆ భాస్కర్ గాడు ఎగరేసుకుపోతాడు. నీ మనసులోని ప్రేమను బయటపెట్టు అని రాజ్ అంతరాత్మ అంటాడు. దాంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు.

తదుపరి ఎపిసోడ్ లో రాజ్.. కావ్య, ఆమె బావకు పెద్ద షాక్ ఇస్తాడు. కావ్యను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లు.. సినిమాకా, పబ్ కా, షాపింగ్, షికార్లు.. ఏవైనా చేసుకో నాకేం అభ్యంతరం లేదని చెప్తాడు. అది విని కావ్య, ఆమె బావ షాక్ అవుతారు. నా కారు కీస్ తీసుకో అని భాస్కర్ చేతిలో కీస్ పెడుతాడు రాజ్. మరి రాజ్ ఎందుకురివర్స్ అయ్యాడు అనేది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X