Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి రియల్ కపుల్ ఎంట్రీ.. వరుణ్, వితిక తర్వాత ఈ జంటే
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. తెలుగులో భారీ స్పందనను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సైతం దక్కించుకుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో దానిని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ఇక, ఈ సీజన్‌లోకి ఓ నిజమైన జంట రాబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీలు? ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ ఆరో సీజన్ అప్పటి నుంచే
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలెట్టబోతున్నారు. దీన్ని సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు. ఈ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు.

ప్రోమోలతోనే అంచనాలు రెట్టింపు
సాధారణంగా బిగ్ బాస్ సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందుకు అనుగుణంగానే త్వరలోనే ప్రారంభం కాబోయే ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన కొన్ని ప్రోమోలకు ప్రేక్షకుల భారీ స్పందనను అందించారు. ఇక, ఇందులో చూపించిన, చెప్పిన విషయాలు ఇప్పటి వరకూ ఉన్న అంచనాలను రెట్టింపు చేసేశాయి.

పనులు కంప్లీట్.. సక్సెస్ చేయాలని
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయినట్లు ఇప్పటికే బుల్లితెర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు నిర్వహకులు ప్రారంభ ఎపిసోడ్‌పై దృష్టి సారించారట. అలాగే, కంటెస్టెంట్లను కూడా క్వారంటైన్‌లోకి పంపే ఏర్పాట్లను చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ల ఏవీ షూట్‌లు కూడా జరుపుతున్నారు.

కంటెస్టెంట్లు ఫిక్స్.. పేర్లు బయటకు
భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 19 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. వీళ్ల పేర్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్‌లోకి రియల్ కపుల్ ఎంట్రీ
అత్యంత వైభవంగా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేందుకు నిర్వహకులు ఎన్నో రకాల వ్యూహాలతో ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే నిజమైన జంట మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిని ఈ సీజన్ కోసం ఎంపిక చేశారని తెలిసింది.

బిగ్ బాస్ చరిత్రలోనే రెండోసారిలా
బిగ్ బాస్ షో చరిత్రలో ఒక నిజమైన జంటను హౌస్‌లోకి పంపించిన దాఖలాలు లేవు. అలాంటిది 2019లో ప్రసారం అయిన మూడో సీజన్‌లో తెలుగు నిర్వహకులు టాలీవుడ్ రియల్ కపుల్ అయిన వరుణ్ సందేశ్, వితిక షేరును కంటెస్టెంట్లుగా తీసుకు వచ్చారు. వాళ్ల తర్వాత ఇప్పుడు సీరియల్ జోడీ మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిను హౌస్‌లోకి పంపిస్తున్నారని సమాచారం.

అలా వచ్చి జంటగా మారిపోయారు
మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని మొదట ఓ సినిమాలో నటించారు. అది విడుదల కాకున్నా.. వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక, మెరీనా 'అమెరికా అమ్మాయి', 'ఉయ్యాల జంపాల', 'సిరి సిరి మువ్వ' వంటి సీరియళ్లు చేసింది. రోహిత్ 'నీలి కలువలు', 'అభిలాష' సీరియళ్లు చేశాడు.


Click it and Unblock the Notifications











