Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్‌లోకి నిజమైన జంట.. వీళ్లిద్దరి లవ్ స్టోరీ గురించి తెలిస్తే!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి వచ్చిన దీనికి.. ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కారణంగానే ఇది విజయవంతంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ నేడు (సెప్టెంబర్ 4) ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి నిజమైన జంట కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు వాళ్లిద్దరి గురించి వివరాలు తెలుసుకుందాం పదండి!

ఎన్నో అంచనాలతో ఆరో సీజన్

ఎన్నో అంచనాలతో ఆరో సీజన్

తెలుగులో బిగ్ బాస్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన భాషలో వచ్చిన సీజన్లన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను అందుకున్నాయి. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని మరింత రంజుగా చూపించబోతున్నట్లు నిర్వహకులు చెప్పారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

అంగరంగ వైభవంగా మొదలు

అంగరంగ వైభవంగా మొదలు

బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా రెస్పాన్స్ భారీగానే దక్కుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాల నడుమ ఆరో సీజన్‌ను ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టేశారు.

ఎక్కువగా అలాంటి వాళ్లతోనే

ఎక్కువగా అలాంటి వాళ్లతోనే


బిగ్ బాస్ ఆరో సీజన్ విషయంలో నిర్వహకులు ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్పులు చేస్తున్నారు. అంతేకాదు, ఈ సారి కంటెస్టెంట్ల విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిని తీసుకున్నారు. వీళ్లలో ఆడవాళ్లను ఎక్కువగా తీసుకున్నారని ఇప్పటికే తెలిసింది.

బిగ్ బాస్‌ షోలోకి రియల్ జోడీ

బిగ్ బాస్‌ షోలోకి రియల్ జోడీ

అత్యంత వైభవంగా లాంచ్ అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో చాలా మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్లను తీసుకు వచ్చారు. ఇక, ఈ సారి స్పెషల్ కంటెస్టెంట్లుగా నిజమైన జంటను కూడా తీసుకు వచ్చారు. వాళ్లెవరో కాదు.. సీరియల్ నటీ నటులుగా సందడి చేసి పెళ్లి చేసుకున్న మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని.

రొమాంటిక్ సాంగ్.. స్పెషల్‌గా

రొమాంటిక్ సాంగ్.. స్పెషల్‌గా

మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని ఓ రొమాంటిక్ సాంగ్‌తో బిగ్ బాస్ స్టేజ్‌ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వాళ్లను లవ్ స్టోరీ చెప్పమని అడిగాడు. దీంతో తామిద్దరం ఎలా కలిశామో చెప్పారు. తమలో తమకు మార్పులు తెలియాలని, ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఇష్టం అని, అందుకే బిగ్ బాస్ షోలోకి వచ్చామని మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని వెల్లడించారు.

బిగ్ బాస్ చరిత్రలో రెండోసారి

బిగ్ బాస్ చరిత్రలో రెండోసారి

బిగ్ బాస్ షో చరిత్రలో ఒక నిజమైన జంటను హౌస్‌లోకి పంపించిన దాఖలాలు లేవు. అలాంటిది 2019లో ప్రసారం అయిన మూడో సీజన్‌లో తెలుగు నిర్వహకులు టాలీవుడ్ రియల్ కపుల్ అయిన వరుణ్ సందేశ్, వితిక షేరును కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. వాళ్ల తర్వాత ఇప్పుడు సీరియల్ జోడీ మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిను హౌస్‌లోకి పంపించి మజాను పంచబోతున్నారు.

వీళ్లిద్దరూ జంటగా మారారిలా

వీళ్లిద్దరూ జంటగా మారారిలా

మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని మొదట ఓ సినిమాలో జంటగా నటించారు. అది విడుదల కాకున్నా.. వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక, మెరీనా 'అమెరికా అమ్మాయి', 'ఉయ్యాల జంపాల', 'సిరి సిరి మువ్వ' వంటి సీరియళ్లు చేసింది. రోహిత్ 'నీలి కలువలు', 'అభిలాష' సీరియళ్లు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X