Bigg Boss Telugu 6: షోలో విచిత్రమైన సీన్.. రొమాన్స్ విషయంలో గొడవ.. హగ్ చేయలేదు.. టచ్ చేయలేదంటూ!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చిన షోనే బిగ్ బాస్. హిందీలో ఇది సూపర్ హిట్ అవడంతో దేశంలోని చాలా భాషల్లోనూ ఈ షోను పరిచయం చేశారు. అలా ఆదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా ఇది పరిచయం అయింది. ఎన్నో అనుమానాల మధ్య వచ్చిన ఈ షో.. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంది. ఫలితంగా ఐదు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆరోది కూడా ఇటీవలే మొదలైంది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులోకి రియల్ కపుల్ మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ కూడా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ రొమాన్స్ విషయంలో గొడవ పడ్డారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

అవన్నీ కంప్లీట్.. కొత్త సీజన్‌తో

అవన్నీ కంప్లీట్.. కొత్త సీజన్‌తో

తెలుగులో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో.. ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని సెప్టెంబర్ 4 అంటే గత ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. అక్కినేని నాగార్జునే దీన్ని కూడా హోస్ట్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌ ఎంతో సందడిగా సాగి ప్రేక్షకులకు మజాను పంచింది.

ఏకంగా 21 మందితో రికార్డులు

ఏకంగా 21 మందితో రికార్డులు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి వెళ్లారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు ఎంటర్ అయ్యారు.

ఆ జంట మాత్రం స్పెషల్‌గానే

ఆ జంట మాత్రం స్పెషల్‌గానే

గతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపారు. అందులో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు మాత్రమే జంటగా ఎంట్రీ ఇచ్చి అందరిలో స్పెషల్‌గా నిలిచారు.

భర్త తీరుపై మెరీనా అసహనం

భర్త తీరుపై మెరీనా అసహనం

బిగ్ బాస్ హౌస్‌లో సాధారణంగా ఒంటరిగా వచ్చిన వాళ్లే చాలా వరకూ జంటలుగా మారుతుంటారు. వాళ్లు రెచ్చిపోయి రొమాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జంటగా వచ్చిన మెరీనా, రోహిత్ ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో భర్త తనను సరిగా పట్టించుకోవడం లేదని మెరీనా గొడవకు దిగింది.

మీద చేయి వేసి పడుకున్నాగా

మీద చేయి వేసి పడుకున్నాగా

తాజా ఎపిసోడ్‌లో మెరీనా 'రోహిత్ నన్ను హగ్ చేసుకోడానికి, పక్కన పడుకోడానికి కూడా భయపడిపోతున్నాడు' అని చెప్పింది. అప్పుడు అక్కడే ఉన్న శ్రీహాన్ 'వీడు పడుకున్నప్పుడు చేయి వేశాడుగా' అని అన్నాడు. దీనికామె 'ఆ చేయి వేయడం కూడా బాలేదు. కెమెరాలు ఉన్నాయని భయపడుతున్నాడు' అంది. దీంతో ఇనాయా పక్కకు వెళ్లి చేసుకోండని కౌంటర్ వేసింది.

సింగిల్స్ ఉన్నాం.. ఓవర్ వద్దు

సింగిల్స్ ఉన్నాం.. ఓవర్ వద్దు

మెరీనా అబ్రహం తనతో రొమాన్స్ చేయడం లేదని ఆరోపించడంతో రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చింది. 'ఓవర్ యాక్షన్ చేయకు. ఇది మన ఇల్లు కాదు.. ఇష్టం వచ్చినట్లు ఉండడానికి' అని అన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న శ్రీ సత్య 'మీరు ఇలాంటి వాటికి గొడవ పడకండి. ఇక్కడ మేము సింగిల్స్ ఉన్నాం' అని పంచ్ వేసింది. దీంతో ఈ గొడవ చాలా మందికి విచిత్రంగా అనిపించింది.

బాత్రూంలోనూ గొడవ పడుతూ

బాత్రూంలోనూ గొడవ పడుతూ

బాత్రూంలో మెరీనా అబ్రహం ఒక కంటెస్టెంట్ గురించి రోహిత్‌కు చెప్పడం మొదలు పెట్టింది. అయితే, అతడు మాత్రం తన బాడీని అద్దంలో చూసుకుంటున్నాడు. దీంతో మెరీనాకు కోపం వచ్చి అతడిపై సీరియస్ అయింది. దీంతో రోహిత్ 'మరీ ఓవర్ చేస్తున్నాం. ఇవి తగ్గించుకుంటే మంచిది' అంటూ ఆమెపై కోప్పడ్డాడు. మొత్తానికి వీళ్ల వ్యవహారం తెగ హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X