Bigg Boss Telugu 6: షోలో శృతి మించిన రొమాన్స్.. కెమెరాలు ఉన్నా ఆ పనులు.. పక్క వాళ్లను వెళ్లిపోమని!

పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే కంటెంట్‌తో నడిచే షోనే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుని ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్‌ను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఇలాంటి షో ఎప్పుడూ రాకపోయినా ఆడియెన్స్ మాత్రం దీన్ని త్వరగానే వంటబట్టించుకున్నారు. ఫలితంగా ఈ రియాలిటీ షో చాలా సీజన్లను పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఆరోది కూడా ఇటీవలే ప్రారంభం అయింది. మొదటి నుంచే మజాను పంచుతోన్న ఈ సీజన్.. ప్రేక్షకుల అభిమానాని చూరగొంటూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బుల్లితెర నిజమైన జంట మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

అంచనాలకు తగ్గని కంటెంట్‌తో

అంచనాలకు తగ్గని కంటెంట్‌తో

బిగ్ బాస్‌కు తెలుగులో దక్కేంత ఆదరణ మరే షోకూ రావడం లేదు. గతంలో వచ్చిన అన్ని సీజన్లు సూపర్ హిట్ అవడానికి కారణం ఇదే. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఆరో సీజన్‌లో మరింత మజాను అందిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను రంజుగా నడిపిస్తున్నారు.

21 మందిలో వాళ్లిద్దరూ స్పెషల్

21 మందిలో వాళ్లిద్దరూ స్పెషల్


గత సీజన్ల కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు మాత్రమే జంటగా వచ్చి స్పెషల్‌ అని అనిపించుకున్నారు.

ఇద్దరున్నా ఒక కంటెస్టెంట్‌గానే

ఇద్దరున్నా ఒక కంటెస్టెంట్‌గానే

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి బుల్లితెర నిజమైన జంట రోహిత్ సాహ్ని, మెరీనా అబ్రహం జంటగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, గతంలో వరుణ్ సందేశ్, వితిక షేరు మాదిరిగా వీళ్లను వేరు వేరే కంటెస్టెంట్లుగా పరిగణించకుండా ఒకటిగా నిర్ణయించారు. అంటే వీళ్లు ఇద్దరున్నా ఒక కంటెస్టెంట్ కిందే లెక్క. మొత్తానికి వీళ్లిద్దరిలో ఒకరు తప్పు చేసినా ఇద్దరూ బయటకు వెళ్లిపోతారన్న మాట.

హగ్ కోసం గొడవ.. నాగ్ ఆఫర్‌తో

హగ్ కోసం గొడవ.. నాగ్ ఆఫర్‌తో

గత వారం జరిగిన ఓ ఎపిసోడ్‌లో మెరీనా ‘రోహిత్ నన్ను హగ్ చేసుకోడానికి, పక్కన పడుకోడానికి కూడా భయపడిపోతున్నాడు. ఆ చేయి వేయడం కూడా బాలేదు. కెమెరాలు ఉన్నాయని అనుకుంటున్నాడు' అని ఫీల్ అయిపోయింది. దీంతో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వాళ్లిద్దరినీ హగ్ చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో అందరి ముందే ఇద్దరూ కౌగిలించుకున్నారు.

మెరీనా, రోహిత్ ఫుల్ రొమాన్స్

మెరీనా, రోహిత్ ఫుల్ రొమాన్స్

భార్య భర్తల్లా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ మాత్రం పెద్దగా కలిసి ఉండడం లేదు. కానీ, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం వీళ్లిద్దరూ రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు. కెమెరాలు ఉన్నాయని కూడా పట్టించుకోకుండా ఒకరి కౌగిట్లో ఒకరు బంధీలు అయిపోయారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో వీళ్ల వ్యవహారమే బాగా హైలైట్ అయిందని చెప్పొచ్చు.

పక్కకు వెళ్లిపో అని ఓవర్‌గానే

పక్కకు వెళ్లిపో అని ఓవర్‌గానే

మొదటి వారంలో చాలా కంట్రోల్‌గా ఉన్న మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ.. ఇప్పుడు మాత్రం పక్క వాళ్లను కూడా పట్టించుకోకుండా ముద్దులు, హగ్గులతో రచ్చ చేశారు. అంతేకాదు, వీళ్లను పక్కనే ఉండి చూస్తున్న నేహా చౌదరితో మెరీనా ‘నువ్వు పక్కకు వెళ్లు.. మేము రొమాన్స్ చేసుకోవాలి' అని అనేసింది. దీంతో చేసేదేం లేక ఆమె వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది.

నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది

నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది

ఇక, మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీ రొమాన్స్‌ను పక్కనే ఉండి చూసిన నేహా చౌదరికి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అంతేకాదు, ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాక్కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది' అంటూ మనసులోని మాటను చెప్పేసింది. ఇక, ఈ వ్యవహారంతో బిగ్ బాస్ షోపై వస్తున్న విమర్శలు మరింతగా పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X