twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 5: ఆర్టిస్ట్ ప్రియ ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

    |

    మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఆర్టిస్ట్ ప్రియా బిగ్ బాస్ లోకి అడుగు పెడుతుందని ఎవరూ ఊహించలేదు. బిగ్ బాస్ సీజన్ 1 మొదలైనప్పటి నుంచి కూడా దాదాపు హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ అందరి గురించి కూడా ఏదో ఒక విషయం లీక్ అవుతూ వచ్చింది. కానీ సీజన్ 5 లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆర్టిస్ట్ ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆర్టిస్ట్ ప్రియకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా బలంగా నిలిచింది.

    అందమైన చిరునవ్వుతో ఎక్కువగా ఆకట్టుకున్న ఆర్టిస్ట్ ప్రియా మళ్ళీ చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. వారి ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది.

    మొదట్లోనే దెబ్బ..

    మొదట్లోనే దెబ్బ..

    బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగు పెట్టిన మొదట్లోనే ఆర్టిస్ట్ ప్రియా కు ఎదురు దెబ్బ తగిలింది. హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా క్యాప్టెన్ అవ్వాలని ఎంతో బలంగా పోరాడుతూ ఉంటారు. కానీ ప్రియకు మాత్రం మొదట్లోనే బిగ్ బాస్ పెట్టిన కండిషన్ కారణంగా ఆ అవకాశం రాలేదు. ఇక చివరికి 5వ వారం కెప్టెన్ గా గెలిచి మంచి అవకాశాన్ని అందుకుని తన టాలెంట్ ఏమిటో చూపించింది.

     తెలివిగా వెళ్లిన ప్రియ

    తెలివిగా వెళ్లిన ప్రియ

    బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని మించి మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే వాటన్నింటినీ తట్టుకుని ముందుకు సాగాలి అంటే చాలా ఓపిక కూడా ఉండాలి.ఆ విషయంలో ప్రియ మాత్రం చాలా తెలివిగా గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. ఇతరులు తొందరపడి ఒక మాట ఉన్నప్పటికీ ప్రియ మాత్రం మొదట్లో ఉన్న మాట మాత్రమే చెప్పుకొచ్చింది. కానీ శ్వేతా విషయంలో మాత్రం కాస్త తడబడింది. ఇప్పటికీ కూడా చివరికి ప్రియ ఎలాంటి తప్పు లేదని కూడా తెలిసిపోయింది.

    ఆ గొడవ కారణంగా

    ఆ గొడవ కారణంగా

    ఇక బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియా సోషల్ మీడియాలో హడావిడి గా కనిపించింది. బిగ్ బాస్ కంటే ముందు వరకు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా బిజీగా కనిపించేది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ దాటేసింది. ఇక సన్నీతో బిగ్ బాస్ హౌస్ లో గొడవ పడిన విధానం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అదే ఆమెను హౌస్ లో నుంచి వెళ్లిపోయేలా చేసింది. ఇక ప్రియా ఏడో వారం బయటకు వెళ్లి పోయిన విషయం తెలిసిందే.

    Recommended Video

    అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
    పెళ్లి వేడుకలు షురూ

    పెళ్లి వేడుకలు షురూ

    బిగ్ బాస్ వివాదాలు పక్కనపెడితే శనివారం రోజు ఆర్టిస్ట్ ప్రియా తన ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి అని ఒక పోస్ట్ చేసింది. ప్రియకు వరుసకు కూతురయ్యే లోహితకు వివాహం జరిగింది. ఈ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొన్నారు. జెస్సి ఉమాదేవి సరయు పెళ్లి హడావిడిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక ఆర్టిస్ట్ ప్రియా కూడా ఇన్స్టాగ్రామ్ లో పెళ్లికి సంబంధించిన వివిధ రకాల వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

    English summary
    Marriage vibes in artist priya family bigg boss 5 contestants attend
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X