ఈ రోజే టీవీలో వేసేస్తున్నారు...ఎంజాయ్ చెయ్యండి
హైదరాబాద్ : తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చి మంచి హిట్టైన కామెడీ చిత్రం లవర్స్. ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలైంది. అయితే ఈ రోజు సాయింత్రం జీ తెలుగులో 6.30 గంటలకు మీరు మళ్లీ చూడొచ్చు. కామెడీ చిత్రం కావటం, రిలీజయ్యి ఎక్కువ కాలం కాకపోవటంతో టీఆర్పీలు అదురుతాయని భావిస్తున్నారు.
‘లవర్స్'. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే కురిపించింది. ఈ చిత్రంలో సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి పాత్ర హైలెట్ కావటం కలిసి వచ్చింది. మంచి కామెడీ సినిమాగా టాక్ రావటంతో ఫ్యామిలీ ప్రేక్షకులతో వీకెండ్స్ లో బాగానే వర్కవుట్ అయ్యింది.
మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మించిన ‘లవర్స్'కు ఆయన దర్శకుడు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించారు.

హరినాధ్ మాట్లాడుతూ... ‘‘సన్నని లైన్ మీద ఆధారపడి తీసిన ఈ సినిమా మేం ఆశించినట్లు ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యింది. అన్ని సన్నివేశాలు, పాటలు బాగా ఉన్నాయని టాక్ రావడానికి అదే కారణం. ఫస్టాఫ్ డల్‌గా, సెకండాఫ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా ఉందని కొంతమంది అభిప్రాయపడిన మాట నిజం. ఎంటర్‌టైన్‌మెంట్ లెవల్స్‌ను క్రమేణా పెంచుకుంటూ పోవాలని స్ర్కీన్‌ప్లే తయారుచేసుకున్నాం. అందువల్లే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదివరకు కలిసి చేయని జంటయితే బాగుంటుందనుకున్నాం. ఆ పాత్రలకు సుమంత్ అశ్విన్, నందిత బాగా సూటవుతారని తీసుకున్నాం. మా అభిప్రాయం కరెక్టని వారు నిరూపించారు. ఇంటర్మీడియేట్ నుంచి ఇంజనీరింగ్ దాకా చదివే స్టూడెంట్స్‌గా ఆ ఇద్దరూ తమ పాత్రలను రక్తికట్టించారు. సప్తగిరిని చాలా ముందుగానే ఎంచుకున్నాం. సినిమాకు అతను ఎంత ప్లస్సయ్యాడనేది నేను చెప్పాల్సిన పనిలేదు అన్నారు.'' అని చెప్పారు హరినాథ్.


Click it and Unblock the Notifications











