లైవ్‌లో ఆ నటుడితో స్టార్ హీరో సిట్టింగ్... బిత్తరపోయిన సెలబ్రిటీలు

జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మాస్ జాతర కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. జబర్దస్త్ మాదిరిగా కామెడీ తరహాలో మొదలైన ఈ షో ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తోంది. హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లు ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా.. బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాస్ జాతర లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ వివరాల్లోకి వెళితే..

నిర్ణయం సినిమాలోని హలో గురు ప్రేమ కోసమే జీవితం అనే సాంగ్‌తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చి స్టేజ్ మొత్తం దద్ధరిల్లేలా బిందు మాధవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే జ్ఞానేశ్వర్ మందుబాబులం మేమే మందుబాబులం సాంగ్‌తో ఎంట్రీ ఇస్తూనే కిందపడిపోయాడు. అతనిని చూసిన హీరో నవదీప్.. బాటిల్ తీసుకొచ్చి జ్ఞానేశ్వర్ బాటిల్‌లో వాటర్ పోసి మందు కలుపుతున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. బాగా స్ట్రాంగ్‌గా ఉందన్నా.. కొంచెం నీళ్లు కలుపుకోమని జ్ఞానేశ్వర్ చెబుతాడు. వైన్స్‌లో నా పేరు చెప్పా గుర్తుందా అని అడుగుతాడు. మరిచిపోయానని నవదీప్ అనగానే.. గుమ్ముగా తాగావు అందుకే మరిచిపోయావు. నా పేరు కరేపాకు అని జ్ఞానేశ్వర్ అనడంతో అంతా నవ్వేస్తారు.

Mass Jathara Latest Promo Navdeep Bindu Madhavi amp amp Jani Master Comedy Skits Go Viral

ఆ వెంటనే జ్ఞానేశ్వర్ లేడీ వేషంలో వచ్చా నా పేరు ఏంటని అడుగుతుండగా కరేపాకు అని బిందు మాధవి అంటుంది. ఈ అమర్‌దీప్ అన్న ఇచ్చిన మందు వల్ల ఆడపిల్ల కావాల్నా.. మగపిల్లాడు కావాల్నా అని ముద్దుగా అడిగిండు. ఆడపిల్లని, మగపిల్లాడిని కలిపి ఒకటే ప్రొడక్ట్‌లో కలిపి ఇచ్చుండు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడపిల్ల లెక్క ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు మగపిల్లాడిలా ఉంటాడని అంటుంది తల్లి గెటప్‌లో ఉన్న అమ్మాయి. దీనికి నవదీప్ కౌంటర్ వస్తూ.. మీరు జంబలకిడి పంబ గురించి విని ఉంటారు.. కానీ ఇది జంబ లకిడి గిల్మా బోత్ ఆర్ నాట్ సేమ్ అనడంతో కడుపుబ్బా నవ్వుకుంటారు.

తమలపాకు, సోంపు అంటూ తన ప్రేమ కథతో మరోసారి నవ్వించే ప్రయత్నం చేశాడు జ్ఞానేశ్వర్. నేను నీకోకటి చెప్పాలని అబ్బాయి అంటుండగా.. లవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెళ్లే అంటాడు. పెళ్లి చేసుకుందాం కానీ నువ్వు మార్నింగ్ షిఫ్ట్ ఆఫీసుకు వెళ్లిపోవాలి, నేను నైట్ షిఫ్ట్‌కి వెళ్లాలని చెబుతాడు. అలాగే మనం ఫస్ట్ నైట్ చేసుకోవద్దని రెండు కండీషన్లు పెట్టడంతో దాని కోసమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని కోపంగా వెళ్లిపోతాడు లవర్.

వెంకీ మంకీ అన్నయ్య సినిమాలోని రెయిన్ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు. మీ తాతయ్య ఎన్నో పాపాలు చేసి పైకి పోయాడట కదా? అని అమ్మాయి అంటుంది. మా బామ్మ పోతూ పోతూ తిరిగి స్వర్గంలో కలుసుకుందాం అని చెప్పింది. ఆవిడ ఎక్కడ కలుస్తాడోనని పాపాలు చేసి నరకానికి వెళ్లాడని వెంకీ చెప్పడంతో అంతా నవ్వుకుంటారు. మా ఆయన మీద నాకు అనుమానంగా ఉందని ఆ అమ్మాయి వెంకీ గురించి ఒకతనికి చెబుతుంది. మొన్న మీ ఆయన నడిరోడ్డు మీద ఒక అమ్మాయిని చేయి పట్టుకుని అని చెప్పబోతూ అతను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడంతో ఏం జరిగిందోనని ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంది. దాంతో భర్తలపై అనుమానంతో భార్యలంతా చితకబాదుతారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మే 23, 24 తేదీలలో ప్రసారమయ్యే మాస్ జాతర ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read more about: navdeep bindu madhavi jani master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X