For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వంటల షోపై మరో క్లారిటీ ఇచ్చిన తమన్నా.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

  |

  సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొంత కాలంగా విభిన్నమైన తరహాలోనే సినిమాలు చేస్తోంది. పూర్తిగా మాస్ సినిమాలను రెగ్యులర్ సినిమాలను తగ్గించేసి కాస్త డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సినిమాలో కూడా ఈ బ్యూటీకి అంత కలిసి రావడం లేదు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు కొనసాగుతోంది. అలాగే డిఫరెంట్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక బుల్లితెరపై కూడా హోస్ట్ గా చేయడానికి సిద్ధమవుతోంది.
  త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ అనే రియాల్టీ షోలో హోస్ట్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా ఈ షో కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

  అలాగే తమన్నా లోకేషన్స్ లో దిగిన గ్లామరస్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తమిళంలో విజయ్ సేతుపతి ఈ షోకు హోస్ట్ గా సెలెక్ట్ అవ్వగా తెలుగులో మాత్రం తమన్నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆమె తన సరికొత్త టాలెంట్ ఆ బాధ్యతకు సరైన న్యాయం చేస్తుందని సేతుపతి ఒక ప్రోమో లతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమన్నా భాటియా ఇటీవల కాలంలో వెండితెరపై అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ అవ్వడం లేదు.

  Masterchef Telugu starts August last week says tamnannah

  గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె కరోనా వలన మరొక సినిమాతో రాలేదు. స్పెషల్ సాంగ్స్ అయితే ఆమె రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే అందుకున్నట్లు సమాచారం. ఇక చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. అంతేకాకుండా నెగిటివ్ పాత్రలో కూడా నటించడానికి ఒప్పుకుంది.

  ఇక జెమినీ టీవీ లో ప్రసారం కాబోయే కుక్కింగ్ మాస్టర్ చెఫ్ షో ఈ నెల చివర్లో మొదలు కానున్నట్లు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. తమన్నా సెట్స్ లోనే ఉంటూ ఇంతవరకు తాను ఇంత పెద్ద సెట్ చూడలేదు అని తప్పకుండా షో అందరిని ఎట్రాక్ట్ చేస్తుందని వివరణ ఇచ్చింది. సరికొత్త వంటలతో తెలుగువారిని టార్గెట్ చేస్తున్న తమన్నా ఈ ప్రయోగంతో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి. ఇక ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే నితిన్ తో మాస్ట్రో సినిమాను పూర్తి చేసింది. హిందీ మూవీ అందాదున్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ సినిమాలో తమన్నా పూర్తిగా నెగెటివ్ పాత్రలో కనిపించనుంది.

  అదే పాత్రను హిందీలో టబు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇక వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. గోపీచంద్ తో పూర్తి చేసిన సిటీ మార్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో బోలె చుడియా అనే ఒక సినిమాకు కూడా వర్క్ చేస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలలో గుర్తుంది శీతాకాలం మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. మరి ఈ సినిమాతో తమన్నా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

  English summary
  Masterchef Telugu starts August last week says tamnannah, There are far more talented actors out there than even the top star heroes in the Kollywood industry. Especially an actor like Vijay Sethupathi is nowhere else, who is also the host of Tamil Master Chef, recently spoke about his emotional journey in a promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X