బిగ్‌బాస్ 12 ఫైనల్స్: శ్రీశాంత్ ఫిక్డ్స్ విన్నర్? అంతా మోసం... భగ్గుమంటున్న నెటిజన్లు!
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా రన్ అవుతున్న హిందీ 'బిగ్‌బాస్ 12' ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. విజేత ఎవరు? అనేది ఈరోజు సాయంత్రం జరిగే షోలో తేలిపోనుంది. అయితే ఫైనల్‌కు చేరిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్ విజేతగా నిలుస్తాడనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో 'షేమ్ ఆన్ బిగ్ బాస్', 'బిగ్ బాస్ చీటెడ్ వ్యూవర్స్' అనే యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
బిగ్ బాస్ 12 నిర్వాహకులు ప్రేక్షకుల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారని, విజేత ఎంపిక సక్రమంగా జరుగడం లేదని, శ్రీశాంత్‌ను విజేతగా నిలబెట్టాలని ముందే ఫిక్సై షో నిర్వాహకులు... ప్రేక్షకులను మానిప్యులేట్ చేస్తూ అతడికి అనుకూలంగా ఓట్లు పడేలా గేమ్ రన్ చేశారని కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు.

బిగ్‌బాస్ చరిత్రలోనే వరస్ట్ షో అంటూ
శ్రీశాంత్‌ను విజేతను చేసేందుకు మోస పూరితంగా గేమ్ రన్ చేశారని, షో నిర్వాహకుల సపోర్టు వల్లనే శ్రీకాంత్ ఎంత చెత్తగా గేమ్ ఆడిన 104 రోజల పాటు ఇంట్లో ఉండగలిగాడు... బిగ్ బాస్ చరిత్రలోనే ఇది వరస్ట్ సీజన్ అంటూ కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు.

ఆడియన్స్ వేసే ఓట్లకు విలువ లేకుండా...
ఒకప్పుడు బిగ్ బాస్ షో అంటే రియాల్టీగా ఉండేది. కానీ ఇపుడు షో జరుగుతున్న తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఆడియన్స్ వేసే ఓట్ల ప్రకారం ఎలిమినేషన్స్, విజేతలను ఎంపిక జరుగడం లేదని మరికొందరు ట్విట్టర్ ద్వారా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షో విన్నర్ శ్రీశాంత్?
కాగా... బిగ్ బాస్ 12 ఫైనల్స్‌కు శ్రీశాంత్, దీపిక కక్కర్, దీపిక్ ఠాకూర్ చేరుకోగా వీరిలో శ్రీకాంత్ విజేతగా నిలవడం ఖాయం అనే ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజం ఏమిటనేది నేడు(డిసెంబర్ 30) ప్రసారం కాబోయే షోలో తేలనుంది.

కౌశల్ ఆర్మీ కూడా ఇదే తరహాలో
ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ మండ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీకి మద్దతుగా ఏర్పాటైన ఆర్మీ కూడా షో జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో షో హోస్ట్ నాని వ్యవహార శైలిని కూడా కౌశల్ ఆర్మీ తప్పుబట్టింది.


Click it and Unblock the Notifications











