కొత్త అవతారం, సామాన్యుడి కోసమే: నాగార్జున (ఫోటోలు)
హైదరాబాద్: హిందీలో బాగా పాపులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో ఇపుడు తెలుగు వెర్షన్ ప్రారంభమైంది. నాగార్జున వ్యాఖ్యాతగా మాటీవీ వారు రూ. 1 కోటి బహుమతితో తెలుగులో తొలిసారి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ఈ గేమ్ షోకి రూపకల్పన చేసారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ షో ను మాటీవీ సంస్థ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ... 'తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో నెంబర్ వన్ స్థానానికి మాటీవీ చేరుకోవడం హ్యాపీగా ఉంది. దానిని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో పాటు, సామాన్యుడి కల నెరవేర్చాలన్న సదాయశయంతో ఈ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోని రూపొందించాం అన్నారు.
ఈ షో ద్వారా అందరినీ విజ్ఞానవంతులను చెయ్యాలన్నదే మన మాటీవీ వారి ఆకాంక్ష. దీని ద్వారా నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి షో ల వల్ల మనపై మనకు మరింత నమ్మకం ఏర్పడుతుంది అన్నారు.

సామాజిక బాధ్యతగా...
ఒక సామాజిక బాధ్యతగా ఈ షోని చేసేందుకు నేను అంగీకరించాను. ఒక్కమాటలో చెప్పాలంటే బుల్లితెరపై నేను ఎత్తుతున్న కొత్త అవతారమిది' అని అన్నారు నాగార్జున.

తొలి అవకాశం అమల...
'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో వేదికపై నాగార్జున, అమల దంపతులు ఓ ట్రైల్ షో చేశారు. అందులో భాగంగా అమల కొన్ని ప్రశ్నలను నాగార్జునకు అడిగారు.

సందడిగా సాగింది
నాగార్జున-అమల మధ్య సాగిన సంబాషణ వారి వ్యక్తిగత విసయాలను గుర్తు చేస్తూ సందడి నెలకొంది.

ఈ షో నిర్మాత ఎవరు?
'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోను నిర్మాత సిద్దార్థ బసు నిర్మిస్తున్నారు.

సామాన్యుడి కల నెరవేరాలని
కోటీశ్వరులు కావాలని చాలా మంది సామాన్యులు కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు.

విజ్ఞానవంతులను చేసే షో...
ఈ షో ద్వారా ప్రేక్షకులకు కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు... విజ్ఞానవంతులను కూడా చేయవచ్చు.

జూన్ నుండి ప్రసారాలు
జూన్ నెల నుండి ఈ షో ప్రసారాలు మాటీవీలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











