'నీ కొంగు బంగారం కాను' అంటున్న మీనా

సాఫ్ట్ వేర్ ఉద్యోగి విధ్యాసాగర్ ని వివాహం చేసుకున్న మీనా సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది. 'విడాదే పిడి' అనే తమిళ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించారు. 'విడాదే పిడి' అంటే వదలద్దు పట్టుకో అని అర్థం. తనకెంతో ఇష్టమైన సినిమాలను వదులుకోవద్దు అన్నది ఆమె నిర్ణయం. ఈ సినిమానే కాకుండా వరసగా రియాలటీ షోలు,క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తానంటోంది.
ఈ విషయమై మీనా మాట్లాడుతూ "సినిమాలంటే నాకు చిన్నప్పటి నుండీ చాలా ఇష్టం. జీవితాంతం నటిగా కొనసాగాలనుకున్నాను. మా ఆయన కూడా నా ఇష్టాన్ని వ్యతిరేకించకపోవడం తో ఈ చిత్రం లో నటించడానికి సమ్మతించాను" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'శ్రీ వాసవి వైభవం' వంటి భక్తి రసాత్మక చిత్రంలో నటిస్తున్న మీనా, ఇకపై తన స్థాయికి తగిన పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకుంది.
రీసెంట్ గా తమిళ్ హీరో విజయ్ మీనాని సంప్రదించాడని సమాచారం. గతంలో తన తండ్రి డైరెక్ట్ చేసిన 'సట్టం ఒరు ఇరుట్టరై' సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నాననీ ... ఆ సినిమాలో తనకి అక్క గా నటించమని మీనాని కోరాడట. ఊహించని ఆ మాటకి మీనా షాక్ తెలుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగిన తనని ఆ కేరక్టర్ కి అడిగినందుకు ఆమె చాలా హర్ట్ అయిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











