Brahmamudi July 5th Episode: ప్రాణాపాయ స్థితిలోనే రాజ్.. తల్లడిల్లిపోతున్న కావ్య.. పోలీస్‌స్టేషన్‌లో మీనాక్షి
తన అక్కల గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తిపై అప్పు దాడి చేయడంతో.. అప్పును పోలీసులు అరెస్టు చేస్తారు. అప్పు కోసం కనకం, మూర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అప్పు కోసం కనకం... ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు భర్త దిగులు చూసి కంగారు పడుతుంది. ఇంతలోనే మీనాక్షి అక్కడికి వస్తుంది. వచ్చిరావడంతోనే... పోలీస్ స్టేషన్ లో ఓవర్ యాక్షన్ చేస్తుంది.
మరోవైపు తన ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. సంతోషానికి కారణం ఏమిటని కావ్య అడగ్గానే రాజ్ చిరగ్గా ఫేస్ పెడతాడు. కావ్యపై సెటైర్స్ వేయాలని అనుకున్న రాజ్ ప్లాన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి ఏం జరిగిందో చెప్పమని కావ్యను అడుగుతాడు రాజ్. తాను మర్చిపోయానని బదులిస్తుంది కావ్య. రాజ్ గుర్తుచేసినా కూడా కావ్య మాత్రం ఆ విషయం ససేమిరా చెప్పనని అంటుంది. మాట మీద నిలబడటం నీకు అలవాటు లేదా..అదే నేను అయితే మాట కోసం ప్రాణం ఇస్తానని కావ్యపై మరోసారి సెటైర్స్ వేస్తాడు రాజ్.స్వప్న విషయంలో నిజం బయటపడి తన తప్పు లేదని తెలితే తన భార్యగా స్వీకరిస్తారనని మాటిచ్చినా అది నిలబెట్టుకోలేకపోయారని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. రాజ్ తన తప్పును ఒప్పుకుంటాడు.

ఇక సీన్ కట్ చేస్తే మీనాక్షి.. స్టేషన్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఎస్‌ఐ దగ్గరికి వెళ్లి ఐ వాంట్ టూ టాక్ టూ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అంటూ పిచ్చి వాగుడు వాగుతుంది. అసలే మీనాక్షిని చూస్తేనే వెర్రెక్కిపోయే ఎస్‌ఐ ఆ వాగుడు తట్టుకోలేక తలబాదుకుంటాడు. ఓ పెళ్లి కాని అమ్మాయిని అరెస్ట్ చేసేటప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి.. ఎక్కడా చూపించండి అంటూ మీనాక్షి డిమాండ్ చేస్తుంది. వీళ్లు లేడీ కానిస్టేబుల్సే కదా.. కనిపించలేదా అని ఎస్‌ఐ అంటాడు. మీరు ఇంకా ఎక్కువ సేపు గొడవ చేస్తే మిమ్మల్ని కూడా లోపల వేసేస్తాను అని ఎస్‌ఐ వార్నింగ్ ఇస్తాడు.

కారు ఎక్కే సమయంలో కావ్యను అవమానిస్తాడు రాజ్. దాంతో ఆటోలో ఇంటికి వెళ్లడానికి కావ్య సిద్ధమవుతుంది. కావ్యకు సాయం చేయబోయి ఆటో డ్రైవర్ ఇరకాటంలో పడతాడు. మొగుడుపెళ్లాల మధ్య గొడవలో దూరి అనవసరంగా చిక్కుల్లో పడ్డానని ఇద్దరిని వేడుకుంటాడు. చివరకు కావ్య ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. తన పొగరును ఇంట్లో చూపిస్తానని రాజ్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుని విడిపించడానికి పోలీసులకు లంచం ఇవ్వబోతుంది మీనాక్షి. మాటలతో పోలీసులను గందరగోళం చేస్తుంది. ఆమె ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంలో పడతారు. బలవంతంగా మీనాక్షిని బయటకుపంపిస్తారు.

కావ్యవంట చేస్తుంటుంది. తాను ఇతరుల వంట తిననని రాజ్ బెట్టు చేస్తాడు. తనకు బ్రెడ్ ఆమ్లెట్ చేయడం వచ్చునని బిల్డప్ ఇస్తాడు. కావ్యపై సెటైర్స్ వేస్తూ ఆమ్లెట్ గురించి మర్చిపోతాడు. దాంతో ఆమ్లెట్ మొత్తం మాడిపోతుంది. అలాగే తినాలని ప్రయత్నిస్తాడు. కానీ తినలేకపోతాడు. నేతితో తాళింపు వేసిన పప్పు, బెండకాయ కర్రీ అద్భుతం అంటూ రాజ్‌ను ఉడికిస్తుంది కావ్య. ఆకలితో కడుపు మండుతోన్నా... కావ్యపై కోపంతో రాజ్ తినడు. ఇంతలోనే బిచ్చగాడు రావడంతో కావ్య చేసిన వంటలను అతడికి దానం చేస్తాడు రాజ్. పంతాన్ని పక్కనపెట్టమని కావ్య సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన రాజ్ ఆమె మాటలను పట్టించుకోడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.

ఆ తర్వాత రాజ్‌కు ఆస్తమా సమస్య రావడంతో కావ్య కంగారు పడుతుంది. ఇంట్లో మెడిసిన్స్ అయిపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్లడానికి రెడీ అవుతుంది. తనకు కారు డ్రైవింగ్ రాకపోవడంతో స్కూటీపై హాస్పిటల్‌కు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











