twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది మరో అద్బుతమే: బాహుబలి టీవీ సీరియల్ "ఆరంభ్" చూసారా?

    విజయేంద్రప్రసాద్ "ఆరంభ్", దేవసేన లీడ్ రోల్ తో సాగే స్క్రిప్ట్. ఇప్పుడు ఈ బాహుబలి బుల్లితెర వెర్శన్ కూడా నెమ్మది నెమ్మది గా పుంజుకుంటోంది.

    |

    మనదగ్గరంటే సీరియల్ అనగానే కేవలం ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసమే అన్నట్టు తయారయ్యింది గానీ హాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ అలా చూడరు. గేం ఆఫ్ త్రోన్స్, బ్లడ్ అండ్ శాండ్, వంటి టీవీ సిరీస్లు సినిమా కంటే తక్కువేమీ కాదు. స్టార్ సినిమాలకు ఎంత ఆదరణ ఉందో అక్కడ టీవీ సిరీస్ లకి కూడా అంతే ఆదరణ ఉంది. మనదగ్గరే మొదలవలేదింకా ఇక బాలీవుడ్ లో కూడా హిందీ సీరియల్స్ కేవలం గృహిణులకోసమే అన్నట్టుకాక పెద్ద బడ్జెట్ తో పురాణ, జానపద కథలనీ తెరకెక్కిస్తున్నారు. అందుకే తెలుగుసినిమా బాహుబలి బేస్ తో వచ్చినా తెలుగులో తీయకుండా "ఆరంభ్" ని హిందీలో మొదలు పెట్టారు.

    దేవసేన పేరు తలుచుకోగానే

    దేవసేన పేరు తలుచుకోగానే

    టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి దేవసేన పాత్ర బాహుబలి సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది. స్వీటీ దేవసేనగా యంగ్‌లుక్, వయసు ఉడిగిన రెండు పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.దేవసేన పేరు తలుచుకోగానే ముందు గుర్తుకొచ్చేది అనుష్కనే.

    అనుష్క

    అనుష్క

    పార్ట్ 1 ఢీ గ్లామర్ రోల్ లో సెకండ్ పార్ట్ లో దేవసేన రాజకుమారి గా అనుష్క ఎంతో అద్భుతంగా తన నటన తో పాటు గ్లామర్ తో కట్టిపడేసిన సంగతి తెల్సిందే.ఇప్పుడు అదే గ్లామర్ పాత్రలో ఇంకోకరు కనిపిస్తే...??? ఎలా రిసీవ్ చేస్కుంటారు? బాహుబలి మాతృకగా అల్లుకున్న కథ "ఆరంభ్" సీరియల్ గా తెరమీద కనిపించే వరకూ అందరినీ తొలిచిన ప్రశ్న ఇదే...

    డీ-గ్లామరైజ్డ్ రోల్

    డీ-గ్లామరైజ్డ్ రోల్

    ఫస్ట్ పార్ట్ లో మహిష్మతిరాజ్యం లో బందీగా ఉన్న దేవసేన కనిపించిన సీన్లు మూడు, నాలుగు మాత్రమే. ఈ మూడు, నాలుగు సీన్స్ లో కూడా చేతికి కాళ్లకి సంకెళ్లతో మురికిగా ఉన్న పాత చీరలో అనుష్క కనిపిస్తుంది. డీ-గ్లామరైజ్డ్ రోల్. కానీ సెకండ్ పార్ట్ లో దీనికి పూర్తి భిన్నంగా గ్లామర్ గా కనిపించింది.

    ‘బాహుబలి'కి టీవీ వెర్షన్‌

    ‘బాహుబలి'కి టీవీ వెర్షన్‌

    మొత్తానికి బాహుబలి లో దేవసేనగా అనుష్క తప్ప మరెవరూ ఆపాత్రని చేయలేరు అన్నంతగా ఆప్ట్ అయిపోయింది అనుష్క. అయితే ఇప్పుడు అదే పాత్రలో అనుష్కని పోల్చి చూడలేనంత చక్కగా మళ్ళీ దేవసేన పాత్రకి ప్రాణం పోస్తోంది కార్తీక. ‘బాహుబలి'కి టీవీ వెర్షన్‌లా భావిస్తున్న ఆ సీరియల్‌ ‘ఆరంభ్‌'.

    కార్తీక, దేవసేనగా నటిస్తోంది

    కార్తీక, దేవసేనగా నటిస్తోంది

    హిందీలో నిర్మిస్తున్న ఈ సీరియల్‌లో కార్తీక దేవసేనగా నటిస్తోంది. సినిమా తరహాలో భారీగా నిర్మిస్తున్న ఈ సీరియల్‌ కోసం కార్తీక యుద్ధవిద్యల్లో కూడా శిక్షణ పొందుతోంది. బాహుబలి సినిమాకు తెరపడిందేమో గానీ దాని ప్రస్థానాన్ని మాత్రం మేకర్స్ కొనసాగించబోతున్నారు.

    ది రైజింగ్ ఆఫ్ శివగామి

    ది రైజింగ్ ఆఫ్ శివగామి

    బాహుబలి క్యారెక్టర్స్‌తో పుస్తకాల్ని, కామిక్స్ ను, టీవీ సిరీస్ ఇలా రకరకలుగా బాహుబలిని ఒక బ్రాండ్ గా మార్చాలని బాహుబలి టీమ్ భావిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా "ది రైజింగ్ ఆఫ్ శివగామి" అనే నవలని రాయటం, దాన్ని టీవీ సిరీస్ గా మార్చే పనిలో దిగిపోవటం జరిగింది.

    శివగామి తోనే ఆగిపోతే ఎలా

    శివగామి తోనే ఆగిపోతే ఎలా

    అయితే కేవలం శివగామి తోనే ఆగిపోతే ఎలా..? అందుకే ఇప్పుడు బాహుబలి రెండు పార్ట్ లకు కథ అందించిన రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ ఆరంభ్ స్క్రిఫ్ట్ రెడీ చేసారు. దేవసేన లీడ్ రోల్ తో సాగే స్క్రిప్ట్ ఇది. ఇప్పుడు ఈ బాహుబలి బుల్లితెర వెర్శన్ కూడా నెమ్మది నెమ్మది గా పుంజుకుంటోంది.

    దక్షిణాదిలో జరిగే కథ

    దక్షిణాదిలో జరిగే కథ

    ‘ఆరంభ్‌' దక్షిణాదిలో జరిగే కథ. అందువల్ల దక్షిణాది ప్రాంతీయ ముఖం కలిగి, హిందీ బాగా మాట్లాడే హీరోయిన్‌ కోసం అన్వేషించారు. ఆ రెండింటికీ కరెక్ట్‌గా సరిపోయే కార్తీక ని దేవసేనగా ఎంపిక చేశారు. ఇందులో నటించడానికి ఒప్పుకున్నప్పుడు... సీరియలే కదా జాలీగా నటించేయచ్చు అనుకుందట.

    ఏనుగుని మచ్చిక చేసుకుందట

    ఏనుగుని మచ్చిక చేసుకుందట

    కానీ, కథకు అవసరపడడంతో కత్తిసాము, గుర్రపుస్వారీ వంటివి షూటింగ్‌ ప్రారంభించడానికి ముందు నుంచే నేర్చుకోవాల్సి వచ్చింది. అసలే సినిమా చాన్సులు లేకుండా ఖాళీగా ఉండటంతో ఫుల్ కాన్సంట్రేషన్ తో కష్తపడుతోందట కార్తీక. ఈ సీరియల్ లో గుర్రాలతోనూ, ఏనుగులతోనూ కలిసి నటించాల్సి రావటం తో గుర్రపుస్వారీ నేర్చుకోవటమే కాదు. డజన్లకొద్దీ అరటి పళ్ళు తినిపిస్తూ ఎక్కువసేపు అక్కడే గడుపుతూ ఆ ఏనుగుని మచ్చిక చేసుకుందట కార్తీక.

    బాహుబలి పార్ట్ 2 కి వచ్చినంత క్రేజ్

    బాహుబలి పార్ట్ 2 కి వచ్చినంత క్రేజ్

    "‘బాహుబలి' మొదటి భాగంలో దేవసేన పాత్ర పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. రెండో భాగంలోనే ఆ పాత్ర పాపులర్‌ అయ్యింది. మేము రెండో పార్టు రావడానికి ముందే హిందీ సీరియల్‌ ప్రారంభించాం. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అసలు అనుకున్నప్పుడే వచ్చి ఉంటే ఈ సీరియల్ మరింత హిట్ అయ్యేది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కి వచ్చినంత క్రేజ్ ని సొంతం చేసుకొని ఉండేది.

    బుల్లి తెర దేవసేన

    బుల్లి తెర దేవసేన

    నిజం చెప్పాలంటే.. ‘బాహుబలి' దేవసేన పాత్ర కంటే నా పాత్ర ఇంకా స్పెషల్‌గా ఉంటుంది. ‘బాహుబలి'లో దేవసేన ఒక భాగం మాత్రమే. కానీ, ‘ఆరంభ్‌' కథే దేవసేన" అంటూ తాను ఈ టీవీ సిరీస్ కి ఎంత ముఖ్యమో చెప్తూ సినిమా కన్నా ఇది తక్కువేం కాదు నన్ను లొకువగా చూడకండీ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది బుల్లి తెర దేవసేన.

    Recommended Video

    English summary
    Here is the look of the show that features Tamil film actress Karthika Nair, as princess Devasena who is shown as the Bahubali princess of the Dravidian empire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X