బిగ్ బాస్ 4 విన్నర్‌పై నాగబాబు జోస్యం: అవినాష్‌ను కాదని ఆ కంటెస్టెంట్‌కు మద్దతు

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రభావం మామూలుగా లేదు. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచీ ఒకే తరహా స్పందనతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు సైతం ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, ఈ షో సెలెబ్రిటీలను సైతం కదిలిస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ రియాలిటీ షోపై స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. బిగ్ బాస్‌కు కాబోయే విన్నర్‌పై జోస్యం చెప్పారు. విశేషమేమిటంటే.. ఎంతో సన్నిహితంగా ఉండే అవినాష్‌ను కాదని మరో కంటెస్టెంట్ పేరు చెప్పారాయన. ఆ సంగతులు మీకోసం.!

సెలెబ్రిటీలను కదిలిస్తున్న బిగ్ బాస్

సెలెబ్రిటీలను కదిలిస్తున్న బిగ్ బాస్

బిగ్ బాస్ షోకు రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతూనే ఉంది. దీంతో షో అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందుకే ఈ షో గురించి తెలుగు రాష్ట్రాల్లోని సెలెబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయమనో.. పలానా కంటెస్టెంట్‌ విజయం సాధిస్తారనో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

మారిపోతోన్న ఫ్యాన్స్ అభిప్రాయాలు

మారిపోతోన్న ఫ్యాన్స్ అభిప్రాయాలు

బిగ్ బాస్ హౌస్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్ గురించి సినీ, బుల్లితెర ప్రముఖులు స్పందిస్తుండడం ఓటింగ్ విధానంపైనా ప్రభావం చూపుతోంది. తమ అభిమాన నటులు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో.. వాళ్ల ఫ్యాన్స్ కూడా సదరు కంటెస్టెంట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా చాలా మంది హౌస్‌మేట్స్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నారు.

బిగ్ బాస్ షోపై నాగబాబు స్పందన

బిగ్ బాస్ షోపై నాగబాబు స్పందన

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి పరిచయం అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ క్రమంలోనే ఆయన నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఇలా చాలా కాలంగా సినీ రంగంలో తనదైన పాత్రను పోషించి కొన్నేళ్లుగా బుల్లితెరపై సత్తా చాటుతోన్న నాగబాబు.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

అవినాష్‌పై మెగా బ్రదర్ కామెంట్స్

అవినాష్‌పై మెగా బ్రదర్ కామెంట్స్

జబర్ధస్త్ షో నాగబాబు చాలా కాలం పాటు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అదే షో నుంచి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ గురించి తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన కామెంట్లు చేశారు. జబర్దస్త్ జరుగుతోన్న సమయంలో అవినాష్‌తో బాండింగ్ ఏర్పడిందని, ప్రస్తుతం అతడు బిగ్ బాస్‌లో మంచిగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడని నాగబాబు పేర్కొన్నాడు.

బిగ్ బాస్ విన్నర్‌పై నాగబాబు జోష్యం

బిగ్ బాస్ సీజన్ 4కు కాబోయే విన్నర్ విషయంలో నాగబాబు జోష్యం చెప్పారు. ‘ఈ సీజన్‌లో అందరూ మంచిగా ఆడుతున్నారు. వాళ్లందరిలో నాకు అభిజీత్ టైటిల్ విన్నర్ అవుతాడని అనిపిస్తుంది. షోలో అతడు ఆడే విధానం చాలా నచ్చింది. ఎప్పుడూ ఎంతో కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తాడు. కాబట్టి నా ఉద్దేశ్యంలో అభినే విజయం సాధిస్తాడు' అని ఆయన చెప్పుకొచ్చారు.

Recommended Video

TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!
అవినాష్‌ను కాదని ఆ కంటెస్టెంట్‌కు మద్దతు

అవినాష్‌ను కాదని ఆ కంటెస్టెంట్‌కు మద్దతు

అవినాష్‌తో జబర్ధస్త్‌లో కలిసి పని చేసినప్పటికీ అతడిని కాదని మరో కంటెస్టెంట్‌కు మద్దతు తెలిపారు నాగబాబు. ‘నేను అభిజీత్‌ను పలుమార్లు కలిశాను. అతడు డౌన్ టూ ఎర్త్ అని అనిపించింది. ఎంతో వినయంగా మాట్లాడుతాడు. హీరోగా కెరీర్ బాగుంటుంది అనుకున్నా. కానీ అది కుదరలేదు. కాబట్టి బిగ్ బాస్‌లోనైనా సక్సెస్ అవ్వాలని అతడికి మద్దతు తెలుపుతున్నా' అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X