అక్కడ మెగా ఫ్యామిలీ హీరోలదే హవా
హైదరాబాద్: మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ, అల్లు శిరీష్ వీరే... ఈ మధ్య కాలంలో టీవీ టీఆర్పీ రేటింగ్ లలో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నారు. వీరి చిత్రాలు అత్తారింటికి దారేది, ఎవడు, కొత్త జంట...టీఆర్పీలు పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసి, శాటిలైట్ రైట్స్ కొనుకున్న ఛానెల్ వారికి ఆనందం కలిగిస్తున్నాయి.
టీఆర్పీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

అత్తారింటికి దారేది(పవన్)...టీఆర్పీ.. 19
ఎవడు(రామ్ చరణ్)...టీఆర్పీ... 10.14
కొత్త జంట(అల్లు శిరీష్)...టీఆర్పీ 9.4.
ఈ చిత్రాలకు ఇంత టీఆర్పీలు లభించటం మెగా ఫ్యామిలినీ,వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. టీవీ ఛానెల్స్ వారు కూడా మెగా హీరోల చిత్రాలు మంచి రేటు పెట్టి కొనుక్కోవటానికి మరింత ఉత్సాహం చూపించనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే హీరో రెమ్యునేషన్, బడ్జెట్ కూడా పెరుగుతాయి. అలాగే నిర్మాత కూడా శాటిలైట్ రైట్స్ నిమిత్తం మంచి ఎమౌంట్ వస్తోందంటే ఆనందమే కదా మరి.


Click it and Unblock the Notifications











