చెండలంగా ఆ పని చేయలేదా? యాంకర్ శ్యామల మెగా ఫ్యాన్స్ ట్రోల్స్

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ కుటుంబాల్లో మెగా కుటుంబం కూడా ఒకటి. టాలీవుడ్ ఉన్న ఎక్కువ స్టార్స్ అలాగే భారీ మొత్తంలో బిజినెస్ కూడా వీరి నుంచే జెనరేట్ అవుతుంది. కాగా సినిమాల్లో మాత్రం తిరుగు లేని మెగా ఫ్యామిలీకి రాజకీయాల్లో మాత్రం పరిస్థితి వేరేగా మారింది అని చెప్పాలి.

తనకి సినిమాల్లో ఏక ఛత్రాధిపత్యం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులని ఏపీ ప్రజలకు మంచి చేద్దామని పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ ఆది, అంతం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ తర్వాత చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావం అక్కడ నుంచి తన ప్రయాణం కూడా ఏమంత సాఫీగా జరగలేదు అని తెలిసిందే.

mega fans digs anchor shyamala back story with pics

ఇలా మెగా కుటుంబం మాత్రం రాజకీయాల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పడక తప్పలేదు. మెయిన్ గా రాజకీయాల్లో ఏదైతే చెయ్యకూడదు అంటారో అదే వీరిపై జరిగింది. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అని ఎప్పుడు నుంచో ఉంది. కానీ ఇదే మొదటి నుంచి చిరంజీవి సహా పవన్ కళ్యాణ్ పై కూడా జరుగుతూ వచ్చింది.

కాగా లేటెస్ట్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి తనకి రామ్ చరణ్ నుంచి ఒక వారసుడు తమ వారసత్వాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్టుగా చెప్పిన మాటలు తీవ్ర దుమారం రేపగా చిరంజీవిపై ఇదే సినీ పరిశ్రమకి అలాగే ఏపీలో వైసీపీ పార్టీకి చెందిన యాంకర్ శ్యామల చేసిన కామెంట్స్ ఇపుడు షాకింగ్ గా మారాయి. దీనితో తనపై మెగా అభిమానులు దుమ్మెత్తిపోశారు కానీ తర్వాత మాత్రం ఆమె గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు.

దీనితో సోషల్ మీడియాలో ఆమె అప్పట్లో రికార్డింగ్ డాన్స్ లు చేసుకునేది అని కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవ్వడం మొదలయ్యాయి. కాగా ఇలా రికార్డింగ్ డాన్స్ లు వేసుకునే వారు కూడా చిరంజీవి లాంటి మహావృక్షంపై కామెంట్స్ చేస్తున్నారు అంటూ గట్టి విమర్శలు సోషల్ మీడియాలో శ్యామలపై పడుతున్నాయి. దీనితో ఆమెపై ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

కానీ చాలా మంది అంటున్నట్టుగా శ్యామల ఏమీ రికార్డింగ్ డాన్స్ లు చేసుకునేది కాదు అని చెప్పవచ్చు. ఆ ఫోటోలు చూస్తే అవి ఎక్కడో నాటకాలు నుంచి సేకరించిన ఫొటోస్ లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న చాలా మంది నటీనటులు అలా నాటకాలు చేసే వెండితెరపైకి వచ్చినవారు ఉన్నారు. దీనితో తనని ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదని ఇంకొందరు మెగా అభిమానులే మిగతా వారితో వారిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇపుడు మెగాస్టార్ కామెంట్స్ విషయంలో శ్యామల ఈ రకంగా బలైంది. ప్రస్తుతం శ్యామల వైసీపీకి అధికారిక ప్రతినిధిగా కొనసాగుతుండగా దీనికి ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇపుడు తనపై జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X