Bigg Boss Telugu మానస్‌కు మెగా ఫ్యాన్స్ సపోర్ట్.. చిరంజీవితో ఫోటో సోషల్ మీడియాలో వైరల్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ గేమ్ షో ముగింపు దశకు చేరుకొన్నది. ఇప్పటికే ఇంటిలో 11 వారాలు గడిచిపోయాయి. ఇంటిలోని కంటెస్టెంట్లు టాప్ 5 స్థానాలకు పోటీ పడుతున్నారు. ఇంటిలోని సభ్యుల్లో మానస్ నాగులపల్లి ప్రత్యేక ఆకర్షణగా మారారు. తన ఆటతీరు, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొంటున్నారు. అయితే మానస్‌పై మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. తాజాగా మానస్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే...

క్రేజ్‌ను అలా పెంచుకొంటూ వెళ్తూ..

క్రేజ్‌ను అలా పెంచుకొంటూ వెళ్తూ..

టాలీవుడ్‌లో వర్థమాన నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న మానస్‌ను బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ తలుపుతట్టింది. బిగ్‌బాస్‌లోకి అనామకుడిగా అడుగుపెట్టిన ఆయన వారం వారానికి తన క్రేజ్‌ను పెంచుకొంటూ పోయారు. ప్రతీ ఇంటిలోని బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నంలో సఫలమయ్యారు. అలా మానస్ సెలబ్రిటీల జాబితాలోచేరిపోయారు.

11 వారాలపాటు కఠోరంగా శ్రమిస్తూ..

11 వారాలపాటు కఠోరంగా శ్రమిస్తూ..

బిగ్‌బాస్ ఇంటిలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకొన్నాడు. భావోద్వేగాలను సరైన రితీలో గేమ్‌లో పండిస్తూ తనకంటూ ఫాలోవర్స్ పెంచుకొన్నాడు. కెప్టెన్సీ కోసం 11 వారాల పాటు కఠోరంగా శ్రమించి 12వ వారంలో బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్సీగా ఎంపికయ్యారు. దాంతో కీలకమైన సమయంలో మానస్ తన సత్తాను చాటి టాప్ 5లో చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకొంటున్నారు.

వీజే సన్నీతో కలిసి ఫ్రెండ్‌షిప్ బాండింగ్

వీజే సన్నీతో కలిసి ఫ్రెండ్‌షిప్ బాండింగ్

బిగ్‌బాస్ తెలుగు 5లో స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. వీజే సన్నీతో ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌ను ఆకర్షణీయంగా మార్చారు. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌లో బెస్ట్ ఫ్రెండ్‌షిప్ రిలేషన్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. వీజే సన్నీ, మానస్ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు అందరిని ఆకట్టుకొంటున్నది.

ప్రియాంక సింగ్‌తో కెమిస్ట్రీ

ప్రియాంక సింగ్‌తో కెమిస్ట్రీ

ఇక ప్రియాంక సింగ్ అలియాస్ పింకితో రొమాంటిక్ రిలేషన్‌ను పద్దతిగా కొనసాగిస్తున్నాడు. అసభ్యకరమైన రీతిలో, అశ్లీలతకు తావు లేకుండా పింకితో కలిసి మంచి కెమిస్ట్రీని పండిస్తున్నాడు. ప్రియాంకను సరైన రీతిలో గైడ్ చేస్తూ ఆకట్టుకొంటున్నారు. ప్రియాంకతో కలిసి ప్రేక్షకులకు లవ్లీగా వినోదాన్ని పంచుతున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : కలిసొచ్చిన లక్కు.. నామినేషన్స్ నుంచి తప్పించుకున్న Manas || Filmibeat Telugu
మెగా ఫ్యాన్స్ మద్దతుతో

మెగా ఫ్యాన్స్ మద్దతుతో

బిగ్‌బాస్‌లో ఎన్నో ఉత్తమ విలువలను పాటిస్తున్న మానస్ నాగులపల్లికి మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫ్యాన్స్ గ్రూపుల్లో మానస్ గురించి మంచిగా కామెంట్లు పెడుతున్నారు. ఇక చిన్నతనంలో చిరంజీవిని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ మానస్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అండతో మానస్ టాప్ 5 జాబితాలో చేరుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X