నిహారిక పెళ్లిలో అపురూప ఘట్టం: అందరూ ఒకే ఫ్రేమ్‌లో.. స్పెషల్ అట్రాక్షన్ మాత్రం ఆ కుర్రాడే!
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగే సమయం ఆసన్నమైంది. అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. బుధవారం జరగనున్న నిహారిక వివాహం కోసం కుటుంబ సభ్యులు మొత్తం ఉదయ్‌పూర్‌లో వాలిపోయారు. దీంతో ఉదయ్ విలాస్‌లో సందడి వాతావరణం నెలకొంది. మెహందీ వేడుకలు, సంగీత్ ఈవెంట్‌లో స్టార్లంతా ఆట పాటలతో అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుక మొత్తానికి హైలైట్‌గా నిలిచే ఓ అపురూప ఘట్టం సాక్షాత్కరించింది. అందరూ ఏకమైన అందులో ఓ కుర్రాడు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం!

పెద్దలు కుదిర్చిన వ్యక్తితో నిహారిక పెళ్లి
మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది మెగా ప్రిన్సెస్ నిహారిక. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వివాహం నిశ్చయించాడు తండ్రి నాగబాబు. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె పెళ్లి జరగనుంది.

మెగా ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాలి
తమ కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించారు నాగబాబు. అందులో భాగంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వీళ్ల పెళ్లి జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుక కోసం మూడు రోజుల ముందుగానే అక్కడకు చేరుకున్నారు.

ఎవరికి వారో.. అంతా ఒకేచోట కలిశారు
నిహారిక - చైతన్య వివాహం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌లో వాలిపోయింది. అల్లు అర్జున్ కుటుంబం, చిరంజీవి కుటుంబం, నాగబాబు ఫ్యామిలీతో పాటు పవన్ కల్యాణ్ అతడి పిల్లలు ప్రత్యేక విమానాల ద్వారా అక్కడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి జరగనున్న వివాహం కోసం రెండు రోజుల ముందుగానే అంతా కలుసుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

మెగా హీరోల పాటలతో రచ్చ రచ్చగా
వివాహానికి ముందు జరిగే సంగీత్ ఈవెంట్, మెహందీ ఫంక్షన్‌లో మెగా హీరోలంతా సరదాగా గడిపారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు నిహారిక, పెళ్లి కొడుకు చైతన్య మెగా హీరోల పాటలకు చిందులు వేశారు. వారితో పాటే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ సహా అందరూ తమదైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

పవన్ ఫ్యామిలీ ఎంట్రీతో ఎమోషనల్‌గా
అంగరంగ వైభవంగా జరుగుతోన్న నిహారిక పెళ్లికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. తన పిల్లలు అకీరా నందన్, ఆద్యతో కలిసి మంగళవారమే ఆయన ఉదయ్‌పూర్ చేరుకున్నారు. పవర్ స్టార్ రాకతో ఉదయ్ విలాస్‌లో భావోద్వేగ పరిస్థితులు కనిపించాయి. గత రాత్రి జరిగిన మెహందీ వేడుకలో వధువరులను ఆశీర్వదించిన ఆయన.. అందరితో కలిసి ఓ ఫొటోకు ఫోజిచ్చారు.

స్పెషట్ అట్రాక్షన్ మాత్రం ఆ కుర్రాడే!
నిహారిక పెళ్లిలోనే అపురూప ఘట్టం ఒకటి సాక్షాత్కరించింది. మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించారు. అయితే, ఇందులో మాత్రం అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. ఎందుకంటే అతడు పుట్టిన తర్వాత ఎప్పుడూ కజిన్స్‌తో కలిసి ఫొటోలు దిగిన దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు అందరితో కలిసి ఉండడంతో మెగా అభిమానులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు.


Click it and Unblock the Notifications











