Acharya TRP: మొదటిసారి టెలివిజన్ లో ఆచార్య షాకింగ్ టీఆర్పీ.. ఆ స్టార్స్ కంటే తక్కువే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితం అందుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ తెరపైకి తీసుకువచ్చిన ఈ భారీ యాక్షన్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం మెగాస్టార్ అభిమానులకు కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రత్యేకంగా అనిపించాయి.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా కలిసి నటించడం ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంది. కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక తీవ్రంగా నష్టాలు కలిగించడంతో కొరటాల శివ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో మాత్రం పరవాలేదు అనే విధంగా రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్స్ కు అయితే చాలా తక్కువ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి.

జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే సినిమాను ఇటీవల మొదటి సారి టీవీలో ప్రదర్శించగా కేవలం 6.30 రేటింగ్ మాత్రమే వచ్చింది. మెగాస్టార్ తో పాటు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగిన నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ల నుంచి ఇటీవల వచ్చిన సినిమాల కంటే కూడా ఆచార్య సినిమా చాలా తక్కువ రేటింగ్స్ అందుకుంది.
నాగార్జున బంగార్రాజు సినిమా మొదటిసారి జీ తెలుగులో ప్రదర్శించగా అత్యధికంగా 14 టీఆర్పీ ని సాదించింది. ఇక బాలకృష్ణ అఖండ సినిమా 13.31 టిఆర్పి అందుకోగా వెంకటేష్ F 3 సినిమా 8.26 టీఆర్పీ మాత్రమే అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అంతకంటే తక్కువగా 6.30 టిఆర్పిని అందుకుంది. కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సినిమాలు కూడా టిఆర్పిని అందుకోవడంలో రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఆచార్య సినిమా ఆ రూట్లో కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.


Click it and Unblock the Notifications











