Maa Elections: ఓ వైపు గొడవలు.. మీడియాపై మెగాస్టార్ సెటైర్.. మీకు కావాల్సింది దొరికింది కదా!

మా ఎన్నికల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటివరకు ఒక తరహాలో ఉన్న ఆర్టిస్టులు ఆదివారం పోలింగ్ రోజు మరింత విబిన్నంగా మారిపోయారు. ఇక ఓ వైపు గొడవలు జరుగుతుండగా మరోవైపు ఓటు వేసి కొందరు మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇక ఓటు వేసి వచ్చిన తరువాత మెగాస్టార్ వెళ్లిపోతుండగా మీడియా పలు ప్రశ్నలు వేయడంతో ఆయన ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు. ఒక విధంగా మీడియా తీరుపై సెటైర్ కూడా వేశారు. అంతే కాకుండా మెగా మద్దతు ఎవరికి అనే దానిపై కూడా పలు కామెంట్స్ రావడంతో చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

విజయం నాదే అంటూ మంచు విష్ణు

విజయం నాదే అంటూ మంచు విష్ణు

ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ వద్ద కొనసాగుతున్న పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఉదయం 11 గంటల సమయం వరకు 270ఓట్ల వరకు పోల్ అయినట్లు తేలింది. ఓటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు విజయం నాదే అంటూ మీడియాతో మాట్లాడాడు.

మెగాస్టార్ సెటైర్

మెగాస్టార్ సెటైర్

మా ఎన్నికల్లో దాదాపు 900కు పైగా ఓట్లు ఉన్నా ప్రతిసారీ కూడా ఆ తరహాలో ఎవరు ఓటు వేయడం లేదు. వీలైనంత వరకు సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ సినీ తారలు చాలా వరకు ఉదయాన్నే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కొందరు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా జరుగుతున్న పరిణామాలపై అలాగే మీడియా చేస్తున్న ప్రచారంపై కూడా సెటైర్ వేశారు.

మీకు కావాల్సింది దొరికింది కదా

మీకు కావాల్సింది దొరికింది కదా

మా ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు లేని విధంగా సాధారణ ఎలక్షన్స్ తలపించేలా జరుగుతాయని ఎప్పుడైనా మీరు ఊహించారా అంటూ ఒక మీడియా విలేఖరి మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించగా.. అందుకు మెగాస్టార్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. మీ మీడియాకు కావాల్సిన మెటీరియల్ చాలా హాయిగా దొరికింది కదా.. మీరు ఆనంద పడాలి కదా ఇలాంటి పరిస్థితులలో.. అని సెటైర్ వేశారు.

ఏకగ్రీవంపై మెగా కామెంట్

ఏకగ్రీవంపై మెగా కామెంట్

ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తుందని అనే ఆరోపణలు కరేక్ట్ కాదని ఎవరి ఇష్టం వారిది అని చెబుతూ.. నా అంతరాత్మ చెప్పినట్లే ఓటు వేశా.. కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్దతు అన్నారు. సినిమా ఇండస్ట్రీలో సినీ పెద్దగా ఈ ఎన్నికలను ఏకగ్రీవంగా చేయొచ్చు కదా అనే ప్రశ్నలకు కూడా మెగాస్టార్ సున్నితంగా సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విబిన్నంగా నిర్ణయాలు ఉన్నప్పుడు ఎన్నికల ద్వారా గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా మెగాస్టార్ తెలియజేశారు.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
 మా ఎన్నికల్లో రిగ్గింగ్ గోల

మా ఎన్నికల్లో రిగ్గింగ్ గోల

ఇక ఉదయం 8గంటలకు మొదలైన మా ఎన్నికల పోలింగ్ నేడు మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగనుంది. ఇక 3గంటల అనంతరం కౌంటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు రిగ్గింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో మోహన్ బాబు తీవ్ర స్థాయిలో కోపానికి లోనయ్యారు. సినీ నటుడు బెనర్జీపై కోపంతో చంపేస్తాను అంటూ హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికల అధికారి కూడా రెండు ప్యానెల్ సభ్యులను హెచ్చరించడం జరిగింది. రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే క్యాన్సిల్ చేసి కోర్టుకు వెళతామని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X