కథ వేరేలా ఉంది. నీ పర్మిషన్ కావాలి.. సోహెల్‌ కోసం మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్.. నాగ్‌ను కదలించిన సింగరేణి బిడ్డ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా అందరి మనసులు గెలుచుకొన్న సోహెల్ సయ్యద్ ర్యాన్.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆకట్టుకొన్నారు. సోహెల్ మ్యానరిజంపై చిరంజీవి ఫిదా అయ్యారు. సోహెల్ గురించి మాట్లాడుతూ ఫిదా అయ్యారు. సోహెల్ గురించి చిరంజీవి, నాగ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

కథ వేరేలా ఉంటుందంటూ చిరంజీవి

కథ వేరేలా ఉంటుందంటూ చిరంజీవి

సోహెల్‌ను ఉద్దేశించి జోష్‌గా చిరంజీవి మాట్లాడారు. సింగరేణి ముద్దు బిడ్డ. మన కథ, ఖార్ఖానా వేరు. నిన్ను చూసిన తర్వాత కథ వేరేలా ఉంటుందనే మ్యానరిజం నా సినిమాలో పెట్టుకొంటాను. అందుకు నీ పర్మిషన్ కావాలి అంటూ చిరంజీవి గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు. దాంతో సోహెల్ సంతోషంలో మునిగిపోయాడు. మీరు అలా అనకండి సార్ అంటూ ఆనందపడిపోయాడు.

మనసులను కదలించిన సోహెల్

మనసులను కదలించిన సోహెల్

మన కథ వేరేలా ఉండాలమ్మా అంటూ సోహెల్ స్టైయిల్‌లో చిరంజీవి డైలాగ్ చెప్పాడు. ఆ ఊపుకు నాగ్ బ్రేక్ వేస్తూ.. సోహెల్ గురించి మాట్లాడానికి ముందు ఓ విషయం చెప్పాలి అని అంటే.. ఏదో సీక్రెట్ ఉండి ఉంటుందేమో అని చిరంజీవి అన్నారు. అయితే అలాంటిదేమీ కాదు. మనసులను కదలించిన ఓ మంచి విషయం చెబుతాను అంటూ 10 లక్షల రూపాయల విషయాన్ని నాగ్ వెల్లడించారు.

10 లక్షల రూపాయలు అనాధాశ్రమం కోసం

10 లక్షల రూపాయలు అనాధాశ్రమం కోసం

బిగ్‌బాస్ ఫైనల్ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో సోహెల్ అందర్నీ కదలించాడు. బ్రీఫ్ కేస్‌తో 25 లక్షల రూపాయలు తీసుకొని ఎలిమినేట్ అయ్యాడు. అందులో నుంచి 10 లక్షల రూపాయలు అనాథ శరణాలయానికి ఇవ్వాలని అనుకొన్నాడు. కానీ అందులో నుంచి 5 లక్షల రూపాయలు తన స్నేహితుడు మెహబూబ్‌కు ఇచ్చాడు.

నీ హృదయం గురించి ఆలోచించావు

నీ హృదయం గురించి ఆలోచించావు

డబ్బు విషయంలో నీకు ఒకరికి సహాయం చేయడంలో తృప్తి ఉందని భావించావు. నీవు హృదయం నుంచి ఆలోచించావు అంటూ సైగ చేసి చూపిస్తే.. సోహెల్ నేను ఇక్కడ నుంచి ఆలోచించాను అంటే. అలా కాదు.. ఇలా అంటూ సోహెల్ మ్యానరిజాన్ని చిరంజీవి చేసి చూపించాడు.

సోహెల్ కోసం చిరంజీవి భార్య మటన్ బిర్యాని

సోహెల్ కోసం చిరంజీవి భార్య మటన్ బిర్యాని


బిగ్‌బాస్ ద్వారా మా ఇంటి సభ్యులను కూడా ఆకట్టుకొన్నావు. మటన్ కోసం ఆరాటపడినప్పుడు మా ఇంట్లో వాళ్లు బాధపడేవారు. నీకు మటన్‌పై ఉన్న ఇష్టాన్ని నా భార్య సురేఖ గమనించి.. హాలాల్తో కూడిన మటన్ బిర్యానీ, మిర్చి కా సాలన్ చేసి పంపించింది. అది నీవు తినాలి. నీతోపాటు నీ స్నేహితులు, సహచరులు కూడా ఆస్వాదించాలి అంటూ చిరంజీవి చెప్పాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
బిర్యాని, మిర్చికా సాలన్ వీడియోను చూపించిన చిరు

బిర్యాని, మిర్చికా సాలన్ వీడియోను చూపించిన చిరు

అంతేకాకుండా ఇంటి నుంచి తయారు చేసి తెచ్చిన బిర్యాని, మిర్చి కా సాలన్‌ను వీడియో రూపంలో చూపించాడు. బిర్యానిని, కూరను స్వయంగా చూపించి అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఇది నీ కోసం అంటూ సోహెల్‌పై ఆప్యాయంగా, ప్రేమను కురిపించాడు. చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు సోహెల్ తన్మయత్మంలో మునిగిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X