కుర్రాడివి ఆ మాత్రం రొమాంటిక్ టచ్ ఉండాలయ్యా! అభిజిత్‌ను ఆటాడుకొన్న చిరంజీవి

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ గ్రాండ్ ఫినాలే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేడుకపైకి హుందాగా నడుచుకొంటూ వచ్చిన చిరంజీవి తనదైన శైలిలో కొంచెం చిలిపిగా, కొంచెం హాస్యం, మరికొంత ప్రేమ, ఇంకా భావోద్వేగంతో తన మార్కును చాటుకొంటూ క్లోజింగ్ వేడుకకు మరింత శోభ తెచ్చారు. విజేతలుగా ప్రకటించడానికి ముందు చిరంజీవి ఇద్దరు ఫైనలిస్టులతో మాట్లాడుతూ..

సోఫా వేసుకోని కూర్చోవాలి కదా

సోఫా వేసుకోని కూర్చోవాలి కదా

అభిజిత్‌ నుంచున్నావు ఏమిటీ సోఫా వేసుకొవాలి కదా.. ఎప్పుడు యాక్టివ్‌గా లేకుండా నిలుచుని కనిపించలేదు. ఎప్పుడు కూర్చొని కనిపించే నీవు బుద్దిగా చేతులు కట్టుకొని నిలుచున్నావు. అందుకే నేను అలా అంటున్నాను చిరంజీవి అంటే.. నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. చిరంజీవితో మాట్లాడటం ఏమిటి? మెగాస్టార్ నా మీద పంచులు వేయడం ఏమిటనే విషయం అర్ధం కావడం లేదు అంటూ అభిజిత్ అన్నాడు.

రియల్ వ్యక్తిత్వం నీది అంటూ

రియల్ వ్యక్తిత్వం నీది అంటూ

ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. నేను లైఫ్ బ్యూటిఫుల్ సినిమా చూశాను. అందులో బాధ్యతగల కుర్రాడిలా పాత్రలో బ్యాలెన్స్‌లో కనిపించావు. అయితే పాత్ర పరంగా అలా నటించావనుకొన్నాను కానీ నిజ జీవితంలో కూడా నీవు అదే అని బిగ్‌బాస్ చూసిన తర్వాతే తెలుసుకొన్నాను. అది రియల్ వ్యక్తిత్వమని తెలిసింది.

చాలా కంపోజ్డ్‌గా, బ్యాలెన్స్‌గా

చాలా కంపోజ్డ్‌గా, బ్యాలెన్స్‌గా

బిగ్‌బాస్‌లో చాలా కంపోజ్డ్‌గా, బ్యాలెన్స్‌గా కనిపించావు. నీకు జీవితంలో అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నీవు నీ కెరీర్‌ను చక్కగా ఉపయోగించుకో. ఫైనల్‌కు వచ్చావు కాబట్టి విజయం ఎవరిని వరిస్తూందో తెలియదు. మీకు బెస్టాఫ్ లక్ అంటూ చిరంజీవి సరదాగా, ఎమోషనల్‌గా మాట్లాడారు.

ఆడవాళ్లు మేకప్ వేసుకునే సమయంలో

ఆడవాళ్లు మేకప్ వేసుకునే సమయంలో

అంతేకాకుండా పెన్సిల్స్, ఆడవాళ్లు మేకప్ వేసుకునే సమయంలో ఉపయోగించే ఐ బ్రో పెన్సిల్స్, టిష్యూ పేపర్స్ ఎప్పుడైనా వాడావా అంటూ అభిజిత్‌ను చిరంజీవి అడిగారు. దాంతో ఈ మ్యాటర్ మీ దాకా వచ్చిందా అంటే. నా దాకా కాదు.. ఇంటిలో నా గూఢచారులు ఉన్నారు. ప్రతీ విషయం నాకు చేరవేస్తారు అంటూ అభిజిత్‌కు చిరంజీవి ఝలక్ ఇచ్చారు.

అభిజిత్ మాత్రమే కాదు.. ప్రతీ ఒక్కరి గురించి తెలుసు.

అభిజిత్ మాత్రమే కాదు.. ప్రతీ ఒక్కరి గురించి తెలుసు.

బిగ్‌బాస్ ఇంటిలో కేవలం అభిజిత్ మాత్రమే కాదు.. ప్రతీ ఒక్కరి గురించి తెలుసు. అందరూ రెడీగా ఉండండి. ఇక అభిజిత్‌తో మాట్లాడుతూ.. ఆ మాత్రం ఉండాలయ్యా.. కుర్రాడి అంత రొమాంటిక్ టచ్ లేకపోతే ఎలా.. అవి లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. కీప్ ఇట్ అప్ అంటూ చిరంజీవి జోష్ పెంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X