Naga Panchami 20th January: మోక్ష ప్రాణాలు కాపాడుతున్న మేఘన.. అయోమయంలో ఫణీంద్ర.. ఏం జరగనుంది?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతూ.. అనక్షణం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే తాజా ఎపిసోడ్ లో నాగమణి కోసం నాగలోకం వెళ్లిన కరాళీ.. దాని తీసుకురాలేకపోయింది. అలాగే అదిన చంద్రకాంత మొక్కను తీతుసుని భూలోకానికి వచ్చేసింది. అయితే ఫణీంద్ర సాయం చేస్తాడన్న నమ్మకంతో పంచమి పాముగా మారి భర్తను కాటేయడం.. ఆ తర్వాత అతడు మంత్రం అప్పుడే చెప్పానని అనడం అందరికీ తెలిసిందే. ఇక చేసేదేం లేక.. నాగ సాధువు, ఫణీంద్ర, పంచమిలు.. మోక్షను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే అవేవీ పెద్దగా ఫలించడం లేదు. ఇక మోక్షకు ఇవే చివరి క్షణాలేమే అనుకుంటూ అంతా కంగారు పడుతున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు. ముందుగా పంచమి తల్లికి విషయం చెప్పగా.. ఆమె అక్కడకు వచ్చి మోక్ష తల్లిదండ్రులకు పోన్ చేసి విషయం చెప్పింది. ఇది తెలుసుకుని అక్కడకు వచ్చిన వారు మోక్ష గురించి గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. అప్పటికే మోక్ష శరీరం అంతా రంగు మారడం, చల్లబడడంతో అతడు బతకడని అనుకుంటున్నారు. కానీ ఇంతలోనే మేఘన రూపంలో ఉన్న కరాళీ అక్కడకు వస్తుంది. మోక్షను కాపాడేందుకు తాను ఓ ఆకు తెచ్చానంటూ.. చంద్రకాంత మొక్క పసరును ఆయన నోట్లో పోస్తుంది.

Meghana Try To Save Moksha With Using Chandrakantha Plant on Naga Panchami January 20th Episode

అయితే ఆ విషయం గుర్తించిన ఫణీంద్ర మాత్రం అయోమయంలో పడిపోయాడు. ఇదేంటి తన వద్దకు ఎలా వచ్చిందంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు. మరోవైపు పంచమి రూపంలో ఉన్న కరాళీ.. చంద్రకాంత మొక్కను తీసుకు రావడం చూసిన నాగకన్య నాగ దేవతను ప్రసన్నం చేసుకుంటుంది. నాగలోకానికి యువరాణి పంచమి వచ్చిందనే విషయాన్ని చెప్పబోతున్నట్లు వివరిస్తుంది. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మోక్ష కుటుంబ సభ్యులను చూపిస్తారు. శబరి భర్త ఫొటో కింద పడడంతో.. మోక్షకు ఏదో అపాయం జరుగుతుందని భావించిన శబరి ఏడుస్తుంది. అలా భయపడొద్దు అంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నా వినకుండా కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన భర్త చెప్పిన ముడుపు గురించి చెబుతుంది. గతంలో తన భర్త ముడుపు కట్టాడని.. ఆది నల్లబడిన తర్వాత రోజే ఆయన చనిపోయారంటూ వివరిస్తుంది. అయితే తన మనవడి కోసం ఆమె కూడా ఓ ముడుపు కట్టానని దాన్ని తీసుకు వచ్చి చూడాలని అంటంది. దాన్న తెరిచి చూడగా.. అది కుళ్లిపోయి ఉంటుంది. దీంతో శబరితో పాటు మోక్ష తల్లి కుప్పకూలిపోతారు.

Meghana Try To Save Moksha With Using Chandrakantha Plant on Naga Panchami January 20th Episode

ఇక ఆ తర్వాత పంచమి తల్లి విషయం తెలుసుకుని మోక్షను ఉంచిన చోటుకి వెళ్తుంది. అల్లుడి పరిస్థితి చూసి కన్నీరు పెడుతుంది. ఆ తర్వాత ఆ విషయాన్ని మోక్ష తల్లిదండ్రులకు చెప్పాలని ఫోన్ చేస్తుంది. మోక్ష ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పగానే వైదేహి కుప్పకూలిపోతుంది. మరోవైపు శబరి కూడా ఏడుస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి మోక్ష వద్దకు వెళ్తారు. కానీ చిత్ర, జ్వాలలు మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఇది జరిగిన వెంటనే నాగకన్య నాగ దేవతను ప్రసన్నం చేసుకోవడం.. ఆమె కనిపించడంతో సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X