Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గూగుల్‌లో కూడా కనిపించలేదు..హడావిడి క్యారెక్టర్ అనుకున్నా..సోహెల్ పరువు తీసిన మెహబూబ్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్లో స్నేహబంధాలు బాగానే ఏర్పడ్డాయి. గత సీజన్లలో మాదిరిగా గ్రూపులు కట్టారు. ఈ సీజన్లో అవినాష్ అరియానా అమ్మ రాజశేఖర్ దివి, మోనాల్ అఖిల్ సోహెల్ మెహబూబ్, హారిక అభిజిత్ లాస్య నోయల్ ఇలా గ్యాంగులుగా ఏర్పడ్డారు. మళ్లీ ఇందులో ఇద్దరిద్దరూ జోడి కట్టారు. అవినాష్ అరియానా, అఖిల్ మోనాల్, సోహెల్ మెహబూబ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఈ నాల్గో సీజన్లో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లు బాగానే రచ్చ చేశాయి.
ముగ్గురిగా ఉన్నా...
బిగ్ బాస్ నాల్గో సీజన్లో అఖిల్ సోహెల్ మెహబూబ్ ముగ్గురు కూడా ఫ్రెండ్స్‌లానే ఉన్నా.. కలిసి టాస్కులు ఆడినా కూడా చివరకు క్లోజ్ ఫ్రెండ్స్అంటే మాత్రం మెహబూబ్ సోహెల్ పేర్లే బయటకు వచ్చాయి. మెహబూబ్ ఎలిమినేట్ అయిన తరువాత ఫుల్ సపోర్ట్ సోహెల్కే ఇచ్చాడు.
తాజాగా ఇంటర్వ్యూ..
నాల్గో సీజన్ పూర్తయ్యాక.. కొన్ని వివాదాలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేచింది. మెహబూబ్ ఇచ్చిన హింట్‌తో సోహెల్ 25 లక్షలను గెలుచుకున్నాడని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. అయితే వాటిపై ఎన్ని రకాలుగా క్లారిటీ ఇచ్చిన కూడా సోహెల్‌ను, మెహబూబ్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూను ఇచ్చారు.
యూట్యూబ్ చానెల్లో..
మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్లో సోహెల్‌తో చేసిన ఇంటర్వ్యూని పెట్టాడు. ఈ ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. దీంట్లో మెహబూబ్ చాలా విషయాలను బయట పెట్టేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందే సోహెల్ గురించి మెహబూబ్ సర్చ్ చేశాడట.
గూగుల్‌లో కూడా కనిపించలేదు..
బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చాక అందులో సోహెల్ అనే ఓ అతను ఉన్నాడని తెలిసింది. దీంతో గూగుల్‌లో సర్చ్ చేశాను..కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో ఇన్ స్టాగ్రాంలోనూ వెతికా అక్కడ కనిపించాడు. కాస్త హడావిడి క్యారెక్టర్ అనుకున్నాను అంటూ మెహబూబ్ చెప్పుకొచ్చాడు. అలా గూగుల్‌లో కూడా కనిపించలేదంటూ మెహబూబ్ అనడంతో.. ఇజ్జత్ తీయకురా అంటూ సోహెల్ కౌంటర్ వేశాడు.