మన కమ్యూనిటీ ఓట్లే కాపాడుతాయి.. మతం ఓట్లు అండగా.. నబీల్‌తో మెహబూబ్ దారుణంగా!

బిగ్‌బాస్ తెలుగు షో ఊహించినంతగా ఊపందుకోవడం లేదు. రెగ్యులర్ కంటెస్టెంట్స్‌తో నిస్తేజంగా మారిన షోను రసవత్తరంగా మార్చేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీలను ఇంట్లోకి తెచ్చిన అంతంత మాత్రమే షో వినోదాన్ని పంచుతున్నది. గంగవ్వ, నబీల్, జబర్దస్త్ అవినాష్, రోహిణి లాంటి వాళ్లు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా వైల్డ్ కార్డుతో ఇంట్లోకి వచ్చిన మెహబూబ్, నబీల్ ఆఫ్రీదితో మత ప్రస్తావన తీసుకురావడం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Nabeel Mehaboob కమ్యూనిటీ ఓట్స్ కోసం... Nagarjuna కి పెరుగుతున్న డిమాండ్ | Bigg Boss Telugu 8

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో టాప్ 5 కంటెస్టెంట్‌గా భావించిన కిర్రాక్ సీత గతవారం ఇంటి నుంచి వెళ్లిపోవడం కొంత షాకిచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంటిలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో భారీగా వాగ్వాదం చోటు చేసుకొన్నది. హరితేజ, యష్వీ, ముక్కు అవినాష్, గౌతమ్, పృథ్వీ మధ్య గట్టిగానే గొడవ చోటు చేసుకొన్నది.

Mehaboob Dil Se and Nabeel Afridi discussion of Community Votes In Bigg Boss Telugu 8 Show

అయితే తాజా నామినేషన్ల ప్రక్రియలో తీవ్రమైన ఆరోపణలు చేసుకొంటూ ఒకరినొకరు నామినేట్ చేసుకొన్నారు. చివరకు ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. గౌతమ్, పృథ్వీ శెట్టి, మణికంఠ, యష్మీ, టేస్టీ తేజ, నబీల్ అహ్మద్,ప్రేరణ, హరితేజ నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో టాప్ కంటెస్టెంట్లు ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. నామినేషన్ ప్రక్రియ తర్వాత నబీల్, మెహబూబ్ కులమతాల నుంచి వచ్చే ఓట్లు గురించి ప్రైవేట్‌గా మాట్లాడుకోవడం వివాదంగా మారింది. అలాంటి రియాలిటీ షోలో కులాలు, మతాల గురించి మాట్లాడుకోవడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు నబీల్‌కు అన్ని వర్గాల వారు ఓట్లు వేస్తే.. ముస్లిం మతం ఓట్ల గురించి ఎలా చర్చించుకొంటారు అని ప్రశ్నిస్తున్నారు.

నబీల్, మెహబూబ్ మాట్లాడుకొంటూ.. మనిద్దరి గురించి అలా మాట్లాడుకోవడం నచ్చలేదు. బయటి వాళ్లకు కూడా నబీల్‌కు గానీ, మెహబూబ్‌కు వాళ్ల మతం ఓట్లు పడుతాయని భావించి ఉంటారు. అయితే మనకు ప్లస్, దారుణమైన విషయం ఏమిటంటే? మనకు కమ్యునిటీ ఓట్లు అండగా ఉంటాయి. మనకు ఆ ఓట్లు దారుణంగా పడుతాయి అని మెహబూబ్ అన్నారు.

ఇద్దరం నామినేషన్‌లో ఇద్దరం ఉంటే ఓట్లు డివైడ్ అవుతాయి. ఒక్కరే నామినేషన్‌లో ఉంటే నీకు గానీ, నాకు గానీ గట్టిగా ఓట్లు పడుతాయి. ఇద్దరం ఉంటే అందరితోపాటు మనం కూడా రేసులో ఉంటాం. ఒకటి మనం చూసుకోవాల్సిందేమిటంటే? ఇద్దరం నామినేషన్‌లో ఉండకుండా చూసుకోవాలి అంటూ నబీల్‌తో మెహబూబ్ అనడం కనిపించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X