Bigg Boss Voting : ఓటింగ్‌లో ప్రేరణ మాస్ రచ్చ.. చేతులెత్తేసిన ఆ ఇద్దరు, ఈ వారం బిగ్ ట్విస్ట్!
బిగ్‌బాస్ తెలుగు 8కి గాను ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్స్ కార్యక్రమం ముగిసింది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్‌లో నిలిచారు. వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే కావడంతో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఓటింగ్ ఎలా జరుగుతోంది? లిస్ట్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్ రచ్చ ముగియడంతో బిగ్‌బాస్ హౌస్‌లో డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఇంటి సభ్యులు కాసేపు రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశారు. పృథ్వీ - విష్ణుప్రియ మధ్య చిగురించిన ప్రేమను కంటెస్టెంట్స్ అంతా కలిసి తొక్కేశారు. దీంతో హౌస్‌లో రొమాంటిక్ టచ్ లేకుండా పోయింది. ఇంతలో బిగ్‌బాస్ హౌస్‌లో మరో ప్రేమకథ మొలకెత్తే దిశగా అడుగులు పడుతున్నాయి. అది యష్మి - నిఖిల్‌ల మధ్య కావడం గమనార్హం.

తాను నిఖిల్‌ను నామినేట్ చేశాననే కోపంతో యష్మీ నన్ను నామినేట్ చేసిందని విష్ణు వీరిద్దరి మధ్య రిలేషన్‌ని బయటపెట్టింది. కిచెన్‌లో వంట చేస్తున్న యష్మిని వెనుక నుంచి వెళ్లి బుగ్గ గిల్లి ముద్దు పెడతాడు నిఖిల్.. అక్కడే ఉన్న విష్ణుప్రియ, నబీల్ షాక్ తింటారు. వాళ్లిద్దరూ తనను మోసేస్తున్నారని గ్రహించిన నిఖిల్ దానిని కవర్ చేసుకోవడానికి యష్మితో చేసినట్లుగా నబిల్‌కి చేసి చూపిస్తాడు.
ఈ వారం మెగా చీఫ్ ఎంపిక ప్రక్రియను స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్. ఒక టాస్కులో రాయల్ క్లాన్, మరో టాస్క్‌లో ఓజీ క్లాన్ గెలిచాయి. దీంతో రాయల్స్ నుంచి రోహిణి, ఓజీ టీమ్ నుంచి పృథ్వీరాజ్‌ని చీఫ్ కంటెండర్స్‌గా ఎంపిక చేశారు. గురువారం నుంచి చీఫ్ కంటెండర్స్‌గా అర్హత సాధించిన వారికి టాస్క్‌లు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో మెగా చీఫ్‌గా గౌతమ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి 8వ వారానికి గాను కొత్త మెగా చీఫ్ ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, నయని పావని, విష్ణుప్రియ, పృథ్వీరాజ్‌లు నామినేషన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని పరిశీలిస్తే.. ఈ వారం ప్రేరణ టాప్ ప్లేస్‌లో నిలిచి ప్రేక్షకులకు షాకిచ్చారు. ఆమె వరుసగా మూడో రోజు దాదాపు 28 శాతం ఓటింగ్ దక్కగా.. నిఖిల్ 25.19 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.
తర్వాత వరుసగా విష్ణుప్రియ (19.72 శాతం), పృథ్వీరాజ్ (14.07 శాతం), నయని పావని (10.2 శాతం), మెహబూబ్‌కి (9.8 శాతం) ఓటింగ్ దక్కింది. రెండ్రోజులుగా నయని పావని, మెహబూబ్‌లు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరి ఆట తీరు మారకుంటే షాక్ తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే నాటికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











