Bigg Boss Voting : ప్రేరణకు షాకిచ్చిన ఓటింగ్, ఖాయమైన ఎలిమినేషన్ .. కళ్లన్నీ ఆ ఇద్దరి పైనే!

బిగ్‌బాస్ తెలుగు 8‌ ఎనిమిదో వారం ఎండింగ్‌కి వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో ప్రేరణ కంభం టాప్ ప్లేస్‌లో ఉండటంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. నిఖిల్‌ని పక్కకు నెట్టి ఆమె నెంబర్‌వన్ ఎలా అయ్యారో అర్ధం కాక బిగ్‌బాస్ లవర్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఈ క్రమంలో ఓటింగ్‌ ఎలా జరుగుతోంది? ప్రేరణ టాప్ ప్లేస్‌ని నిలబెట్టుకున్నారా ? ఎవరు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

గురువారం మెగా చీఫ్ పోస్ట్ కోసం కంటెండర్స్ మధ్య టాస్క్‌లు పెట్టాడు బిగ్‌బాస్. బుధవారం జరిగిన గేమ్‌లో బీబీ రాజ్యంలో సరస్సును సొంతం చేసుంది రాయల్ క్లాన్‌. అయితే ఈసారి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు అన్నట్లుగా ఓజీ క్లాన్ సభ్యులు నిఖిల్, పృథ్వీలు టాస్క్‌లలో చెలరేగిపోయారు. పట్టుకో కార్ట్‌లో పెట్టుకో అంటూ టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం ఏ క్లాన్ అయితే తమకు బిగ్‌బాస్ ఇచ్చిన 8 ధాన్యపు బస్తాలని రెడ్ లైన్ వెనక్కి ముందుగా చేరవేస్తారో వాళ్లు గెలిచినట్లు . ఈ టాస్క్‌లో ఫిజికల్ టాస్క్‌లలో ఇరగదీసే గౌతమ్, మెహబూబ్‌లను నిఖిల్, పృథ్వీలు ఎదుర్కొన్నారు.

mehaboob dil se and Nayani Pavani are still in danger zone in 8th week Voting in bigg boss telugu 8

ఒకరినొకరు అడ్డుకునేందుకు నలుగురు కొట్టుకున్నారు. సంచాలక్‌గా ఉన్న యష్మీ అయితే వణికిపోయింది. తర్వాత బిగ్‌బాస్ పాస్ చెప్పడంతో గౌతమ్- మెహబూబ్‌లకు బదులుగా అవినాష్ -టేస్టీ తేజాలు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తేజను నిఖిల్ తోసేయడంపై రాయల్ క్లాన్ అభ్యంతరం చెప్పింది. మొత్తానికి కిందా మీదా పడి 8 బ్యాగ్‌లను సాధించిన ఓజీ క్లాన్ విజేతగా నిలిచింది. దీంతో ఓజీ క్లాన్‌ నుంచి ఒకరిగా మెగా చీఫ్ అయ్యే అర్హత వచ్చింది. టాస్క్ గెలిచిన సంతోషంలో పృథ్వీ - నబీల్ డ్యాన్స్ చేయడంతో గంగవ్వ చిరాకు పడుతుంది.

ఇక అంతా కలిసి చీఫ్ కంటెండర్‌గా పృథ్వీని అనౌన్స్ చేసింది ఓజీ క్లాన్. ఆ వెంటనే సెకండ్ టాస్క్‌గా వైరల్ అటాక్ అనే గేమ్‌ను ఇచ్చారు బిగ్‌బాస్. దీని ప్రకారం వైరస్ జోన్‌లోకి వీలైనన్న వైరస్‌లను విసిరి.. తమ జోన్‌లోకి వైరస్‌లను రాకుండా అడ్డుకోవాలని చెబుతాడు . ఎవరికైతే తక్కువ వైరస్‌లు వస్తాయో వారే విజేత . ఈ గేమ్‌లోనూ ఓజీ క్లాన్ గెలిచింది. ఈ టీమ్ 51 బాల్స్ విసరగా.. రాయల్స్ 45 విసిరారు. టాస్క్‌లో గెలవడంతో ఓజీ క్లాన్‌లోని మెజార్టీ మెంబర్లు నిఖిల్‌ను చీఫ్ కంటెండర్‌గా సెలెక్ట్ చేశారు.

ఇదిలాఉండగా .. ఈ వారం ప్రేరణ, నిఖిల్ , పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియలు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ఒకసారి చూస్తే.. నాలుగు రోజులుగా నెంబర్‌వన్‌గా ఉన్న ప్రేరణను వెనక్కినెట్టి నిఖిల్ నెంబర్‌వన్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. నిఖిల్ (29 శాతం), ప్రేరణ (28. 2 శాతం) ఓటింగ్ దక్కించుకున్నారు. విష్ణుప్రియ (14.3 శాతం), పృథ్వీరాజ్ (12 శాతం), నయని పావని (10.17 శాతం), మెహబూబ్‌కి (8.4 శాతం) ఓటింగ్ దక్కింది. నయని, మెహబూబ్‌లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X