Bigg Boss Voting: దూసుకెళ్తోన్న ప్రేరణ..నిఖిల్‌కి దెబ్బ మీద దెబ్బ , కండలవీరుడికి షాక్ తప్పదా?
బిగ్‌బాస్ తెలుగు 8 హాట్ హాట్‌గా సాగుతోంది. రోజులు గడిచేకొద్ది ఊహించని ట్విస్టులు, షాకులతో దుమ్మురేపుతున్నారు నిర్వాహకులు. 8వ వారానికి సంబంధించి నామినేషన్స్ కార్యక్రమం సోమవారం పూర్తి కాకపోవడంతో అది మంగళవారం కంటిన్యూ అయ్యింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఓటింగ్ ఎలా జరుగుతోంది? లిస్ట్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
సోమవారం నాటి ఎపిసోడ్‌లో రోహిణి .. నిఖిల్, పృథ్వీలని, పృథ్వీ.. రోహిణి, ప్రేరణలని, నయనీ పావని.. మెహబూబ్, నిఖిల్‌లని, హరితేజ.. ప్రేరణ, మెహబూబ్‌లని.. నబీల్.. ప్రేరణ, హరితేజలని నామినేట్ చేశారు. హరితేజకి నామినేషన్ షీల్డ్ ఇవ్వడంతో ఆమెను ఎన్నిసార్లు నామినేట్ చేస్తే అన్ని సార్లు రూ.50 వేల చొప్పున ప్రైజ్ మనీ తగ్గుతుందని బిగ్‌బాస్ హెచ్చరిస్తాడు. అయినప్పటికీ మెహబూబ్ ఆమెను నామినేట్ చేయడంతో ప్రైజ్‌మనీ తగ్గింది.

మంగళవారం నాటి ఎపిసోడ్‌లో పృథ్వీ - విష్ణుప్రియల మధ్య ఏదో జరుగుతోందని హౌస్‌మేట్స్ డిస్కషన్ పెట్టారు. అందరూ కలిసి తనకు బ్రెయిన్ వాష్ చేయడంతో పృథ్వీ .. విష్ణుప్రియతో ఏకాంతంగా మాట్లాడాడు. ఇంతటితో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేద్దామని చెబుతాడు. బెడ్‌రూమ్‌లో ఒంటరిగా బాధపడుతున్న విష్ణుప్రియని నబీల్ ఓదారుస్తాడు. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదని, నీకు మంచి భర్త దొరుకుతాడని చెబుతాడు.
ఈ గొడవ మొత్తం సద్దుమణిగిన తర్వాత నామినేషన్స్‌ను మళ్లీ మొదలెట్టాడు బిగ్‌బాస్. ప్రేరణ.. విష్ణుప్రియ, పృథ్వీలని.. గంగవ్వ.. నిఖిల్, విష్ణుప్రియలని, నిఖిల్.. మెహబూబ్, నయని పావనిలని, యష్మీగౌడ.. విష్ణుప్రియ, మెహబూబ్‌లని, అవినాష్.. పృథ్వీ, నిఖిల్‌లని.. టేస్టీ తేజ.. విష్ణుప్రియ, పృథ్వీలని నామినేట్ చేశారు. హరితేజని ఇద్దరు ఇంటి సభ్యులు నామినేట్ చేయడంతో ప్రైజ్ మనీలో నుంచి రూ. లక్ష కట్ అయినట్లుగా బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. అయితే నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం గౌతమ్‌కి ఇవ్వడంతో అతను హరితేజని సేవ్ చేశాడు.

దీంతో మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారు నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, నయని పావని, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఉన్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని పరిశీలిస్తే.. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ప్రేరణ అనూహ్యంగా టాప్ ప్లేస్‌ని దక్కించుకున్నారు. ఆమెకు దాదాపు 28.6 శాతం ఓటింగ్ దక్కగా.. ఆటోలో కాస్త వీక్‌గా కనిపిస్తోన్న నిఖిల్ 26.2 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.
తర్వాత వరుసగా విష్ణుప్రియ (18.5 శాతం), పృథ్వీరాజ్ (12.2 శాతం), నయని పావని (11.2 శాతం), మెహబూబ్‌కి (10.6 శాతం) ఓటింగ్ దక్కింది. నిన్నటి ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లో నిలిచిన పృథ్వీ తన ర్యాంకింగ్ మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతానికి నయని పావని, మెహబూబ్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే నాటికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











