నామినేట్ చేయకపోతే లక్ష ఇస్తా.. ఇంటిలో మెహబూబ్ దిల్‌సే ఆఫర్‌.. బిగ్‌బాస్ పారితోషికం ఎంతంటే..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోకి అనామకుడిగా వెళ్లిన మెహబూబ్ దిల్ సే అసాధారణ ప్రతిభతో బయటకు వచ్చాడు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ తర్వాత అనూహ్యమైన స్పందన అందుకొంటున్నాడు. మీడియా ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన అనుభవాలను పంచుకొంటున్నారు. మెహబూబ్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

 అమ్మా రాజశేఖర్ రెమ్మునరేషన్

అమ్మా రాజశేఖర్ రెమ్మునరేషన్

అమ్మా రాజశేఖర్‌కు వారానికి రూ. 5 లక్షలు ఇచ్చారనే విషయం బయటకు వచ్చింది. ఆయనతో సమానంగా ఇచ్చారా అంటే.. ఆయన సీనియర్, మూవీ డైరెక్టర్. కాబట్టి ఆయనకు చాలా ఎక్కువగా ఇస్తారు. ఆయన తీసుకొన్నారని మీరు చెబుతున్న మొత్తంతో పోల్చుకొంటే చాలా తక్కువ అని మెహబూబ్ దిల్ సే చెప్పారు.

రెమ్యునరేషన్ల ప్రస్తావన రాలేదు

రెమ్యునరేషన్ల ప్రస్తావన రాలేదు

ఇంటిలో రెమ్యునరేషన్ల గురించి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. ఒకరి రెమ్యునరేషన్ల గురించి ఒకరం మాట్లాడుకోలేదు. కాకపోతే నామినేషన్ల సమయంలో నేను, సోహైల్ సరదాగా డబ్బుల గురించి మాట్లాడుకొన్నాం. నన్ను నామినేట్ చేయకపోతే లక్ష రూపాయలు ఇస్తాను అని మాట్లాడుకునే వాళ్లం అని మెహబూబ్ దిల్ సే పేర్కొన్నారు.

 లాక్‌డౌన్ దెబ్బతో దిమ్మతిరిగింది

లాక్‌డౌన్ దెబ్బతో దిమ్మతిరిగింది

బిగ్‌బాస్ కంటే నా నిజ జీవితంలో వచ్చిన సంపాదనే ఎక్కువ. నేను బయట చాలా కష్టపడేవాడిని. కొన్ని సందర్భాల్లో ఒక రోజులో మూడు గంటలు మాత్రమే పడుకొనే వాడిని. అలా నేను బాగా సంపాదిస్తున్నాను అనుకొనే సమయంలోనే కరోనా వైరస్ లాక్‌డౌన్ దెబ్బ కొట్టింది అని మెహబూబ్ తెలిపారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
 బిగ్‌బాస్ ఆఫర్ అలా వచ్చింది..

బిగ్‌బాస్ ఆఫర్ అలా వచ్చింది..

కరోనా సమయంలో ఆర్థికంగా చతికిలపడి విలవిల లాడుతున్న సమయంలోనే నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దాంతో నాకు ప్రాణం లేచి వచ్చినంత పనైంది. నా జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నానా అనే ఫీలింగ్ కలిగిన సమయంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ లభించింది. దాంతో నేను తీసుకొన్న నిర్ణయం సరైనదేనని అనుకొన్నాను అని మెహబూబ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X