Bigg Boss Telugu 8:వాళ్లే తొక్కేశారు, 30 సెకన్ల క్లిప్‌‌‌ లీక్ చేసి..ఎలిమినేషన్‌పై మెహబూబ్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 8లో 8వ వారం అనూహ్య పరిణామాల మధ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న కండల వీరుడు మెహబూబ్ ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ లవర్స్‌కి షాకిచ్చింది . బిగ్‌బాస్ సీజన్‌ 4లో ఏకంగా 10 వారాల పాటు హౌస్‌లో ఉండి యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు మెహబూబ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో స్టేజ్‌పై మాట్లాడుతూ.. మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటానని కసిగా చెప్పాడు. కానీ కేవలం మూడు వారాలకే ఇంటిని వీడి షాకిచ్చారు. ఎలిమినేషన్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు . ఈ వివరాల్లోకి వెళితే .

బిగ్‌బాస్ తెలుగు 8లో 8వ వారం ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్ నిలిచారు. ఒక్కొక్కరు సేవ్ అవ్వగా చివిరికి మెహబూబ్ , పావని నిలిచారు. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న మెహబూబ్‌ ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇది ఏమాత్రం ఊహించని రాయల్ క్లాన్ షాక్ అయ్యింది. తర్వాత అందరికీ వీడ్కోలు పలికిన మెహబూబ్.. స్టేజ్‌పై ఎమోషనల్‌గా మాట్లాడాడు. గత సీజన్‌లోనూ దీపావళికి ఎలిమినేట్ అయ్యానని.. ఇప్పుడు ఇలాగే జరగడం బాధగా ఉందని చెప్పారు. తనకే ఎందుకిలా జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

mehaboob dilse apologizes to audience after eliminating from bigg boss telugu 8

నిజానికి మైండ్ గేమ్స్, ఫిజికల్ టాస్క్‌లలో మెహబూబ్‌ను ఢీకొట్టడం కష్టం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ తన దూకుడైన ఆట తీరుతో తొలి వారంలోనే రాయల్ క్లాన్‌ను నడిపించి మెగా చీఫ్‌గా నిలిచాడు. అనవసరంగా గొడవలకు దిగకపోవడం .. గేమ్స్‌లో విధ్వంసం సృష్టించడం మెహబూబ్ మార్క్ స్టైల్. ఇదే ఆయనకు ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది.

అలాంటి వ్యక్తి మూడు వారాలకే హౌస్‌ను వీడటాన్ని బిగ్‌బాస్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొన్ని పొరపాట్ల వల్లే అతను బిగ్‌బాస్‌ను వీడినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కమ్యూనిటీ గురించి అతను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి నచ్చలేదని దాని ఫలితంగానే తను ఎలిమినేట్ అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నబీల్‌తో కలిసి అతను చేసిన డిస్కషన్ మెహబూబ్ పుట్టి ముంచిందని అంటున్నారు.

ఇదిలాఉండగా.. హౌస్‌ను వీడిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మెహబూబ్. తాము హౌస్‌లో గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించింది 30 సెకన్లు మాత్రమేనని చెప్పాడు. హౌస్‌లో తాను మాట్లాడిన చిన్న క్లిప్ బయట చాలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుందని మెహబూబ్ తెలిపారు. బిగ్‌బాస్ లాంటి మెగా ఫ్లాట్‌ఫాంలో మనం బాగా ఆడితే , మనలో ఒకరిగా భావించి ప్రేక్షకులు ఓట్లు వేస్తారని మెహబూబ్ అన్నాడు. తెలుగు పాట ఆస్కార్‌కి నామినేట్ అయినప్పుడు మన తెలుగు పాట ఆ గౌరవం దక్కించుకోవాలని ఎలా కోరుకున్నామో.. తాను అలాంటి మాటలే మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నాడు.

కానీ తాను అన్న మాట చాలా మందిని హర్ట్ చేసిందని, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానని నా ఇంటెన్షన్ అది కాదని మెహబూబ్ స్పష్టం చేశాడు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే .. తనను క్షమించాలని కోరాడు. డబ్‌స్మాష్, యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చానని.. ఏ క్యాస్ట్, రీలిజియన్ ఫీలింగ్ లేకుండా మీరంతా నాకు సపోర్ట్ చేశారని మెహబూబ్ చెప్పాడు. తన కమ్‌ బ్యాక్ గట్టిగా ఉంటుందని , ఆడియన్స్‌గా మీరు గెలిచారని, కంటెస్టెంట్‌గా నేను ఫెయిల్ అయ్యానని .. ఐ యామ్ సారీ అని మెహబూబ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X