Bigg Boss Buzzz : దివాళీ అచ్చిరాలే .. సేవ్ అయ్యుంటే ఆమెను గట్టిగా, మెహబూబ్ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 8లో 8వ వారం అనూహ్య పరిణామాల మధ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ 4లో దాదాపు 10 వారాల పాటు హౌస్‌లో ఉండి మంచి గేమ్ ఆడిన మెహబూబ్ .. మరోసారి తనకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పాడు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి కేవలం మూడు వారాలకే ఇంటిని వీడాడు. ఎలిమినేషన్ అనంతరం అర్జున్ అంబటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెహబూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే .

బిగ్‌బాస్ తెలుగు 8లో ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నయని పావని, మెహబూబ్ నిలిచారు. ఒక్కొక్కరు సేవ్ అవ్వగా చివిరికి మెహబూబ్ , పావని నిలిచారు. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న మెహబూబ్‌ ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అందరికీ వీడ్కోలు పలికిన మెహబూబ్.. స్టేజ్‌పై తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యాడు. గత సీజన్‌లోనూ దీపావళికి ఎలిమినేట్ అయ్యానని.. ఇప్పుడు ఇలాగే జరగడం బాధగా ఉందని చెప్పారు.

mehaboob dilse Bigg Boss Buzzz Interview with arjun Ambati after elimination from bigg boss telugu 8

ఫిజికల్ టాస్క్‌లలో మెహబూబ్‌ను ఢీకొట్టడం కష్టం. తన బలం కూడా అదే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ తొలి వారంలోనే రాయల్ క్లాన్‌ను అద్భుతంగా నడిపించి మెగా చీఫ్‌గా నిలిచాడు. అలాంటి వ్యక్తి ఇంత తక్కువ సమయంలోనే హౌస్‌ను వీడటాన్ని బిగ్‌బాస్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొన్ని పొరపాట్ల వల్లే అతను బిగ్‌బాస్‌ను వీడినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కమ్యూనిటీ గురించి అతను చేసిన కామెంట్స్ చాలా మందికి నచ్చలేదని దాని ఫలితంగానే తను ఎలిమినేట్ అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నబీల్‌తో కలిసి అతను చేసిన డిస్కషన్ చేటు చేసిందని భావిస్తున్నారు.

ఇక బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని బుల్లితెర నటుడు అర్జున్ అంబటి బిగ్‌బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 8వ వారం హౌస్‌ను వీడిన మెహబూబ్‌ను అర్జున్ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఈ కండల వీరుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపావళీ నీకు అచ్చి రాలేదు కదా అని అర్జున్ ప్రశ్నించగా.. అదే తెలియడం లేదని అంటాడు మెహబూబ్. నామినేషన్స్‌లో ఒక్కటైనా అదిరిపోయేలా వేశావని అనుకుంటున్నావా అని అర్జున్ అడగ్గా.. అవతలి వాడు ఏదో వాగుతున్నాడని ఇష్టమొచ్చినట్లుగా నామినేషన్ వేయలేనని చెప్పాడు.

నబీల్‌తోనే ఎందుకు క్లోజ్‌గా ఉన్నావని అర్జున్ ప్రశ్నించగా.. నాకు జెన్యూన్‌గా ఎవరు ఉన్నారని అనిపిస్తే వాళ్లతో ఉంటానని మెహబూబ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ వీక్ సేవ్ అయ్యుంటే గనక ఎవరిని నామినేట్ చేసేవాడివని అడగ్గా.. నయని పేరు చెప్పినట్లుగా టీజర్‌లో హింట్ ఇచ్చాడు. క్లాన్ క్లాన్ అంటాడు గానీ క్లాన్ కోసం ఆడినట్లుగా అనిపించడం లేదని నయని చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. క్లాన్ అందరి నుంచి తాను పాయింట్లు తెప్పించానని మెహబూబ్ తెలిపారు. మరి తన జర్నీపై ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు? ఎందుకిలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది? అనే దానిపై మెహబూబ్ ఏం చెప్పారో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X