నా ముఖమే అంతా.. వారి లవ్ ట్రాక్.. ఇంటి గుట్టు బయటపెట్టిన మెహబూబ్
బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటి సభ్యులతో కలిసి తన ఎమోషన్ పంచుకొన్న మెహబూబ్ దిల్‌సే వేదికపైన కూడా హోస్ట్ నాగార్జునతో తన బాధను వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్ తెలుగు షో ప్రకారం ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ బిగ్ బజ్ షోలో గత ఏడాది విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో సంభాషించాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ షో కోసం రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి మెహబూబ్ మాట్లాడుతూ..

70 రోజుల ప్రయాణంలో
బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో 70 రోజుల నా ప్రయాణం మరిచిపోలేనిది. ఇది జీవితానికి సరిపడే అంతా అనుభవం. ఇలాంటి అవకాశం దక్కడం నాకు గర్వంగా ఉంది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను 100 శాతం అంకిత భావాన్ని ప్రదర్శించాను అని రాహుల్ సిప్లిగంజ్‌తో మెహబూబ్ అన్నారు.

నాలో ఉక్రోషం, కోపానికి కారణం
టాస్క్‌లో పూర్తిస్థాయిలో ఆడాలని అనుకొంటాను. అందుకే నా ముఖంలో ఉక్రోషం, కోపం కనిపించడానికి కారణం. నా మనసులో ఉన్నది ముఖంలో కనిపిస్తుంది. నా ముఖం తీరే అలా కనిపిస్తుంది. నేను ఏది దాచుకోలేను. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని మెహబూబ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇంటిలో మోనాల్ తర్వాత ఎక్కువగా ఏడ్చింది నువ్వే అంటూ రాహుల్ కామెంట్ చేయగా.. మెహబూబ్ నవ్వుతూ కనిపించాడు.

అమ్మా రాజశేఖర్ గురించి
అమ్మా రాజశేఖర్ గురించి దిల్ సే మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న పిల్లాడిలా అలుగుతుంటాడు. కెప్టెన్‌గా మారిన తర్వాత తాను అనుకొన్న విషయాలను ఇంటి సభ్యులతో చేయించాలని అనుకొన్నాడు. మనసులో ఏది దాచుకోడు. గేమ్‌లో ఇంటి సభ్యులందరూ తనకు సమానమని భావిస్తాడు అంటూ మెహబూబ్ గురించి తెలిపాడు

దివి, లాస్య గురించిన విషయాలు
ఇక దివి గురించి చెబుతూ.. ఆమె స్ట్రెయిట్ ఫార్వర్డ్. గేమ్ సరిగా ఆడదు అని మెహబూబ్ అన్నాడు. ఏదైనా ఫైట్ జరుగుతుంటే.. ఎవరైనా తిడుతుంటే లాస్య నవ్వుతుంది. కారణం దానిని ఆపాలనే ఉద్దేశం ఆమెలో కనిపించదు అంటూ ఇంటి సభ్యుల గురించి మెహబూబ్ తన అభిప్రాయాలను రాహుల్ సిప్లిగంజ్‌తో పంచుకొన్నారు.

ఇంటిలో లవ్ ట్రాక్‌లపై దిల్ సే
ఇంటిలో లవ్ ట్రాక్‌ల గురించి మెహబూబ్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగినట్టు కనిపించింది. ఇంటిలో ఎన్ని లవ్ ట్రాక్‌లు నడుస్తున్నాయని రాహుల్ అడిగిన ప్రశ్నకు.. నాకు ఏమో తెలియదు. వారి ట్రాక్‌లు నాకు తెలియవు అంటూ మెహబూబ్ సమాధానం చెప్పడానికి తప్పించుకొన్నట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











