అభిజీత్‌ను అలా మోసం చేశారు.. అందుకే రూ. 25 లక్షలు కట్.. వీడియోతో బండారం బట్టబయలు

బిగ్ బాస్ షో అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ షో ద్వారా ఎంతో మంది హీరోలు అవగా.. అంతే స్థాయిలో జీరోలు కూడా అయ్యారు. నాలుగో సీజన్‌లో కూడా కొందరు మంచి పేరును సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ఫినాలేలో గొప్ప నిర్ణయాలు తీసుకున్న సయ్యద్ సోహెల్ రియాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో అభిజీత్‌ను దెబ్బకొట్టేందుకు ఆ కంటెస్టెంట్ చేసిన మోసం వీడియోతో సహా బయట పడింది. దీంతో సోహెల్ కూడా చీటింగ్ చేశాడని రుజువైంది. వివరాల్లోకి వెళ్తే...

బిగ్ బాస్ డీల్‌కు ఒప్పేసుకున్న సోహెల్

బిగ్ బాస్ డీల్‌కు ఒప్పేసుకున్న సోహెల్

గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ -5 నుంచి ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరో ఐదు పెంచి రూ. 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్‌కు సోహెల్ టెంప్ట్ అయి బయటకు వచ్చేశాడు.

పది లక్షలు ప్రకటించి హీరో అయ్యాడుగా

పది లక్షలు ప్రకటించి హీరో అయ్యాడుగా

రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేందుకు సమ్మతించిన సయ్యద్ సోహెల్ రియాన్.. అందులో పది లక్షల రూపాయలు అనాథలకు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో స్టేజ్ కింద ఉన్న మాజీ కంటెస్టెంట్లు, కుటుంబ సభ్యులు కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. ఈ ఒక్క సన్నివేశంతో సోహెల్ హీరో అయిపోయాడు. ఎలిమినేట్ అయినా అతడిపై అభినందనల వర్షం కురుస్తోంది.

 అభిజీత్‌ ఫ్రైజ్‌మనీలో సగానికి సగం కట్

అభిజీత్‌ ఫ్రైజ్‌మనీలో సగానికి సగం కట్

ఈ సీజన్‌లో మొదటి నుంచీ అనుకుంటున్నట్లుగా మిస్టర్ కామ్ అండ్ కూల్ పర్సన్ అభిజీత్ విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అతడికి ట్రోఫీని అందించారు. అయితే, సోహెల్‌కు రూ. 25 లక్షలు ఇవ్వడంతో.. విజేత అయిన అభిజీత్‌కు ప్రైజ్ మనీ నుంచి సగం కట్ అయి రూ. 25 లక్షలే దక్కాయి.

అభిజీత్‌ను అక్కడ అలా మోసం చేశారు

అభిజీత్‌ను అక్కడ అలా మోసం చేశారు

టాప్ - 3 సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ను ఒప్పుకున్న సయ్యద్ సోహెల్ రియాన్.. రూ. 25 లక్షలు తీసుకోడానికి ముందుకు వచ్చాడు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి కంటెస్టెంట్‌గా అతడు రికార్డులకెక్కాడు. అసలు అతడు ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం రీయూనియన్ పార్టీలో మెహబూబ్ ఇచ్చిన హింటే అని ఆదివారమే ఓ న్యూస్ బయటకొచ్చింది.

పెద్దన్నయ్య అని.. ఇలా చీట్ చేశాడేంటి?

మెహబూబ్ ఎలిమినేట్ అయిన సమయంలో అభిజీత్ కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. అప్పుడు అతడి గురించి స్టేజ్ మీద గొప్పగా చెప్పాడు. అంతేకాదు, అతడు తనకు పెద్దన్న లాంటోడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బయట ట్రెండ్ తెలిసిన మెహబూబ్.. హౌస్‌లోకి వెళ్లి సోహెల్‌కు డబ్బులు తీసుకో అన్నట్లుగా సైగలు చేశాడు. తద్వారా విజేత అయిన అభిజీత్‌ను మోసం చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
అసలేం జరిగిందంటే.. వీడియోలో ఉన్నదిదే

అసలేం జరిగిందంటే.. వీడియోలో ఉన్నదిదే

రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్‌లోకి వెళ్లాడు. లోపల అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్‌కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X