twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవర్ ఎవరో చెప్పేసిన మెహబూబ్: రెండు రోజుల్లో శుభవార్త.. పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు!

    |

    సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. ఇప్పుడు వాళ్లే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో గుంటూరు కుర్రాడు మెహబూబ్ దిల్‌సే ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్‌తో కూడిన వీడియోలను చేస్తూ ఎంతగానో గుర్తింపును అందుకున్న ఈ యంగ్‌స్టర్.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింతగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన లవర్, పెళ్లి, వెబ్ సిరీస్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

    అలా ఫేమస్.. ఇలా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్

    అలా ఫేమస్.. ఇలా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్

    తనదైన శైలి వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు మెహబూబ్. ఇదే క్రేజ్ కారణంగా గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు కొంత కామ్‌గా కనిపించిన అతడు.. కొద్ది రోజులకు తన మార్క్ చూపించే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే వాయిస్ పెంచుతూ పలు గొడవల్లో భాగం అయిపోయాడు.

    అదిరిపోయే ఆటతో పాపులర్.. మధ్యలోనే షాక్

    అదిరిపోయే ఆటతో పాపులర్.. మధ్యలోనే షాక్

    బిగ్ బాస్ షోలో అన్నింట్లోనూ ముందుంటూ పేరు తెచ్చుకున్నాడు మెహబూబ్. మరీ ముఖ్యంగా ప్రతి టాస్కులోనూ అందరి కంటే ముందుడాలని అతడు పడే తాపత్రయానికి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. దీంతో పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్నా ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. కానీ, కొన్ని గొడవల కారణంగా షో మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడీ కుర్రాడు.

    ఆ వీడియోతో విమర్శలు... చివరికి చెడ్డపేరుతో

    ఆ వీడియోతో విమర్శలు... చివరికి చెడ్డపేరుతో

    బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు బాగా సపోర్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడి కోసం ప్రచారం కూడా నిర్వహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలే వీక్‌లో జరిగిన రీయూనియన్ పార్టీలో సోహెల్‌కు 'మూడో స్థానంలో ఉన్నావు.. డబ్బులు తీసుకో' అన్నట్లుగా సైగలు చేశాడన్న వీడియోతో చెడ్డపేరును మూటగట్టుకున్నాడు.

    చిరంజీవి మనసు దోచేశాడు.. డబ్బు అందుకుని

    చిరంజీవి మనసు దోచేశాడు.. డబ్బు అందుకుని

    బిగ్ బాస్ షో ఫినాలేలో అడుగు పెట్టకున్నా.. ఆరోజు హైలైట్ అయింది మాత్రం మెహబూబే. ఆ ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చిన చిరంజీవి అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కుర్రాడిని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లు ఉందంటూ కొనియాడారు. అదే సమయంలో అతడి టాలెంట్‌నూ మెచ్చుకున్నారు. అంతేకాదు, తన మనసు దోచిన మెహబూబ్‌కు రూ. 10 లక్షల చెక్ ఇచ్చారు.

    రెండు మూడు రోజుల్లోనే శుభవార్త చెబుతాను

    రెండు మూడు రోజుల్లోనే శుభవార్త చెబుతాను

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు మెహబూబ్ దిల్‌సే. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇందులో భాగంగానే మీ వెబ్ సిరీస్ ఎప్పుడు అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి 'రెండు మూడు రోజుల్లోనే శుభవార్త చెబుతాను' అంటూ మెహూ చెప్పాడు.

    పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ మెహూ

    పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ మెహూ


    ఇదే చాట్‌లో ఇంకో నెటిజన్ విభిన్నంగా స్పందిస్తూ.. 'మీరు పెళ్లి చేసుకోకండి. మీ గర్ల్ ఫ్యాన్స్ దాన్ని తట్టుకోలేరు' అంటూ పోస్ట్ చేయగా... దీనికి మెహబూబ్ 'గర్ల్ ఫ్యాన్స్ ఏమో కానీ.. పెళ్లి అంటే నేను కూడా తట్టుకోలేను' అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఇప్పట్లో తాను వివాహం చేసుకోబోనని పరోక్షంగా వెల్లడించాడు. ఈ పోస్టుపై మెహబూబ్ లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    తన లవర్ ఎవరో చెప్పేసిన మెహబూబ్ దిల్‌సే

    తన లవర్ ఎవరో చెప్పేసిన మెహబూబ్ దిల్‌సే

    లైవ్ చాట్ సందర్భంగా మరో ఔత్సాహిక నెటిజన్ ఒక అడుగు ముందుకేసి 'మీ లవర్ ఫొటో పెట్టండి' అని మెహబూబ్‌ను రిక్వెస్ట్ చేశాడు. దీనికి అతడు ఊహించని విధంగా.. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి.. 'జిమ్ నా లవర్. ఎందుకంటే బాధను, బలాన్ని ఇస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇవే కాదు.. ఇంకా తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడించాడు.

    English summary
    Mehaboob Dil Se (Bigg Boss Telugu 4) Wiki, Age, Height, Girlfriend, Net Worth Mehaboob Dil se is a famous Youtuber who started with a career with Dance videos. He got popularity with his dance videos and short comedy skits. Table Of Contents
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X