‘ఆచార్య’లో మెహబూబ్ పాత్ర ఇదే: చేసేది చిన్నదే.. కానీ ఎఫెక్ట్ మాత్రం భారీగా.. చరణ్‌తో సమానంగానే!

సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ఎదిగిపోయాడు యంగ్ సెన్సేషన్ మొహబూబ్ దిల్‌సే. చాలా కాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న అతడు.. బిగ్ బాస్ షోలో అవకాశాన్ని కూడా అందుకున్నాడు. అందులోకి అడుగు పెట్టిన తర్వాత అతడి సుడి తిరిగిపోయిందనే చెప్పాలి. ఈ షో వల్ల ఈ కుర్రాడికి ఎన్నో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ మూవీలో అతడు చేసే పాత్ర ఏంటనేది ముందే రివీల్ అయింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మారిన సెన్సేషన్

బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మారిన సెన్సేషన్

యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఎనలేని గుర్తింపును అందుకున్న మెహబూబ్‌కు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అలా ప్రీమియర్ ఎపిసోడ్‌లో స్టైలిష్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ గుంటూరు కుర్రాడు.. లోపలికి వచ్చినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు. ఆరంభంలోనే పలు గొడవల్లోనూ భాగమై హైలైట్ అయిపోయాడు.

అదరగొట్టిన కుర్రాడు.. అయినా నిరాశగానే

అదరగొట్టిన కుర్రాడు.. అయినా నిరాశగానే


బిగ్ బాస్ హౌస్‌లో జరిగే ప్రతి టాస్కులో మెహబూబ్ పాత్ర ఉండేది. అందుకే మంచిగా ఆడే వారిలో అతడు ఒకడన్న టాక్ బాగా వినిపించింది. అంతలా ప్రతి దానిలోనూ తన ప్రభావాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్నా ప్రేక్షకుల మద్దతుతో తప్పించుకోగలిగాడు. కానీ, కొన్ని పరిణామాల వల్ల ఊహించని విధంగా సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు.

అతడికి సపోర్టు.. చీటింగ్ అంటూ పుకార్లు

అతడికి సపోర్టు.. చీటింగ్ అంటూ పుకార్లు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు బాగా సపోర్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడి కోసం ప్రచారం కూడా నిర్వహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలే వీక్‌లో జరిగిన రీయూనియన్ పార్టీలో సోహెల్‌కు 'మూడో స్థానంలో ఉన్నావు.. డబ్బులు తీసుకో' అన్నట్లుగా సైగలు చేశాడన్న వీడియోతో చెడ్డపేరును మూటగట్టుకున్నాడు.

చిరంజీవిని మెప్పించి.. చెక్ తీసుకున్నాడు

చిరంజీవిని మెప్పించి.. చెక్ తీసుకున్నాడు

గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవి.. మెహబూబ్‌ను ఉద్దేశించి 'మెహబూబ్‌ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది.. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉంది. యు ఆర్ ఎ డైనిమిక్ బాయ్.. అద్భుతమైన కొరియోగ్రఫీ' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, రూ. 10 లక్షల చెక్ కూడా ఇచ్చారు.

చిరంజీవి ‘ఆచార్య’లో ఛాన్స్.. హాట్ టాపిక్

చిరంజీవి ‘ఆచార్య’లో ఛాన్స్.. హాట్ టాపిక్

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మెహబూబ్ చిన్న పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన మెగా హీరో... దర్శకుడితో చెప్పి ఓ స్పెషల్ రోల్ క్రియేట్ చేయించారని తెలిసింది. దీంతో మెహబూబ్.. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Recommended Video

Prabhas 25 : Prabhas Focuses On His Land Mark Movie
‘ఆచార్య’లో మెహబూబ్ పాత్ర.. చరణ్‌తోనే

‘ఆచార్య’లో మెహబూబ్ పాత్ర.. చరణ్‌తోనే

'ఆచార్య'లో మెహబూబ్ చేసే పాత్ర విషయంలో తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో అతడు జానపద కళాకారుడిగా కనిపించనున్నాడట. రామ్ చరణ్ పాత్రతో పాటే ట్రావెల్ చేస్తాడని అంటున్నారు. దాదాపు ఇరవై నిమిషాలు ఉండే మెహబూబ్ పాత్ర పోలీసుల కాల్పుల్లో చరణ్‌తో పాటే మరణిస్తుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X