థియేటర్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చేదు అనుభవం: కొట్టడానికి వచ్చిన మహిళ.. మేటర్ లీక్ చేసిన మెహబూబ్
తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోన్న ఈ షో.. సక్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో సయ్యద్ సోహెల్ రియాన్, మెహబూబ్ దిల్‌సే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా చిన్న స్థాయి నుంచి స్టార్లుగా మారారీ ఇద్దరు. ఈ నేపథ్యంలో ఈ మిత్ర ద్వయానికి థియేటర్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

సోహెల్, మెహబూబ్.. అలా మొదలైన కెరీర్లు
చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సీరియళ్లలోనూ నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం పొందాడు. మరోవైపు, సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు మెహబూబ్ దిల్‌సే. ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుని షోలో ఛాన్స్ పట్టేశాడు.

బిగ్ బాస్‌లో సత్తా.. స్నేహితులుగా మారారు
బిగ్ బాస్ హౌస్‌లో సోహెల్.. మెహబూబ్.. ఇద్దరూ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడేవారు. దీంతో ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనిపించేవారు. అలాగే, కెప్టెన్సీ టాస్క్, నామినేషన్స్ టాస్కుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగేవారు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది.

ఒకరు మధ్యలోనే.. ఇంకోకరు ఫినాలే వరకు
గేమ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. మెహబూబ్ దిల్‌సే చాలా రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగలేకపోయాడు. మధ్యలోనే అతడు షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితుడు సోహెల్ కోసం అతడు చాలా ప్రచారమే చేశాడు. అలాగే, అతడికి మద్దతుగా పోస్టులూ పెట్టాడు. సోహెల్ మాత్రం అన్ని రకాలుగా రాణించడంతో ఫినాలేకు చేరుకున్నాడు.

బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో దూకుడు
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహెల్, మెహబూబ్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. అదే సమయంలో ఆఫర్లు కూడా అందుకుంటున్నారు. దీంతో బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఇప్పటికే సోహెల్ సోలో హీరోగా సినిమాను మొదలు పెట్టేశాడు. అలాగే, మెహబూబ్ డ్యాన్స్ వీడియోలు రిలీజ్ చేయడంతో పాటు ఓ వెబ్ సిరీస్‌ను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

థియేటర్‌లో చేదు అనుభవం గురించి ఇలా
సోహెల్, మెహబూబ్ ఇద్దరూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ కలిసే కనిపిస్తున్న ఈ ఇద్దరూ.. కలిసి జిమ్ చేసుకోవడం.. కలిసి పార్టీలు జరుపుకోవడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా థియేటర్‌లో జరిగిన చేదు అనుభవం గురించి మెహబూబ్ లీక్ చేశాడు.

అలీ రేజాతో కలిసి ఇద్దరం చూశామని చెప్పి
నాగార్జున హీరోగా చేసిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఈ సినిమాను సోహెల్, మెహబూబ్.. అలీ రేజాతో కలిసి చూశారట. అప్పుడు జరిగిన దానిపై చెబుతూ.. 'సినిమా నడుస్తోన్న సమయంలో థియేటర్ అంతా సైలెంట్ అయిపోయింది. అప్పుడే అలీ అన్న స్క్రీన్ మీద కనిపించడంతో మేమిద్దరం గట్టిగా అరిచేశాం. దీంతో అందరూ మా వైపే కోపంగా చూడడం మొదలెట్టారు' అని మెహబూబ్ చెప్పాడు.
Recommended Video

ఆంటీ కొడుతుందని అనుకున్నాం అంటూనే
దీనిని కొనసాగిస్తూ.. 'మేము కేకలు వేయగానే పక్కనే ఉన్న ఫ్యామిలీ మా వైపు కోపం చూసింది. అందులో ఉన్న ఓ ఆంటీ ఇంటర్వెల్ సమయంలో మా దగ్గరకు వచ్చింది. అంతలో మేము మాస్కులు తీసేశాము. దీంతో ఆమె ''హో.. మీరా.. ఇంకెవరో అనుకున్నాం'' అని అంది. ఆమె దూకుడు చూస్తే మమ్మల్ని కొడుతుందేమో అని అనుకున్నాం' అంటూ వివరించాడు మెహబూబ్.


Click it and Unblock the Notifications











