7నే నాగ్ షో ఖతమ్: అదే రోజు చిరంజీవి?
హైదరాబాద్: నాగార్జున యాంకర్‌గా మా టీవీలో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు ఈ నెల ఏడవ తేదీన తెర పడనున్నట్లు సమాచారం. కొద్ది కాలంలోనే ఈ షో విశేషమైన ప్రజాదరణ పొందింది. గత రెండు నెలలుగా దానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతూ వచ్చింది.
సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు నాగార్జున షోను నడుపుతున్న తీరును ప్రశంసిస్తున్నారు. మొదటి వారంలోనే అన్ని టీవీ షోలపై మీలో ఎవరు కోటీశ్వరుడు ముందుకు దూసుకెళ్లి అగ్రస్థానంలో నిలిచింది. రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టింది.

ఈ షోలో ఇప్పటి వరకు 40 ఎపిసోడ్స్ నడిచాయి. తుది ఎపిసోడ్‌ను ఆగస్టు 7వ తేదీన ప్రసారం చేయనున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి ఈ ఫైనల్ ఎపిసోడ్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఈ ఎపిసోడ్ చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22వ తేదీన ప్రసారం కావాల్సి ఉంది.
తొలి సీజన్‌ను ఈ నెల 7వ తేదీననే ముగించాలని నిర్మాతలు నిర్ణయించడంతో చిరంజీవి ఆ రోజు నాగార్జునతో కనిపిస్తారని అంటున్నారు. చిరంజీవికి నాగార్జున పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు హల్‌చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











