twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మో అంత రేటింగే...టీవీ రికార్డులు బ్రద్దలు కొట్టిసింది

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎంతో భారీగా నిర్వహించి సక్సెస్ చేసిన 'మేము సైతం' పోగ్రామ్ ని జెమినీ టీవీలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోగ్రామ్ ఈ వారంలో టాప్ టీఆర్పీని సాధించింది. ఇంకా చెప్పాలంటే సౌతిండియాలనే హైయిస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించిన పోగ్రాం అని తెలుస్తోంది. ఈ పోగ్రామ్ కు 14 గంటల సేపు.. TVR 13.4 , 375 GRPS వచ్చింది. ఇది టీవి చరిత్రంలో రికార్డుగా చెప్తున్నారు.

    హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమానికి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. విపత్తులు సంభవించిన ప్రతిసారి బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ... ముందుకొచ్చే చిత్ర పరిశ్రమ ఈసారి కూడా తన బాధ్యతను నెరవేర్చింది. నాడు ఎన్టీఆర్‌ నుంచి మొదలైన సేవా సంస్కృతిని తాము కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి నిర్మాత వరకు అందరూ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.

    నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలంతా ఒకే చోట చేరి ఉల్లాసంగా ప్రదర్శనలిచ్చారు. ఓ వైపు అన్నపూర్ణ స్టూడియోలో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు విరాళాలు వెల్లువెత్తాయి. చెన్నై, ముంబయి నుంచి కూడా కళాకారులు తరలివచ్చారు. మేము సైతం.. అంటూ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

     Memu Saitham tops TRP ratings in south

    హైదరాబాద్‌లో ఆదివారం 12 గంటలపాటు 'మేముసైతం' పేరిట టెలీథాన్‌ సాగింది. ఈ వేడుకలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సాంకేతిక నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు మేముసైతం... అంటూ పి.సుశీల బృందం పాడిన పాటతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి.

    ఆ తర్వాత పాటలు, డ్యాన్సులు, కబడ్డీ, ముఖాముఖి, క్రికెట్టు, తంబోలా, అంత్యాక్షరి కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్న పెద్ద, నాయకానాయికలు అనే తేడా లేకుండా నటీనటులంతా అందరూ కలిసిపోయి ప్రేక్షకులకు వినోదాలు పంచే ప్రయత్నం చేశారు.

    దాసరి నారాయణరావు మాట్లాడుతూ... ''పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినవాళ్లు ప్రేక్షకులు. అలాంటివారికి కష్టాలు వచ్చినప్పుడు మేము సైతం ఏదో ఒకటి చేయాలని చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. రూపాయి అని కాదు, కోటి రూపాయలు అని కాదు కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం అని ఇచ్చే భరోసా, స్ఫూర్తికోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో సినిమావాళ్లు వేరు వేరు అని ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. తెర ఉన్నంతవరకు సినిమా పరిశ్రమ ఒక్కటే. ఈ స్ఫూర్తి రాబోయే తరమూ కొనసాగించాలి. ఇలాంటి విపత్తులు రాకూడదని మనమంతా కోరుకొందాం'' అన్నారు.

    మోహన్‌బాబు మాట్లాడుతూ... ''బాధాకరమైన విషయంలో ఓ కొత్త అనుభూతి. సినిమా పరిశ్రమ అంతా ఒక వేదికపై ఉన్నాం. మేమంతా ఒక్కటే. ప్రజలకోసం సినిమా కుటుంబమంతా ఏకతాటిపై నడిచి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాం'' అన్నారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ...''చలన చిత్ర పరిశ్రమ తరఫున ఏర్పాటు చేసిన 'మేముసైతం' చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఏ ఉద్దేశంతోనైతే ఏర్పాటు చేశామో అది తప్పకుండా నెరవేరుతుంది'' అని చెప్పుకొచ్చారు.

    చిరంజీవి మాట్లాడుతూ...''తెలుగు చలన చిత్ర పరిశ్రమ మర్చిపోలేని రోజు ఇది. చాలా రోజుల తరవాత మనస్ఫూర్తిగా ఆనందించా. ప్రతీ ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమం విజయవంతమవ్వడానికి తోడ్పడ్డారు. కన్నీళ్లు తుడవడానికి మేమున్నాం.. అంటూ మేం సైతం అంటూ ముందుకొచ్చాం. ఇదో యజ్ఞం. పన్నెండు గంటల పాటు అలుపెరగకుండా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరిచ్చిన ప్రతి పైసా హుద్‌ హుద్‌ బాధితుల సంక్షేమానికి ఉపయోగిస్తామ''అన్నారు చిరంజీవి.

    English summary
    Memu Saitham event got highest TRP ratings in South India. Memu Saitam telecasted in Gemini TV has received an average TVR of 13.4 for 14 hours straight, thereby generating 375 GRPS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X