Brahmamudi October 19th: అందరిముందు రాజ్‌ను ఇరికించిన కావ్య... దొరికిపోయిన రాహుల్
బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు కావ్య అడిగిన కిల్లి కోసం రాజ్ ఓ పాన్ షాప్ కి తీసుకువెళ్తాడు. ఇక అక్కడ ఓనర్ పోలీసులను తీసుకుని వస్తాడు. ఇక మేం దొంగలం కాదు.. భార్య భర్తలం అంటూ కావ్య చెప్తుంది. ఫ్రూఫ్ ఏంటి అని పోలీసు అడుగుతాడు. ఫోటోలు చూపించండి అని కావ్య... రాజ్ ని అడుగుతుంది. ఫోన్ తీసుకురాలేదు అని చెప్తాడు రాజ్. ఇక రాజ్ కావ్య మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇది చూసిన పోలీసు... మీరు భార్యభర్తలే అని నమ్ముతున్న వదిలేయండి అని చెప్తాడు. ఎలా నమ్మారు అని కావ్య అడుగుతుంది. అనుభవం అమ్మా... చచ్చే దాక అత్తంటి వారిని ఆడిపోసుకునేది ఇద్దరే ఇద్దరు. వాళ్లే భార్యాభర్తలు అంటూ చెప్తాడు.
అర్ధరాత్రి భార్య లేపి... అడ్డమైనవి కోరితే.. తెచ్చేవాడే మాగాడు.. మొగుడు అంటూ చెప్తాడు. ఇక రాజ్ కావ్యను వెళ్లమని చెప్తాడు పోలీసు. పాన్ షాప్ వాడికి రాజ్ డబ్బులు ఇచ్చి వెళ్తారు. మరోవైపు తెల్లారి లేచే సరికి కనకం.. రుద్రాణి చీరలు కప్పుకుని ఉంటుంది. అది చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. కనకం అంటూ అరుస్తుంది. ఏమైంది అంటూ కనకం నిద్రలేస్తుంది. ఎందుకు నా చీరలు కప్పుకున్నావ్ అని అడిగితే... రాత్రి చలి బాగా వేసింది. మీరేమో దుప్పటి కప్పుకుని పడుకున్నారు. నాకు దుప్పటి కనబడక.. చీరలు తీసుకుని కప్పుకున్నాను అని కనకం చెప్తుంది. ఒక్కోటి 30వేల నుంచి లక్ష వరకు ఉంటుంది అని బాధ పడుతుంది రుద్రాణి.

మరోవైపు రాహుల్‌కి మైఖేల్ కాల్ చేస్తాడు. దీంతో షాక్ అయిన రాహుల్ బెడ్ రూమ్ నుంచి పక్కకు వెళ్లిపోతాడు. రాహుల్ వెళ్లడాన్ని చూసిన స్వప్న అతని వెంట వెళ్తుంది. నాకు ఎందుకురా కాల్ చేశావ్ అని రాహుల్ అడిగితే.. నాకు బెయిల్ ఇప్పించాల్సింది నువ్వే అంటాడు మైఖేల్. నేను ఎందుకు ఇప్పించాలిరా. నేరం చేసింది నువ్వు. శిక్ష అనుభవిస్తుంది నువ్వు అని రాహుల్ అంటాడు. నేరం, శిక్ష అని నువ్ మాట్లాడితే.. కిడ్నాప్, మర్డర్ అని నేను మాట్లాడాల్సి వస్తుంది. సొంత భార్యనే కిడ్నాప్ చేయించి మర్డర్ చేయమన్నావని చెబుతాను అని బెదిరిస్తాడు. నువ్ మాట్లాడిన కాల్స్ రికార్డ్ చేశాను అని మైఖేల్ అంటాడు
రాహుల్ షాక్ అవుతాడు. ఇక ఇదంతా చూసిన స్వప్న... రాహుల్ అని పిలుస్తుంది. ఏమైంది ఎందుకు సీరియస్ గా ఉన్నావ్. మళ్లీ ఏం చేస్తున్నావ్. ఏదైనా తప్పు చేస్తున్నావా అని స్వప్న అడుగుతుంది. నేను ఎందుకు చేస్తాను. ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. ఏదో హెల్ప్ కావాలంటా. నువ్ వెళ్లు అని స్వప్నను పంపిస్తాడు రాహుల్. మైఖేల్ కి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి వాన్ని ఫినిష్ చేయడం మంచిది అని రాహుల్ అనుకుంటాడు.
మరోవైపు అప్పుకి కల్యాణ్ కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఎవరమ్మా అని కృష్ణమూర్తి అడిగితే.. రాంగ్ నెంబర్ అని అప్పు అంటుంది. అప్పుడే కాదు రైట్ నెంబరే అని కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో అప్పు, కృష్ణమూర్తి, పెద్దమ్మా షాక్ అవుతారు. ఎన్ని సార్లు కాల్ చేసినా కట్ చేస్తావేంటీ. ఆన్సర్ చేసి ఏంటని తెలుసుకోరాదా. అసలు ఎందుకు కాల్ చేశాడని ఆలోచించవా. మీ అమ్మ చీరల కోసం పంపింది. నేను వచ్చే లోపు ప్యాక్ చేసి పెడతావని కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావ్. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను అని కల్యాణ్ అంటాడు. కృష్ణమూర్తి చెప్పడంతో.. అప్పు చీరలు తీసుకువస్తుంది. నిన్ను కూడా మీ అమ్మ రమ్మన్నది అంటూ అప్పును తీసుకునిపోతాడు కల్యాణ్.

మరోవైపు కావ్య ఇంకా నిద్రలేవలేదని అంతా అనుకుంటారు. తను నిద్ర పోతుందేమో. మీలో ఎవరైనా టీ పెట్టండి అని సుభాష్ అంటాడు. కాసేపు వాదించుకుంటారు ఇంతలో బయటి నుంచి రాజ్ కావ్య వస్తారు. కిల్లీ వాసన వస్తుందని ఎవరు ఏం అడిగిన మాట్లాడకూడదు అనుకుంటారు. లోపలికి వెళ్లి రాజ్ కావ్యను ఎక్కడికి వెళ్లారని అంతా అడుగుతారు. ఆయన బయటకు వెళ్దామంటే తోడుకు వెళ్లానని చెప్పి కావ్య చెప్పి వెళ్లిపోతుంది. నన్ను ఇరికించావ్ కదే అని రాజ్ అనుకుంటాడు. ఇంట్లో వాళ్లంతా రాజ్‌ను సరదాగా ఏడిపిస్తారు. ఇక తదుపరి ఎపిసోడ్ లో రాహుల్ నగలు తీసుకుని బయటకు వెళ్తాడు. అది ప్రకాశ్ లాగడంతో.. అతని బండారం బయటపడుతుంది.


Click it and Unblock the Notifications











