Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ షాకింగ్ నిర్ణయం.. వారం మధ్యలోనే ఎలిమినేషన్.. అతడి గెలుపు కోసమేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ షో మరో రెండు వారాల్లో ముగిసిపోనుంది. అయితే ప్రస్తుతం షోలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితో మరో ఆరుగురు మిగిలుతారు. కానీ ఐదుగురు మిగిలితే ఆ తర్వాతి వారం వారికి టాప్ 5 ఉంచి విన్నర్ ను డిక్లేర్ చేస్తారు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఓ కంటెస్టెంట్ ఎక్కువగా ఉన్నాడు. ఈక్రమంలోనే 14వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.

అంతే కాకుండా టాప్ 3లో ఉండే ఓ కంటెస్టెంట్ ను బయటకు పంపించబోతున్నారంటూ అంతా అనుకుంటున్నారు. ఎప్పటిలాగే ఓటింగ్ లో చివర ఉన్న వాళ్లను ఎలిమినేట్ చేస్తారని సమాచారం. ముఖ్యంగా ఈ వారం చివర్లో కాకుండా మధ్యలోనే ఓ కంటెస్టెంట్ ను ఇంటి నుంచి బయటకు పంపబోతున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. అమర్ దీప్ ను వారం మధ్యలోనే ఇంట్లోంచి పంపిస్తే పాజిటివ్ పెరిగి అతడే విన్ అయ్యేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇవన్నీ వాస్తవాలేనా అసలేం జరగబోతుందని అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mid Week Elimination in Bigg Boss Telugu 7 Show For Winning Amardeep

బిగ్ బాస్ తెలుగు 7 షో ఉల్టాపుల్టాగా కొనసాగుతోంది. వాస్తవానికి చివరి వారంలో ఐదుగురు మాత్రమే మిగలాల్సి ఉండగా.. ఈ సీజన్ లో మాత్రం ఆరుగురు కంటెస్టెంట్లు మిగలబోతున్నారు. ఇది నిజమే అయినప్పటికీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అస్సలే జరగదు. అందులోనూ టాప్ కంటెస్టెంట్ ను పంపించడం అనేది కుదరని పని. బిగ్ బాస్ షో నిర్వాహకులకు కంటెస్టెంట్లకు వచ్చే పాజిటివిటీ, నెగిటివిటీ కంటే కూడా రేటింగ్ యే ముఖ్యం. రేటింగ్ కోసమే వాళ్లు ఏవైనా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు.

కానీ కావాలని ఒకరిని పాజిటివ్ చేయడం, నెగిటివ్ చేయడం అనేవి ఉండవు. అయితే వారి వారి అదృష్టాలు, వారు చేసే పనులపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ షో నిర్వాహకులు స్టార్ మా బ్యాచ్ అంటే అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అంబటి అర్జున్ లకు కాస్త ఫేవర్ గా ఉన్న మాట వాస్తవమే. వారు ఎలిమినేట్ కాకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. కానీ వారి గెలుపు కోసం మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ అస్సలే పెట్టరు. పెడితే మొన్నే డబుల్ ఎలిమినేషన్ చేయడం లేదా ఒకర్ని సీక్రెట్ రూంకి పంపించడం చేయొచ్చు.

Mid Week Elimination in Bigg Boss Telugu 7 Show For Winning Amardeep

కానీ అలా చేయలేరు అంటేనే.. అలా చేసే అవకాశం ఉండదని అర్థం అయిపోతుంది. అలా కాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ముఖ్యంగా శనివారం ఒకరు, ఆదివారం ఒకరు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇదంతా కాదు అనుకుంటే సీరియల్ బ్యాచ్ వాళ్ల కోసమైనా టాప్ 5 కాకుండా టాప్ 6 పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ పరంగా పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా ఆ తర్వాత శివాజి, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ లు ఉన్నారు. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టిలు కనిపిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X