మంత్రితో అవినాష్‌ భేటీ: కమెడియన్‌కు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఏకంగా ముఖ్యమంత్రి నుంచే సపోర్ట్

అద్భుతమైన టైమింగ్‌తో పాటు ఆకట్టుకునే పంచులతో కామెడీని పంచుతూ చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్నాడు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్. దాదాపు ఐదారేళ్లుగా జబర్ధస్త్‌లో తన మార్క్ హాస్యంతో నవ్వులు పంచిన అతడు.. గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ షోతో బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ కుర్రాడు.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో అవినాష్ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా అతడికి సపోర్టు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే....

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా


మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు ముక్కు అవినాష్. ఆ సమయంలోనే జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు అందులో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. అలా ఎంటరైన అతడు ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చిందీ జబర్ధస్త్ యూనిట్. దీంతో అప్పటి నుంచి సెలెబ్రిటీగా వెలుగొందుతున్నాడు.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

లైఫ్ ఇచ్చిన షోకు గుడ్‌బై... కొత్త లైఫ్ స్టార్ట్స్

లైఫ్ ఇచ్చిన షోకు గుడ్‌బై... కొత్త లైఫ్ స్టార్ట్స్


జబర్ధస్త్ షోతో ఎనలేని క్రేజ్‌ను అందుకుని సినిమా ఛాన్స్‌లు కూడా దక్కించుకున్నాడు అవినాష్. ఈ క్రమంలోనే అతడికి బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది వచ్చిన నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వాలని అతడిని కోరారు. దీంతో రెండో వారంలో జోకర్ గెటప్‌తో అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చ రచ్చ చేసేశాడు.

నిరాశ తప్పలేదు... అయినా మంచి పేరుతో

నిరాశ తప్పలేదు... అయినా మంచి పేరుతో


బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే అవినాష్‌ను టైటిల్ ఫేవరెట్ అనుకున్నారంతా. అందుకు అనుగుణంగానే చాలా రోజుల పాటు టాప్‌లో ఉన్నాడు. కానీ, ఆ తర్వాత కొన్ని గొడవలు, వివాదాల కారణంగా అతడిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఓటింగ్ కూడా తగ్గిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ, ఎంటర్‌టైనర్‌గా పేరును మాత్రం సంపాదించుకున్నాడు.

అలా రచ్చ చేస్తున్న ఎంటర్‌టైనర్ అవినాష్

అలా రచ్చ చేస్తున్న ఎంటర్‌టైనర్ అవినాష్

బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ వరుస షోలలో ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రారంభమైన 'కామెడీ స్టార్స్' అనే షో చేస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌తో పాటు చమ్మక్ చంద్ర తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

మంత్రితో సమావేశం అయిన బెస్ట్ కమెడియన్

మంత్రితో సమావేశం అయిన బెస్ట్ కమెడియన్

వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ముక్కు అవినాష్. ఈ కారణంగానే ప్రతి కార్యక్రమంలోనూ అతడు సందడి చేస్తున్నాడు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో ముక్కు అవినాష్ సమావేశం అయ్యాడు. క్యాంపు ఆఫీసులో భేటీ అయిన వీళ్లిద్దరూ చాలా సేపు ముచ్చటించారు.

కమెడియన్‌కు అండగా నిలిచిన ప్రభుత్వం

కమెడియన్‌కు అండగా నిలిచిన ప్రభుత్వం

ముక్కు అవినాష్ మదర్‌ను అనారోగ్య సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో దీని గురించి వెల్లడించాడతను. ఈ క్రమంలోనే తాజాగా అతడి తల్ల లక్ష్మీ కాంతంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి రూ. 60 వేలు ఆర్థిక సహాయం అందింది. ఈ చెక్‌ను మంత్రి కొప్పుల.. అవినాష్‌కు అందించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కొప్పుల

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కొప్పుల


అవినాష్ తల్లికి సహాయం చేసిన విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు మంత్రి కొప్పుల. ఈ మేరకు 'జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 60 వేలు మంజూరు కాగా.. ఈరోజు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆమె కుమారుడు అవినాష్‌కు చెక్కును అందించా' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X