‘స్టార్ పక్కన ఆఫర్ పేరుతో ట్రాప్... అలా ఆశచూపి తీరని మోసం‘

సినీరంగంలో స్టార్స్‌గా వెలుగొందుతున్న వారి జీవితాల వెనుక కనిపించని కథలు, వ్యథలు ఎన్నో. వీటిని భరించలేక మధ్యలోనే రన్నింగ్ రేస్ ఆపేసిన వారు కొందరైతే.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ముఖ్యంగా మహిళ నటులు, హీరోయిన్లను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వంచించి లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతినిత్యం ఎవరో ఒకరు బయటపెడుతూనే ఉన్నారు.

వందలాది సినిమాలలో తల్లి, వదిన, అత్త పాత్రలలో మెప్పించారు మిర్చి మాధవి. ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి, ప్రేమయుద్ధం తదితర సినిమాలలో నటించారు. కానీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే 2013లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చితో ఆమె బాగా పాపులర్ అయ్యారు. నాటి నుంచి ఆమెను మిర్చి మాధవి అని పిలుచుకుంటున్నారు అభిమానులు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా మాధవి దూసుకెళ్తున్నారు. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరో రిషికి పెద్దమ్మ దేవయాని పాత్రతో మెప్పించారు. సినీ, టీవీ రంగాలను బ్యాలెన్స్ చేసుకుంటూ మాధవి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు, ఇతర సంఘటనలను ఆమె బయటపెట్టారు.

Mirchi Madhavi Opens Up About Casting Couch Experience in Film Industry

100 పర్సెంట్ లవ్ మూవీలో చేసిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి ప్రకాష్‌రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ ఒక ఐదుగురు ఉంటారు. కాంప్రమైజ్ అయితే అన్నాడు. దేనికని అడిగా.. అప్పటికీ నాకు తెలివిలేని తనం. అతని పేరు భాస్కర్.. మనిషి తెలియదు, ఎదురుగా చూడలేదు. ఫోన్‌లోనే ఇదంతా. వచ్చిన కాల్ అయితే నిజం.. నేను ఏది ఉన్నా, ఉన్నది ఉన్నట్లుగా చెబుతా. మీకు 100 పర్సెంట్‌ లవ్‌లో జరగలేదా అన్నాడు. అలాంటిదేం జరగలేదు.. 100 పర్సెంట్ లవ్‌లో 25 రోజులు పనిచేశా. సుకుమార్ గారు బంగారంలా సెలెక్ట్ చేసుకున్నారు, హ్యాపీగా పనిచేసుకున్నా వచ్చేశా. సాత్విక్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు.. పిల్లలందరినీ ఆడిస్తున్నాడు. అప్పుడు ఫన్‌గా ఉండేది, కారు పార్కింగ్ ప్లేస్‌లో హాయిగా కుర్చీలు వేసుకుని కుర్చునేవాళ్లం. ఫుడ్ అక్కడే తినేసేవాళ్లం.. అవసరమైతే నేనే తినిపించేదానిని. అలా ఆడుతూ పాడుతూ చేసుకుని వచ్చేసేవాళ్లమని మాధవి తెలిపారు.

అతను మాత్రం 100 పర్సెంట్ లవ్‌లో మాకు తెలుసు అన్నాడు. సరే వాళ్లని అడగండి, ఫోన్ చేయించండి అన్నా. అప్పటికీ నాకు అర్ధమైపోయింది. మనం గొడవలు పడి ఏం సాధించలేదు. ఆ తర్వాత ఇంకెప్పుడూ అలాంటి ఇబ్బందిపడలేదు. ఐదుగురం ఉంటామని అడిగితే ఏం చెబుతాను, నేను అలా డిసైడ్ అయితే అదే పని చేసుకుంటాం, డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. ఇప్పటి వరకు అలా డిసైడ్ కాలేదని చెప్పా. చూసుకోండి మరి మంచి ఆపర్చ్యూనిటీ అన్నాడు. నేను మాత్రం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందన్నానని ధీటుగా చెప్పానని మిర్చి మాధవి అన్నారు.

ఇలాంటి సంస్కృతి ఒక్క ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోటా ఉంటుంది. మేం లైమ్ లైట్‌లో ఉంటాం కాబట్టి.. మీడియా మమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కో స్టార్స్ రాసుకుపూసుకుని నటిస్తారు, వాళ్లను దూరం నెట్టలేం. భుజాలు రాస్తూ ఉంటారు, వద్దని చెప్పలేం. కొంతమంది తోసేస్తూ ఉంటారు, వాళ్లకే కెమెరా కావాలి. ఫ్యామిలీ సీన్స్ చేసేటప్పుడు ఇది దారుణంగా ఉంటుంది. ఓ సీన్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ దబాయించడంతో పక్కనే ఉన్న రజిత గారు వార్నింగ్ ఇచ్చి సేవ్ చేశారు. ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు తప్ప ఫ్రెండ్స్ ఎవరూ ఉండరని మిర్చి మాధవి తేల్చేశారు.

నీకు లేదు కదా అని చులకన చేయను, నీకుంది కదా అని నెత్తిన పెట్టుకునే రకం కాదు. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెబుతాను తప్పించి పొగడ్తలు, ఎక్కువ చేసి చెప్పడం నాకు రాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వంటి చీప్ ట్రిక్స్ నా బ్లడ్‌లోనే లేదు. షుగర్ కోట్ వేయడం అసలే రాదు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారితో నటించాను. వాళ్లంతా గ్రేట్ పర్సన్స్.. మా స్థాయి ఇది అని తేడాలు చూపించుకుండా నవ్వుతూ పలకరిస్తారు. తెలుగుతో పాటు తమిళ్, భోజ్‌పురి, కన్నడ సినిమాలలో నటించానని మాధవి వెల్లడించారు.

Read more about: mirchi madhavi casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X