‘రాసుకు పుసుకుని తిరగాలా.. 500 రూపాయల కోసం నన్ను దారుణంగా’

సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మిర్చి మాధవి. నటనతో పాటు డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు మాధవి. ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్ర పరిశ్రమలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవి తాను కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓపెన్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

మిర్చితో ఫేమస్
ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి, ప్రేమయుద్ధం తదితర సినిమాలలో నటించారు మాధవి. అయితే 2013లో కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చితో ఆమె బాగా పాపులర్ అయ్యారు. నాటి నుంచి ఆమె తన ఇంటి పేరుని మిర్చిగా మార్చుకున్నారు. అలా అభిమానులతో మిర్చి మాధవిగా ఇండస్ట్రీలో పిలిపించుకుంటున్నారు మాధవి. సినిమాలతో పాటు బుల్లితెరపైనా మాధవి సత్తా చాటారు. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరో రిషికి పెద్దమ్మ దేవయానిగా నెగిటివ్ పాత్రలో పోషించి కుటుంబ ప్రేక్షకులతో ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిర్చి మాధవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Mirchi Madhavi Opens Up About Struggles and Reality of Telugu Film Industry

మనం అనుకున్న అవకాశాలు రావు
అవకాశాలు రాకుండా ఏమీ లేదు.. కానీ మనం అనుకున్నవి రావాలి. ఇండస్ట్రీలో కొన్ని కొన్ని అంశాలు నాకు నచ్చడం లేదు. సినిమా నా ప్రాణం, సర్వస్వం అనుకుని దేనిని అనుకోను.. నన్ను నేను నమ్ముకుని వచ్చాను. కుటుంబం గడవటం కోసం ఒక ఉపాధి అనుకుని వచ్చిన అవకాశాన్ని మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. అవకాశం వచ్చిందని ఉబ్బిపోను, కుంగిపోను... చిన్న వయసులోనే అవన్నీ పడి పడి ఉన్నాను. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడు ఉంటాడు. నేను జీవితంలో ఇంకా చాలా చేయాల్సి ఉంది అని మిర్చి మాధవి తెలిపారు.

చెప్పు తీసుకుని కొడతా
నన్ను ప్రేమించకపోయినా, నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు.. నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. కుటుంబ నేపథ్యంలో కావొచ్చు, మరేదైనా కారణం కావొచ్చు ఎక్కువగా చీరలో ఉండేందుకే ఇష్టపడతా. సుకుమార్ గారి దర్శకత్వంలో 100 పర్సెంట్ లవ్ చేశాను, రంగస్థలంలో అవకాశం వచ్చింది కానీ చేయలేకపోయాను. బాగా సన్నగా ఉండటంతో చైతూకి తల్లిగా చేయగలుగుతుందా అని డైరెక్టర్‌గారు కంగారుపడ్డారు. సుకుమార్ గారి టీమ్ మొత్తానికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం.. వెళ్తూ వెళ్తూ చాలా స్వీట్స్ తీసుకెళ్లి ఇచ్చేదానిని అని మాధవి అన్నారు.

అవకాశాల కోసం అడుక్కోలేం కదా
సినిమా షూటింగ్స్‌లో చాలా సరదాగా ఉంటుందని, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారని అనుకుంటారు. కానీ అక్కడ వాతావరణం సీరియస్‌గా ఉంటుంది. సీన్ ఎలా తీయాలి, లైటింగ్ ఎలా ప్లాన్ చేయాలి ఇదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మేం ఎక్కడో ఉంటే షాట్ రెడీ అని చెబుతారు. మా షాట్ పూర్తవ్వగానే రిలాక్స్ అంటారు సైలెంట్‌గా వచ్చేయాలి. అంతేకానీ సార్ మీరు బాగున్నారా? మీ ఊరిలో సంగతులేంటీ? అని ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. సెట్స్‌లో మాట్లాడటం కుదరదు.. ఫోన్ నెంబర్స్ తీసుకుని మాట్లాడుకోవడమే. నా దగ్గరికి వచ్చి నీకు బలుపు, ఈగో అంటేనే కదా నాకు తెలిసేది. అడగనీదే అమ్మాయినా పెట్టదు అలాగని మరి అడుక్కోలేం కదా. అలాగనీ నేనేం ఖాళీగా ఏం లేను. సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. నా ముందు ఎవడైనా చెత్త మాటలు మాట్లాడితే లేచి వెళ్లిపోతా. నేను ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు. నాకిష్టం లేదు.. నేను ఎవ్వరితోనూ రాసుకుని పూసుకుని తిరగలేను. అలా కాకుండా నేను ఈగో చూపిస్తానని అనుకుంటే అది వాళ్ల ప్రాబ్లమ్ అని మాధవి అన్నారు.

500 కోసం తీసేశారు
సీరియల్ ఇండస్ట్రీలో కొన్ని వీక్స్ కోసం మనల్ని తీసుకుంటారు. రెండు వారాలు వర్క్ చేస్తారు, రెండు వారాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. 14 రోజులలో మాకు 4 రోజులు వర్క్ వస్తుంది, మిగిలిన 10 రోజులు ఏం చేయాలి. 10 రోజులు ఖాళీగా ఉన్నాం.. ఏమైనా చేద్దామంటే డేట్స్ ముందుకు వెళ్లనీయవు. సడెన్‌గా షూటింగ్స్ క్యాన్సిల్ అయితే ఆరోజు రెమ్యునరేషన్ రాదు. ట్రాన్స్‌పోర్ట్, టైమింగ్స్, పొద్దున్న లేవడం వల్ల ముఖం పాడైపోవడం, ఫిట్‌నెస్ ట్రై చేద్దామని జిమ్‌కి వెళ్దామనుకుంటే మళ్లీ షూటింగ్‌కి పిలుస్తారు. ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. ఇండస్ట్రీలో కొంతమందికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. కొంతమందికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన ఓపికని పరీక్షిస్తారు. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నా 500 రూపాయలు రెమ్యునరేషన్ పెంచమన్నందుకు ఓ ప్రాజెక్ట్‌లో నా స్థానంలో వేరే వాళ్లని తీసుకున్నారు అని మిర్చి మాధవి గుర్తుచేసుకున్నారు.

More from Filmibeat

Read more about: mirchi madhavi prabhas nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X