ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ చర్చనీయమే. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటున్నారు. ఈ సమస్య గురించి గతంలో కూడా పలువురు నటీమణులు ఓపెన్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్, బుల్లితెర నటి మిర్చి మాధవి కూడా తన కెరీర్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల పేరుతో తనపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారనీ, తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

మిర్చి మాధవి.. సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ రెండింటిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300కు పైగా సినిమాలు, 20కు పైగా సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా మిర్చి సినిమాలో చేసిన పాత్రతో ఆమెకు "మిర్చి మాధవి" అనే పేరు స్థిరపడింది. అలాగే 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్స్‌లోనూ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కూడా పలు టెలివిజన్ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవి సినీ పరిశ్రమలో అవకాశాలు పొందడం ఎంత కష్టమో వివరించారు.ప్రతిభ ఒక్కటే సరిపోదని, అవకాశాలు రావాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉండే పరిస్థితులు, పారితోషికంలో అసమానతలు, మహిళా నటులపై ఉండే ఒత్తిళ్ల గురించి ఆమె తన అనుభవాలను వెల్లడించారు.

Mirchi Madhavi Opens Up on Casting Couch Actress Reveals Shocking Compromise Offer

ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందిస్తూ.. తనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని మాధవి చెప్పారు.'100% లవ్' సినిమా తనకు ఫోన్ ఒక్క వ్యక్తి ఫోన్ చేసి.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సరసన భార్య పాత్రలో అవకాశం ఉందని చెప్పాడు. దానికి బదులుగా "కాంప్రమైజ్" చేయాలని సూచించాడని వెల్లడించారు. "మేము ఐదుగురం ఉంటాం... ఒప్పుకుంటే మంచి అవకాశం ఇస్తాం" అని అతడు చెప్పాడని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరు భాస్కర్ అని చెప్పాడని, కానీ అతను ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ డైరెక్టర్ గా కలవలేదని తెలిపారు.

అతడు "100 పర్సెంట్ లవ్ సినిమాలో మీరు చేసిన పాత్ర గురించి మాకు తెలుసు" అంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేశాడని మాధవి చెప్పారు. అయితే వెంటనే అప్రమత్తమైన తాను, "మీరు చెబుతున్న వాళ్లతోనే నాకు మాట్లాడించండి" అని సమాధానం ఇచ్చానని, అప్పటికే అతడి ఉద్దేశం తనకు పూర్తిగా అర్థమైందని తెలిపారు. దానికి ఆ వ్యక్తి "ఇది చాలా మంచి అవకాశం" అని ఒప్పించే ప్రయత్నం చేస్తే.. "అలాంటి దాని అయితే.. అదే పని చేసేదాన్ని కదా సర్. ఇంకా డబ్బులు బాగా వస్తాయి. కానీ నేను చేయను, ఇది కాకపోతే మరో అవకాశం వస్తుంది" అంటూ స్పష్టంగా తిరస్కరించానని వెల్లడించారు.

ఆ సంఘటన తర్వాత తనకు అలాంటి ఫోన్లు మళ్లీ రాలేదని మిర్చి మాధవి చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఆమె ఎవరిపైనా ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు. ఆ వ్యక్తి లేదా దర్శకుడి పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు.

Read more about: mirchi madhavi casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X