Bigg Boss NonStop: 11వ కంటెస్టెంట్‌గా మిత్ర శర్మ.. వస్తూనే వరుస షాకులు .. బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
భారీ అంచనాలు ఉన్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కొత్త ఫార్మాట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. హోస్ట్ నాగార్జునగా ఈ బిగ్‌బాస్ నాన్ స్టాప్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు నుంచి 18 మంది కంటెస్టెంట్స్ అనుకుంటూ ఉండగా ఒకరిని తగ్గించి 17 మందే ఎంట్రీ ఇచ్చారు. ఇక షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్లను రెండుగా విభజించారు. ఒక టీమ్‌కు వారియర్స్, రెండో టీమ్‌కు ఛాలెంజర్స్ అని పేర్లు పెట్టారు.
వారియర్స్ టీమ్‌లో బిగ్‌బాస్ తెలుగు షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లు ఉండగా కొత్తగా బిగ్‌బాస్‌లోకి వచ్చిన వారిని ఛాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. ఇక 11వ కంటెస్టెంట్ గా యంగ్ హీరోయిన్ మిత్ర శర్మ. అయితే ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏమేం చేసింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

11వ కంటెస్టెంట్‌గా
బిగ్ బాస్ ఓటీటీలో 11వ కంటెస్టెంట్‌గా అడుగుటపెట్టింది ముంబై భామ మిత్రా శర్మ. హీరోయిన్‌గా నిర్మాతగా టాలీవుడ్‌లో ప్రయత్నాలు చేస్తున్న ఆమె తాను ముంబై నుంచి హైదరాబాద్ ఎలా వచ్చింది.. ఒంటరిగా ముంబై నుంచి ఇక్కడికి వచ్చి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించడానికి ఎలాంటి కష్టాలను పడిందో స్టేజ్‌పై చెప్పింది మిత్ర. తన తల్లిదండ్రుల బ్రేకప్ గురించి ముందు చెప్పి ఎమోషనల్ అయిన ఆమె తన తండ్రి ఒక విద్యారంగానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు.

రెండో పెళ్లి
తన కోసం తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నాడు అని మిత్రా వెల్లడించింది. ఇక యాక్టింగ్‌పై ఆసక్తితో ట్రైనింగ్ తీసుకున్నాను అని అలా తీసుకుంటూనే చదువు పూర్తి చేశానని పేర్కొంది. ఇక ఆ సమయంలో మా నాన్న మరణించడంతో ముంబైని వదిలి హైదరాబాద్‌కు వచ్చాను. చాలాసార్లు ఆఫర్ల కోసం ట్రై చేయడంతో రిజెక్ట్ రిజెక్ట్ అనే సమాధాన వినీ వినీ తన పేరే మర్చిపోయాను అని వెల్లడించింది.

తొలి సంధ్యవేళలో
ఇక చివరకు తొలి సంధ్యవేళలో సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను, ఆ తరువాత రెండు మూడు సినిమాలు వరుసగా చేశాను కానే నేనే శ్రీ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి బాయ్స్ అనే సినిమాను నిర్మించాను అని చెప్పారు.. బిగ్ బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువు కావాలనే ఇక్కడకి వచ్చానని ఆమె పేర్కొంది.

కల నెరవేరింది
ఇక మిమ్మల్ని కలవడం నా కల అని నాగార్జునతో పేర్కొన్న ఆమె ఆయన్ని చూడటంతో నా కల నెరవేరింది అని పేర్కొంది. ఇక అసలు పేరు ఏంటి? అని అడగగా నా అసలు పేరు మిత్రవింద అని పేర్కొంది. మరి మగధీరుడు దొరకలేదా? అంటే దొరకలేదని పేర్కొంది. నేను ఎంత మాట్లాడతానో ఏం చేస్తానో చూపిస్తా.. ఫుల్ డ్రామాతో అలరిస్తా' అంటూ బిగ్ బాస్ హౌస్‌లో మిత్ర అడుగుపెట్టింది. అంతే కాక ఆమె లోపలికి వెళ్ళడంతోనే డౌట్ గా ఉన్న అందరినీ అన్నయ్య అని పిలుస్తూ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











