Bigg Boss Winner: పల్లవి ప్రశాంత్‌పై హరీష్ రావు ఊహించని వ్యాఖ్యలు.. వైరల్ చేస్తున్న అభిమానులు
ఎన్నో అంచనాల నడుమ మొదలై.. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రేక్షకులకు పదిహేను వారాల పాటు వినోదాన్ని పంచింది బిగ్ బాస్ ఏడో సీజన్. ఇందులో అంతకు ముందెన్నడూ చూడని ఎన్నో అంశాలను చూపించడంతో పాటు ఆడియెన్స్ షాక్‌కు గురయ్యేలా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను కూడా ఇచ్చారు. ఫలితంగా ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయింది.
బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి ప్రసారం చేశారు. ఇందులో కంటెస్టెంట్లు, హీరోయిన్ల పెర్ఫార్మెన్స్‌లతో సందడి చేశారు. అలాగే, కొందరు స్టార్లు కూడా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. మొత్తానికి ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎన్నో అంచనాల నడుమ మొదలై.. వాటిని తలదన్నే రీతిలో ముగిసిపోయింది.

ఈ సీజన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టారు. వారిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరకు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి మాత్రం టాప్ 2గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమ వీళ్లిద్దరిలో రైతు బిడ్డ విజయం సాధించినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
మామూలుగా పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి అడుగు పెట్టాడు. ఆరంభంలో కాస్త విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత తనదైన ఆటతీరు, మాటతీరుతో తిట్టినోళ్ల నోళ్లను మూయించాడు. ఆ తర్వాత కూడా టాస్కుల్లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి సత్తా చాటుకున్నాడు. చివరికి ఈ సీజన్‌లో విజేతగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా మారిపోయాడు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో అతడి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన కంటెస్టెంట్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. అదే సమయంలో చాలా మంది ప్రముఖులు కూడా అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పల్లవి ప్రశాంత్ ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు, 'మా సిద్ధిపేట ముద్దుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచినందుకు అభినందనలు. రైతు అనే దానిని ఇంటి పేరుగా మార్చుకుని ఈ సీజన్‌లో చూపించిన ఆటతీరు అద్భుతంగా సాగింది. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకూ అతడి ప్రయాణం ఆదర్శంగా నిలవడంతో పాటు ఎన్నో హృదయాలను కొల్లగొట్టింది' అని కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











