For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్ ఎన్టీఆర్ రెడీ.. సెలబ్రిటీల లిస్టులో ముమైత్, శ్రీముఖి.. హాట్ ‌హాట్ ఇంకా మరికొన్ని

By Rajababu
|

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో ప్రారంభ తేదీ సమీపిస్తున్న కొద్ది బుల్లితెర ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరుగుతున్నది. వెండితెర మీద మెరుపులు మెరిపించిన జూనియర్ ఎన్టీఆర్ టెలివిజన్ స్క్రీన్‌పై ఎలా రాణిస్తాడో చూడాలనే క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌కు బిగ్‌బాస్ హోస్ట్‌గా అవకాశం రావడం మరింత ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీ పోటీదారులు ఎవరనే ఆసక్తి నెలకొని ఉంది. పోటీదారుల జాబితాను బిగ్‌బాస్ నిర్వాహకులు చాలా గోప్యంగా ఉంచుతున్నప్పటికీ.. పలువురు సెలబ్రిటీ పేర్లు మీడియాలో నానుతున్నాయి.

బిగ్‌బాస్ ఓ సర్‌ప్రైజ్, కాంట్రవర్సీ

బిగ్‌బాస్ ఓ సర్‌ప్రైజ్, కాంట్రవర్సీ

బేసిక్‌గా బిగ్‌బాస్ అనేక సర్‌ప్రైజ్‌లకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రియాలిటీ షో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటుందా? ప్రేక్షకులను ఆలరించే సెలబ్రీటలు ఎవరు? జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్ రియాలిటీ షో ఎలా నెగ్గుకొస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సిద్ధమవుతున్న 12 సెలబ్రిటీలు

సిద్ధమవుతున్న 12 సెలబ్రిటీలు

జూలై 16న ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షో కోసం 12 మంది సెలబ్రిటీలు సిద్దమవుతున్నారు. బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌లో పాల్గొనే పోటీదారుల జాబితాలో ఆసక్తికరమైన పేర్లు కొత్తగా తెరమీదకు వచ్చాయి. వారిలో మంచు లక్ష్మీ, జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్, పోసాని కృష్ణమురళి, రంభ, సదా, ఆదర్శ్ బాలకృష్ణ, ముమైత్ ఖాన్, శ్రీముఖి లాంటి పేర్లు కంటెస్టంట్ జాబితాలో ఉన్నట్టు తెలుస్తున్నది. వీరంతా జూలై 13న ముంబైకి సమీపంలోని లోనావాలాలో ఏర్పాటు చేసిన హౌస్‌లోకి వెళ్లనున్నదనే తాజా సమాచారం.

Bigg Boss Telugu : List Of Celebrities Participating In NTR's Bigg Boss Show
ధన్‌రాజ్ జబర్దస్త్‌గా..

ధన్‌రాజ్ జబర్దస్త్‌గా..

టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కమెడియన్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకొన్న వారిలో ధన్‌రాజ్ ఒకరు. కామెడీ టైమింగ్‌లో ధన్‌రాజ్‌ది ఓ ప్రత్యేకమైన స్టయిల్. జబర్దస్త్, ఇతర టెలివిజన్ కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులకు ధన్‌రాజ్ అంటే మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈయనను ఎంపిక చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

విలన్ పాత్రలతో ఆదర్శ్ బాలకృష్ణ

విలన్ పాత్రలతో ఆదర్శ్ బాలకృష్ణ

టాలీవుడ్‌లో హీరో వేషాలతోపాటు పలు చిత్రాల్లో అదర్శ్ బాలకృష్ణ విలన్‌గా కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా అంత గొప్ప పేరుతెచ్చుకోకపోయినా సెలబ్రిటీ క్రికెట్ తదితర అంశాలతో మంచి గుర్తింపు అయితే ఉంది. యూత్ ప్రేక్షకులకు, కామెడీ అంశాలకు బాగా పనికి వస్తాడనే ఆదర్శ్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంపిక చేసి ఉండవచ్చు.

ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే..

ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే..

సెక్స్‌బాంబ్ ముమైత్ ఖాన్ అంటే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే.. పాట చటుక్కున గుర్తుకు వస్తుంది. ఆ మధ్యలో టాలీవడ్ సిల్వర్ స్రీన్‌పై సెగలు పుట్టించిన ముమైత్ ఖాన్ ఉన్నట్టుండి మాయమై పోయింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా కూడా నటించిన గుర్తింపు ఉంది. టాలీవుడ్‌కు దూరమైనా గానీ ముమైత్ ఖాన్‌కు జనంలో మంచి క్రేజ్ ఉంది.

తెరపైకి మంచులక్ష్మీ పేరు

తెరపైకి మంచులక్ష్మీ పేరు

టాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న యాక్టర్లలో మంచు లక్ష్మి ఒకరు. సినీ నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మంచు లక్ష్మీతోపాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశం కనిపిస్తున్నది.

రంభ ఎంట్రీతో బిగ్‌బాస్‌కు కల

రంభ ఎంట్రీతో బిగ్‌బాస్‌కు కల

వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్ రంభ ప్రస్తుతం టెలివిజన్ రియాలిటీ షోలో జడ్డీగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొనే అగ్రతారల్లో రంభ ఒకరు కావడం మరో విశేషం. యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకమైన పాటలో కూడా నర్తించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రంభ ఒకరు. రంభ గ్లామర్ బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

బిగ్‌బాస్‌‌ హౌస్‌లో పోసాని

బిగ్‌బాస్‌‌ హౌస్‌లో పోసాని

టాలీవుడ్‌లో పోసాని కృష్ణమురళిది ప్రత్యేకమైన శైలి. మాటల రచయితగా పరిశ్రమలోకి వచ్చిన పోసాని ఆ తర్వాత నటుడిగా, దర్శకుడి, నిర్మాతగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆరిస్ట్‌లో పాపులర్ అనే ముద్ర ఉంది. టెలివిజన్ రంగంలో జీ చానెల్లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారనే అంశంతో ఆయన బిగ్‌బాస్‌కు పోసాని ఒకే చెప్పినట్టు సమాచారం.

బిగ్‌బాస్ జాబితాలో సదా

బిగ్‌బాస్ జాబితాలో సదా

బిగ్‌బాస్‌లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా. దక్షిణాదిలో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కుదుర్చుకొన్న నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం.

బిగ్‌బాస్‌తో స్నేహ మెరుపులు

బిగ్‌బాస్‌తో స్నేహ మెరుపులు

తెలుగు చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా రాణించిన స్నేహ కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనున్నారు. ఆమె నటించిన చిత్రాలు దక్షిణాదిలో చాలా సక్సెస్‌గా నిలిచాయి. పలు భాషల్లో అగ్రహీరోల సరసన ఆమె నటించిన ఘనత ఉంది. స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

English summary
Junior NTRs Bigboss show is now talk of the Industry. There rumours about the show related celebrities. Sources suggest that Tollywood actress Mumaith Khan, Tejaswi Madivada, comedian Dhanraj are the star guests on the reality show. "Tejaswi has been finalised and will leave for Lonavala on July 13 where the Bigg Boss house has been set up,".
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more