twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాకిస్థానీలతో షో... ఆశా భోంస్లే షోకు వార్నింగ్

    By Bojja Kumar
    |

    Asha Bhosle
    ముంబై: ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే జడ్జిగా వ్యవహరిస్తున్న మ్యూజిక్ షో 'సుర్ -క్షేత్రా'కు 'మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన'(ఎంఎన్ఎస్) వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ సింగర్లు ఈ షోలో పాల్గొనడమే ఈ వివాదానికి కారణం అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థానీలు ఈ షోలో పాల్గొనడాన్ని సహించబోమని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.

    ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ...తాము కళను గౌరవిస్తామని, కానీ పాకిస్థానీలను భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసారు. ఇటీవల ఏక్ థా టైగర్ చిత్రాన్ని పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసారు. భరత్‌కు బద్ద శత్రవులైన పాకిస్థానీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సహించరానిదన్నారు.

    ఈ షోలో పాకిస్థానీ ప్రముఖ సింగర్ ఆతిఫ్ అస్లామ్, భారతీయ ప్రముఖ గాయకుడు హిమేష్ రేష్మియా...లాంటి వాళ్లు తలపడుతున్నారు. అయితే టీవీ రేటింగులు పెంచుకోవడం కోసం పాకిస్థానీలను రప్పించే సంస్కృతిని సహించబోమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వాదిస్తోంది.

    English summary
    The Maharashtra Navnirman Sena has threatened to disrupt Sur-Kshetra, a music show in which eight vocalists from Pakistan and an equal number of Indian singers are scheduled to participate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X